‘జై’ టీజర్ తో అభిమానులకు ట్రీట్ ఖాయమట !
Published on Jul 5, 2017 5:57 pm IST


‘జనతా గ్యారేజ్’ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ బాబీ డైరెక్షన్లో ‘జై లవ కుశ’ సినిమాను స్టార్ట్ చేసి అందరిలోనూ ఆసక్తి పెంచేశాడు. పైగా ఇందులో తారక్ త్రిపాత్రాభినయం చేస్తుండటం, అందులోను ఒకటి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కావడం మరింత ఆసక్తిని రేకెత్తించే అంశం. రేపు ఈ సినిమాకు సంబందించిన టీజర్ ఒకటి రిలీజ్ కానుంది. అది కూడా ‘జై’ పాత్ర మీదే కావడం విశేషం.

ఈ టీజర్లో ఎన్టీఆర్ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పడంతో పాటు అభిమానులకు కావాల్సిన కంటెంట్ కూడా ఉంటుందని టాక్. దీంతో అభిమానుల్లో ఇప్పటి నుండే సందడి మొదలిపోయింది. ఈ టీజర్ తర్వాత లవ, కుశ పాత్రలకి సంబందించిన టీజర్లను కూడా వరుసగా విడుదల చేస్తారు. రాశి ఖన్నా, నివేత థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు.

 
Like us on Facebook