తమిళ సినిమా చరిత్రలో ఇదే మొదటిసారి !

తమిళ సినిమా చరిత్రలో ఇదే మొదటిసారి !

Published on Jul 6, 2017 9:34 AM IST


తమిళ సినీ పరిశ్రమకు గడ్డు పరిస్థితే తలెత్తింది. థియేటర్ల బంద్ 4వ రోజుకి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న 18, 28 శాతం జిఎస్టీ పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న 30 శాతం అదనపు పన్నును తొలగించాలని థియేటర్ల యాజమాన్యాలు నిరసన చేపట్టి తమిళనాడు వ్యాప్తంగా 1100 లకు పైగా స్క్రీన్లను మూసివేశారు. దీంతో కొద్దీ రోజుల ముందే విడుదలైన సినిమాలకు నష్టాలు పెరుగుతుండగా ఈ వారం రావాల్సిన సినిమాలు వాయిదా పడుతున్నాయి.

ఇలా వరుసగా నాలుగు రోజుల పాటు థియేటర్లు మూతబడటం తమిళ సినీ చరిత్రలో మొదటిసారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సినీ పెద్దలకు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న చర్చలు మాత్రం కొలిక్కి రాకపోవడంతో సినిమా హాళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయో చెప్పడానికి వీల్లేకుండా ఉంది. కమల్ హాసన్, రజనీకాంత్ వంటి ప్రముఖులు కూడా పరిశ్రమ డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలని తమ అభిప్రాయాన్ని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు