డిఫరెంట్ జోనర్లో సూర్య ‘మాస్’.!

డిఫరెంట్ జోనర్లో సూర్య ‘మాస్’.!

Published on Apr 19, 2015 1:58 PM IST

mass
తమిళ స్టార్ సూర్య హీరోగా, స్క్రీన్ ప్లే తో మేజిక్ చేసే వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మాస్’. ఈ సినిమా షూటింగ్ మొత్తం నిన్నటితో పూర్తయ్యింది. దీంతో ఈ చిత్ర టీం మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ మీద దృష్టి పెడుతోంది. ఇప్పటికే యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంబందించిన రీ రికార్డింగ్ వర్క్ ని మొదలు పెట్టాడు. ముందుగా ఈ చిత్ర టీం ఈ సినిమాని మే 1న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. కానీ పలు కారణాల వల్ల మే 15న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటి వరకూ ఈ సినిమాకి సంబందించిన రెండు పోస్టర్స్ ని రిలీజ్ చేసారు. ఆ రెండు ఆడియన్స్ లో ఆసక్తిని క్రియేట్ చేసాయి. ఈ సినిమా ఎలా ఉంటుందా అనే వాళ్ళ కోసం ఓ విషయాన్ని తెలియజేస్తున్నాం. మాస్ సినిమా హర్రర్ కామెడీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా. సూర్య ఈ జోనర్లో సినిమా చెయ్యడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఎవ్వరూ ఇదొక హర్రర్ కామెడీ మూవీ అని ఆశించలేదు కానీ హర్రర్ కామెడీ అనగానే అందరూ షాక్ అవుతున్నారు.

ఈ సినిమాలో సూర్య సరసన నయనతార, ప్రణిత హీరోయిన్లు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి మ్యూజిక్ అందించనున్నాడు. 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగులో కూడా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు