దేశం గర్వపడేలా చిరు ‘సైరా’ చిత్రం ఉంటుందట !


మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమాగా స్వాతంత్ర్య సమరయోధుడు సైరా నరసింహారెడ్డి జీవిత గాధను చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ తారాగణంతో, బడ్జెట్ తో, అన్ని హంగులను కలగలుపుకుని రూపొందుతున్న ఈ చిత్రం పట్ల మెగా అభిమానులతో పాటు దక్షిణాది ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. చిత్ర టీమ్ కూడా అంచనాలను అందుకోవాలని అన్ని విధాలా ప్రయత్నిస్తోంది.

అందులో భాగంగానే చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి రూపంగుడి ప్రాంతానికి వెళ్లి నరసింహారెడ్డి జీవితానికి సంబందించిన పలు విశేషాల్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చిత్రం దేశం గర్వించే స్థాయిలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్లో రెగ్యులర్ షూటింగుకు వెళ్లనున్న ఈ చిత్రంలో నయనతార, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి స్టార్ నటీనటులు నటిస్తుండగా చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మతగా వ్యవహరిస్తున్నారు. అలాగే రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందివ్వనున్నారు.

 

Like us on Facebook