ఆసక్తిరేపుతున్న సినిమా ట్రైలర్ విడుదల కానుంది !

ఆసక్తిరేపుతున్న సినిమా ట్రైలర్ విడుదల కానుంది !

Published on Jan 20, 2018 2:52 PM IST

రాహుల్ రవీంద్రన్ హీరోగా తెరకేక్కబోతున్న తాజా సినిమా దృష్టి. సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ సింపుల్‌గా అందరిని ఆకర్షించాయి. రామ సుబ్బరాజు డైరెక్షన్‌లో మోహన్ నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా నిర్మించబడుతోంది. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు విడుదల కానుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ సినిమా పై రాహుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

ఈ సినిమాతో పాటు రాహుల్ రవీంద్రన్ హౌరా బ్రిడ్జి సినిమా లో నటించాడు.ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యాదు దర్శకత్వం వహించిన ఆ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందించాడు. సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన చిలసౌ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు