టైటిల్ లోనే ఫన్ చూపిస్తున్న అల్లరి నరేష్ !

టైటిల్ లోనే ఫన్ చూపిస్తున్న అల్లరి నరేష్ !

Published on May 22, 2018 5:38 PM IST

ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో అల్లరి నరేష్ ఈ మధ్య కాలంలో వరుస పరాజయాలతో డీలా పడ్డారు. ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ ఆయనకు అత్యవసరం. అందుకే తనకు ‘సుడిగాడు’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు భీమినేని శ్రీనివాసరావుతో సినిమా చేస్తున్నారాయన.

కొన్ని నెలల క్రితమే మొదలైన ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రానికి ‘ఫన్ రాజా ఫన్’ అనే వెరైటీ టైటిల్ ను నిర్ణయించారట. ఈ చిత్రంలో నటుడు సునీల్ ఒక కీలక పాత్ర చేయనున్నాడు. ‘రంగులరాట్నం’ ఫేమ్ చిత్ర శుక్ల ఈ చిత్రంలో కథానాయకిగా నటిస్తోంది. సినిమా ఎప్పుడు పూర్తవుతుంది, విడుదల ఎప్పుడు వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు