అవసరాల అడల్ట్ కామెడీ సినిమాకి వెరైటీ టైటిల్ !

అవసరాల అడల్ట్ కామెడీ సినిమాకి వెరైటీ టైటిల్ !

Published on Dec 9, 2016 4:00 PM IST

Avasarala-Srinivas
అవసరాల శ్రీనివాస్ నటుడిగా పరిశ్రమకు పరిచయమై రచయితగా, దర్శకుడిగా ఎదిగి ప్రస్తుతం నటన, దర్శకత్వం రెండింటిలోనూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం శ్రీనివాస్ ప్రధాన పాత్రలో ఓ అడల్ట్ కామెడీ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం బాలీవుడ్ ‘హంటర్’ కు రీమేక్ గా రూపొందుతోంది. నూతన దర్శకుడు నవీన్ మేడారం ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రానికి ‘బాబు బాగా బిజీ’ అనే వెరైటీ టైటిల్ ను ఖరారు చేశారు.

ఈ మధ్య విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా భిన్నంగా ఉండి సినిమాపైమంచి క్రేజ్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో అవసరాల సరసన తేజస్వి మదివాడ, మిస్తీ చక్రవర్తి, శ్రీముఖి,సుప్రియ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తనికెళ్ళ, పోసానిలు పలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అభిషేక్ నామా, వివేక్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు