ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: నిఖిల్ – బాహుబలి హావాలో కూడా మా సినిమా మంచి హైప్ తెచ్చుకుంది !

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: నిఖిల్ – బాహుబలి హావాలో కూడా మా సినిమా మంచి హైప్ తెచ్చుకుంది !

Published on May 18, 2017 3:05 PM IST


రోటీన్ సినిమాల్ని పక్కనబెట్టి, కమర్షియల్ చట్రంలో ఇరుక్కుపోకుండా ఎప్పటికప్పుడు కొత్త కథలని ఎంచుకుంటూ భిన్నమైన సినిమాలతో వరుస సక్సెస్లను అందుకుంటున్న యంగ్ హీరో నిఖిల్ రేపు ‘కేశవ’ సినిమాతో మన ముందుకొస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన చిత్రం సంగతులను మాతో ప్రత్యేకంగా పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) సినిమా రిలీజ్ పట్ల ఏమైనా టెంక్షన్ ఫీలవుతున్నారు ?
జ) బాహుబలి లాంటి సినిమా ఇంకా స్ట్రాంగ్ గా నడుస్తున్న సమయంలో నా సినిమా రిలీవుతుండటం కాస్త టెంక్షన్ గానే ఉంది. పైగా మొదటిసారి చాలా భిన్నంగా ట్రై చేశాను. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని ఉంది.

ప్ర) ‘కేశవ’ భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఎలా ఫీలవుతున్నారు ?
జ) అవును. ఇదేనాకు అతి పెద్ద రిలీజ్. 650 థియేటర్లలో సినిమా విడుదలవుతోంది. ఆస్ట్రేలియా, లాంటి చోట్ల నా సినిమా విడుదలవడం ఇదే మొదటిసారి. చాలా ఎగ్జైటింగా ఉంది.

ప్ర) ‘కేశవ’ కథలో మీకు బాగా నచ్చిన అంశమేమిటి ?
జ) మొదటిసారి పూర్తిస్థాయి సీరియస్ సబ్జెక్ట్ చేసే ఛాన్స్ దక్కింది. అంతేగాక నాలోని నటనను బయటపెట్టడానికి ఈ స్క్రిప్ట్ లో చాలా అవకాశముంది. నా పాత్ర ద్వారా జనరేట్ అయిన ఎమోషన్స్ ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి.

ప్ర) మీ డైరెక్టర్ కి సలహాలేమైనా ఇచ్చారా ?
జ) నటనంకు ఆస్కారమున్న మంచి కథల్ని ఎంచుకోవడమే నా పని. ఒకసారి షూటింగ్ కు వెళ్ళాక డైరెక్టర్ కి సహాలివ్వడం లాంటివేమీ చెయ్యను. అంతా వాళ్ళకే వదిలేస్తాను.

ప్ర) సినిమా మీద చాలా హైప్ ఉంది. దాన్ని సినిమా నిలబెడుతుందా ?
జ) ఖచ్చితంగా నిలబెడుతుంది. బాహుబలి హవాలో కూడా మా సినిమా మంచి హైప్ తెచ్చుకుంది. అది మంచి ఓపెనింగ్స్ రావడానికి ఉపయోగపడుతుంది. మొదటి మూడు వారాల్లో మంచి కలెక్షన్లు వస్తే నిర్మాతలు సేఫ్ జోన్లోకి వెళతారు.

ప్ర) మీ డైరెక్టర్ సుధీర్ వర్మ మీ నటన చూసి ఆశ్చర్యపోయానని అంటున్నారు ?
జ) నవ్వుతూ.. నేను ఎంత బాగా చేశాననేది ప్రేక్షకులు నిర్ణయించాల్సిన విషయం. నా వరకు సినిమాకి ఏం కావాలో అన్నీ ఇచ్చాను. నాలోని నటుడ్ని చూపించడానికి ప్రయత్నించాను. నా పెర్ఫార్మెన్స్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను.

ప్ర) ఈ సంవత్సరంలో మీరు ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు పూర్తయింది. మీ ఫీలింగ్ ?
జ) ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉండగలిగినందుకు చాలా లక్కీగా ఫీలవుతున్నాను. ఇక్కడ చాలా కాంపిటిషన్ ఉంటుంది. ఆటలో ఉండాలంటే ఒకేసారి చాలా పనులు చేయాల్సి ఉంటుంది. నా వరకు అన్నీ సక్రమంగానే జరిగాయి. ఇకపై కూడా ఇలానే జరగాలని కోరుకుంటున్నాను.

ప్ర) భిన్నమైన సినిమా ల్ని దక్కించుకోవడం కష్టం. భవిష్యత్తులో ఏం చేస్తారు ?
జ) లక్కీగా నాకు అన్నీ భిన్నమైన సినిమాలే వస్తున్నాయి. తెలుగు పరిశ్రమలో కూడా మార్పొచ్చింది. ఇకపై కూడా దర్శకులు నా వద్దకు డిఫరెంట్ కథలతోనే వస్తారని అనుకుంటున్నాను. నేను తర్వాత చేయబోయే సినిమాలు కూడా వేటికవి పూర్తి భిన్నంగా ఉంటాయి.

ప్ర) మీ తర్వాతి ప్రాజెక్ట్స్ ఏంటి ?
జ) రాజు సుందరం డైరెక్షఒక న్లో కాలేజ్ బ్యాక్ డ్రాప్లో ఉండే ఒక సినిమా చేస్తున్నాను. దాని తర్వాత చందు మొండేటి డైరెక్షన్లో ‘కార్తికేయ’ కు చేస్తున్నాను. ఆ తర్వాత ఒక యాక్షన్ సినిమా కూడా ఉంది.

ప్ర) చివరగా కేశవ గురించి ఒక్క మాటలో ?
జ) ఇదొక ఇంటెన్స్ రివెంజ్ డ్రామా. సినిమాను చెప్పిన తీరు చాలా బాగుంటుంది. కథలోని ఎమోషనల్ సన్నివేశాలు, ట్విస్టులు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు