ఎట్టకేలకు కాజల్ సినిమాకు మోక్షం లభించింది !

ఎట్టకేలకు కాజల్ సినిమాకు మోక్షం లభించింది !

Published on Mar 29, 2017 4:40 PM IST


తెలుగు, తమిళ పరిశ్రమల్లో కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన కాజల్ మధ్యలో కాస్త తడబడినా చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ‘ఖైదీ నెం 150’ తో గ్రాండ్ సక్సెస్ అందుకుని స్టార్ స్టేటస్ ను నిలబెట్టుకుంది. అంతేగాక ప్రస్తుతం ఆమె విజయ్, అజిత్ లాంటి స్టార్ హీరోలతో కూడా ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఇకపోతే గతేడాది తమిళంలో హీరో జీవాతో జంటగా ఆమె నటించిన చిత్రం ‘కావలై వెండం’ తెలుగులో ‘ఎంతవరకు ఈ ప్రేమ’ పేరుతో రిలీజ్ కానుంది. అయితే తమిళంలో గతేడాదే వచ్చిన ఈ సినిమా అదే సంవత్సరం తెలుగులో కూడా రిలీజ్ అవ్వాలి.

కానీ అనుకోని కొన్ని కారణాల వలన పలు వాయిదాలు పడిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ చివరికి ఈ నెల 31న రిలీజ్ కు సిద్ధమైంది. ఈ చిత్రంతో పాటే ‘గురు, డోర, రోగ్’ లాంటి మంచి క్రేజ్ ఉన్న సినిమాలు రిలీజవుతున్నాయి. పైగా థియేటర్లలో ‘కాటమరాయుడు’ ఎలాగూ ఉండనే ఉంది. మరి ఈ సినిమాలన్నింటినీ కాజల్ చిత్రం ఎలా ఎదుర్కుంటుందో చూడాలి. డివి క్రియేషన్స్ సమర్పిస్తున్న ఈ చిత్తాన్ని దర్శకుడు డీకే డైరెక్ట్ చేయగా, లియోన్ జేమ్స్ సంగీతమందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు