చిట్ చాట్ : మియా జార్జ్ – తెలుగు ఇండస్ట్రీలోకి రావాలంటే చాలా భయమేసింది !

చిట్ చాట్ : మియా జార్జ్ – తెలుగు ఇండస్ట్రీలోకి రావాలంటే చాలా భయమేసింది !

Published on Feb 22, 2017 12:35 PM IST


మలయాళ పరిశ్రమలో పలు చిత్రాల్లో నటించి తర్వాత తమిళ ఇండస్ట్రీలో అడుపెట్టిన నటి మియా జార్జ్ ప్రస్తుతం తెలుగులో సైతం ఎంట్రీ ఇచ్చి సునీల్ సరసన ‘ఉంగరాల రాంబాబు’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇకపోతే తమిళ హీరో విజయ్ అంటోనీ సరసన ఆమె నటించిన ‘యమన్’ తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 24న రిలీజుకు రెడీ అవుతోంది. ఈ సందర్బంగా ఆమె మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం..

ప్ర) ముందుగా ‘ఉంగరాల రాంబాబు’ సినిమా రిలీజ్ అవ్వాలి కదా ?
జ) అవును. ముందుగా అదే రిలీజ్ అవుతుందనుకున్నాను. కానీ ఇంకా ఒక షెడ్యూల్ మిగిలి ఉండటంతో కాలేదు. ‘యమన్’ అంతా పూర్తయిపోయింది అందుకే రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి తెలుగులో ఇదే నా మొదటి సినిమా అవుతుంది.

ప్ర) తమిళంలో ఎన్ని సినిమాలు చేశారు ?
జ) మలయాళం, తమిళంలో కలిపి మొత్తం 20 సినిమాలు చేశా. కేవలం తమిళంలో అయితే 6 సినిమాలు వరకు నటించా.

ప్ర) తెలుగు పరిశ్రమ ఎలా ఉంది ?
జ) చాలా బాగుంది. తెలుగులో ఇదే నా మొదటి సినిమా. కాబట్టి ఇంకా టాలీవుడ్ గురించి ఎక్కువ తెలుసుకోడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పటి వరకైతే అంతా బాగానే ఉంది.

ప్ర) స్క్రీన్ మీద మీరొక హీరోయిన్. మరి జీవితంలో ఎలా ఉంటారు ?
జ) నేను హీరోయిన్ అయినా చాలా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంటాను. కానీ అప్పుడప్పుడు నేనొక హీరోయిన్, నేను అందరికీ తెలుసు అని చిన్న గర్వం ఉంటుంది. సినిమాలో పనిచేయడం, హీరోయిన్ గా ఉండటం అన్నీ నాకు మామూలు విషయాలే. నార్మల్ గా ఉండటానికే ట్రై చేస్తుంటాను.

ప్ర) ఈ సినిమా పట్ల మీ ఫీలింగ్ ఏంటి ?
జ) పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. కానీ ఇందులో నాకనిపించింది ఏమిటంటే ఎవరైన సరే ఒక తప్పు చేస్తే ఎప్పుడైనా సరే శిక్షింపబడతారు, తప్పించుకోలేరు అనే అంశాన్ని చాలా బాగా చెప్పారు. ఇదే ఇందులో ప్రధానమైన అంశం.

ప్ర)ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది ?
జ) ఇందులో నా పాత్ర పేరు అంజనా. ఆమె ఒక హీరోయిన్. అనుకోకుండా ఆమె హీరోని కలుస్తుంది. ఆ పరిచయంతోనే హీరోని తన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి హెల్ప్ అడుగుతుంది. హీరో కూడా ఒప్పుకుంటాడు. అలా ఈ సినిమా కథ మొదలవుతుంది.

ప్ర) విజయ్ ఆంటోనీతో పని చేయడం ఎలా ఉంది ?
జ) ఆయన చాలా మంచి వ్యక్తి. అస్సలు గర్వం ఉండదు. తనకు నటన గురించి, వేరే డిపార్టుమెంట్ల గురించి కొంచమే తెలుసని చెప్తుంటారు. చాలా నిజాయితీగా ఉంటారు. ఆయనతో పని చేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది. మంచి సహా నటుడు.

ప్ర) తెలుగులోకి రావడం లేటైనట్టుంది ?
జ) అవును లేటైంది. ఇంతకు ముందే కొన్ని ఆఫర్లొచ్చాయి. కానీ భయంతో వాటిని రిజెక్ట్ చేశాను. ఎందుకంటే నాకసలు టాలీవుడ్ గురించి ఏమీ తెలియదు. ముఖ్యంగా లాంగ్వేజ్ అస్సలు రాదు. అందుకే భయమేసింది. తర్వాత మలయాళం నుంచి తమిళంలోకి వచ్చాక కాస్త ధైర్యం వచ్చి తెలుగులోకి కూడా వచ్చాను.

ప్ర) సునీల్ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది ?
జ) ‘ఉంగరాల రాంబాబు’ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. కామెడీ, సెంటిమెంట్ అన్నీ ఉంటాయి. నాది మంచి ట్రెడిషనల్ పాత్ర.

ప్ర) భావన విషయంలో మీరు రెస్పాన్స్ ఏంటి ?
జ) భావన నాకు మంచి ఫ్రెండ్. మేమిద్దరం కలిసి ఒక సినిమా నటించాం. ఈ సంఘటన జరిగే రెండు మూడు రోజుల ముందు కూడా మేమిద్దరం ఫోన్లో మాట్లాడుకున్నాం. ఈ సంఘటన చాలా షాక్ కు గురిచేసింది. మేము ప్రొడక్షన్ వెహికల్స్ ని చాలా నమ్ముతాం. అలాంటి లొకేషన్ వెహికల్లోనే ఇలాన జరగటం భయం కలిగిస్తోంది. కానీ ఆ డ్రైవర్ యూనియన్ లేడు. అంతా హైవే పైనే జరిగింది. ఎవరూ గమనించకపోవడం ఆశ్చర్యం. కానీ దీని తర్వాత కూడా ఆమె చాలా ధైర్యంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఆమెకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు