ఇంటర్వ్యూ : శ్రీకాంత్ – ‘గోవిందుడు..’లో నెగిటివ్ టచ్ ఉండే క్యారెక్టర్ చేశా.

ఇంటర్వ్యూ : శ్రీకాంత్ – ‘గోవిందుడు..’లో నెగిటివ్ టచ్ ఉండే క్యారెక్టర్ చేశా.

Published on Sep 23, 2014 4:45 PM IST

Srikanth-in-GAV
రామ్ చరణ్ హీరోగా కృష్ణవంశి దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన కుటుంబ కధా చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’. రామ్ చరణ్ బాబాయిగా సినిమాకి కీలకమైన పాత్రలో శ్రీకాంత్ నటించారు. గతంలో కృష్ణవంశి దర్శకత్వం వహించిన ‘ఖడ్గం’, ‘మహాత్మ’ చిత్రాలలో శ్రీకాంత్ నటనకు ప్రసంశలు లభించాయి. ఆ చిత్రాలలో శ్రీకాంత్ సోలో హీరోగా నటించారు. తాజాగా ‘గోవిందుడు అందరివాడేలే’ అంటూ హట్రిక్ కి రెడీ అయ్యారు. అక్టోబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కృష్ణవంశి మార్క్ స్టైల్ లో తెరకెక్కిన ఈ సినిమా విశేషాలను తెలియజేయడానికి శ్రీకాంత్ మీడియాతో సమావేశం అయ్యారు. ఆ విశేషాలు మీకోసం…

ప్రశ్న) ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలో మీ పాత్ర గురించి చెప్పండి..?

స) ఈ చిత్రంలో నేను రామ్ చరణ్ కు బాబాయిగా నటించాను. నా పాత్ర పేరు ‘బంగారి’. అవుట్ & అవుట్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్. నాకు జోడిగా అత్త కూతురిగా కమలిని ముఖర్జీని నటించింది. మనిషి చాలా మంచోడు, కాకపోతే తన పెళ్లి చేయడం లేదనే కోపంతో తండ్రికి నచ్చని పనులు చేస్తూ ఉంటాడు. రామ్ చరణ్, ప్రకాష్ రాజ్ లతో నా కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు బాగుంటాయి.

ప్రశ్న) అంటే నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించారా..?

స) నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కాదు, కాని పెర్ఫార్మన్స్ లో కొంచం నెగిటివ్ టచ్ ఉంటుంది. పల్లెటూరిలో అల్లరి చేస్తూ తిరిగే పక్కా మాస్ తరహా కుర్రాడు అనమాట. సినిమాలో రామ్ చరణ్ కు బాబాయిగా నటించినా, యంగ్ క్యారెక్టర్ లో నటించాను. వాళ్ళ నాన్నకు, నాకు చాలా ఏజ్ గ్యాప్ ఉంటుంది. ఇంట్లో అందరూ చరణ్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని కొంచం కోపంతో ఉండే పాత్రలో కనిపిస్తాను.

ప్రశ్న) మీకు, చరణ్ కు మధ్య ఒక ఫైట్ ఉందని ప్రచారం జరుగుతుంది..?

స) మా ఇద్దరి మధ్య ఒక యాక్షన్ సన్నివేశం ఉంది. అందులో నేను రామ్ చరణ్ ను కొడుతూ ఉంటాను. కాని, అతను తిరిగి ఒక్క దెబ్బ కూడా కొట్టాడు. అలా చరణ్ ఎందుకు మౌనంగా ఉండిపోయాడు అనేది సస్పెన్స్. సినిమాలో చాలా కీలకమైన సన్నివేశం అది.

ప్రశ్న) కృష్ణవంశి దర్శకత్వం గురించి చెప్పండి..?

స) కుటుంబ కధా చిత్రాలను తెరకెక్కించడంలో కృష్ణవంశి సిద్దహస్తుడు. ఆ విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రంలో ఎమోషనల్ సన్నివేశాలను అత్యద్బుతంగా చిత్రీకరించాడు. డబ్బింగ్ చెప్పే సమయంలో గొప్ప సినిమా అవుతుందని ఫీల్ అయ్యాను. ‘నిన్నే పెళ్ళాడతా’, ‘మురారి’, ‘చందమామ’ వంటి అద్బుతమైన చిత్రాలను తెరకెక్కించాడు. వాటికి ఏమాత్రం తగ్గకుండా ‘గోవిందుడు అందరివాడేలే’ ఉంటుంది. ఇంకా ఓ మెట్టు పైనే ఉంటుంది.

ప్రశ్న) బండ్ల గణేష్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పండి..?

స) నేను హీరోగా నటించిన ‘వినోదం’ సినిమా టైం నుండి బండ్ల గణేష్ తెలుసు. అతి తక్కువ సమయంలో అగ్ర నిర్మాతగా ఎదిగాడు. బండ్ల గణేష్ లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం. ఇలాంటి భారి చిత్రాల వలన ఎందరికో పని దొరుకుంతుంది. ‘గోవిందుడు… ‘ సినిమాను ఖర్చుకు వెనుకాడకుండా చాలా రిచ్ గా, లావిష్ గా నిర్మించాడు. మీకు ప్రతి ఫ్రేమ్ లో ఆ భారితనం కనపడుతుంది.

ప్రశ్న) రషెస్ చూసిన చిరంజీవి గారు ఏవైనా సలహాలు ఇచ్చారా..?

స) అన్నయ్య చాలా హ్యాపీగా ఉన్నారు. రషెస్ చూసిన తర్వాత అందరిని అభినందించారు. చాలా బాగున్నాయని ప్రశంసించారు. ఆయన సలహా మేరకు చరణ్, నా కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాలను జత చేశాం.

ప్రశ్న) తండ్రికొడుకులతో (చిరంజీవి, చరణ్) నటించారు. వీరిద్దరిలో మీరు గమనించిన తేడా ఏంటి..?

స) నటనలో ఎవరి స్టైల్ వారిది. చరణ్ నాకు వ్యక్తిగతంగా తెలుసు. మంచి పరిచయం ఉంది. అయితే షూటింగ్ స్పాట్ లో ఎలా ఉంటారో అనే చిన్న సందేహం ఉండేది. రెండు రోజుల తర్వాత బిహేవియర్ లో అన్నయ్యకు, చరణ్ కు తేడా కనపడలేదు. పెద్దలను, ఇతర నటులకు చాలా గౌరవం ఇస్తాడు.

ప్రశ్న) భవిష్యత్ లో కూడా ఇతర హీరోలతో మల్టీస్టారర్ చిత్రాలలో నటిస్తారా..?

స) తప్పకుండా నటిస్తాను. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలా యంగ్ హీరోలతో నటించాలని కోరుకుంటున్నాను. ‘గోవిందుడు అందరివాడేలే’ తర్వాత వేరే మల్టీస్టారర్ చిత్రం అంగీకరించలేదు. ప్రస్తుతం సోలో హీరోగా నాలుగు చిత్రాలలో నటిస్తున్నాను.

ప్రశ్న) చివరగా ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం గురించి ప్రేక్షకులకు ఏం చెప్తారు..?

స) కృష్ణవంశి స్టైల్ లో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’. కుటుంబ అనుభందాలు, ఆప్యాయతల నేపధ్యంలో సినిమా రూపొందింది. రెండున్నర గంటలు ఒక పండగ వాతావరణంలో ఉన్నట్టు ప్రేక్షకులు ఫీల్ అవుతారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు