ఇకపై రొటీన్ సినిమాల్లో నటించనంటున్న రవితేజ !

మాస్ మహారాజ రవితేజ ఈ నెల 18న తన కొత్త చిత్రం ‘రాజా ది గ్రేట్ తో ప్రేక్షకుల ముందుకురానున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత ఆయన నుండి వస్తున్నా సినిమా కావడం, అది కూడా ఆసక్తికరమైన కథాంశంతో కూడినది కావడంతో ఎలా ఉండబోతోందో చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పుష్కలంగా కనిపిస్తోంది. రవితేజ కూడా తాను చేస్తున్న ఈ అంధుడి పాత్ర అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నారు.

అంతేగాక ఇకపై రొటీన్ ధోరణిలో సినిమాలు చేయనని, భిన్నంగా ఉండే కథల్నే ఎంచుకుంటానని అంటున్నారు. అలాగే ఈ రెండేళ్ల గ్యాప్ కావాలని తీసుకున్నది కాదని, దానంతట అదే వచ్చిందని, ఈ మధ్యలో కొన్ని కథలు అనుకున్నా అవి వర్కవుట్ కాలేదని చెప్పుకొచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించగా సాయి కార్తీక్ సంగీతాన్ని అందించారు.

 

Like us on Facebook