1980 నేపథ్యంలో శర్వానంద్ సినిమా !

1980 నేపథ్యంలో శర్వానంద్ సినిమా !

Published on Apr 19, 2018 4:51 PM IST

ప్రేక్షకులు భిన్నత్వం ఫీలవ్వగల కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం తన 28న సినిమాను సుధీర్ వర్మ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది.

తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో 1980ల బ్యాక్ డ్రాప్లో నడిచే కథగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ వార్త నిజమో కాదో అనేది మాత్రం ఇంకా ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. కళ్యాణి ప్రియదర్శిని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ సంస్థలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీతో పాటు శర్వానంద్ హను రాఘవపూడి దర్శకత్వంలో కూడ ఒక సినిమా చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు