వాస్తవంగా జరిగిన స్కామ్ ఆధారంగా తెరకెక్కనున్న విష్ణు సినిమా ?

వాస్తవంగా జరిగిన స్కామ్ ఆధారంగా తెరకెక్కనున్న విష్ణు సినిమా ?

Published on Mar 24, 2017 3:00 PM IST


మంచు విష్ణు ఇటీవలే మోహన్ బాబుగారి పుట్టినరోజు సందర్బంగా తన కొత్త చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’ ను ప్రారంభించారు. జి. నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వ భాద్యతలు వహించనున్నారు. ఒక ప్రముఖ న్యూస్ పోర్టల్ కథానమ్ ప్రకారం త్వరలోనే రెగ్యులర్ షూట్ కు వెళ్లనున్న ఈ చిత్ర కథ వాస్తవంగా జరిగిన ఒక రియల్ స్కామ్ ఆధారంగా రూపుదిద్దుకుందట. గతేడాది అమెరికాలో ఎన్నారైలను మోసం చేసిన కాల్ సెంటర్ల వ్యవహారం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఆ ఘటన చూసిన తర్వాత దానిపై ఒక సినిమా చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాను ప్లాన్ చేశామని విష్ణు అన్నారట. అంతేగాక ఈ చిత్రం తెలుగు హిందీలతో పాటు ఇంగ్లీష్ లో కూడా రూపొందుతుందట. మరి ఈ ఆసక్తికర కథనాలన్నీ వాస్తవమో కాదో తెలియాలంటే మంచు కాంపౌండ్ నుంచి న్యూస్ వచ్చేదాకా ఎదురుచూడగా తప్పదు. మరోవైపు విష్ణు ‘ఓటర్’ పేరుతో మరో పొలిటికల్ డ్రామాను కూడా ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు