‘యుద్ధం శరణం’ అంటున్న నాగ చైతన్య !

‘యుద్ధం శరణం’ అంటున్న నాగ చైతన్య !

Published on Jul 2, 2017 12:04 PM IST


ఇటీవలే ‘రారేండోయ్ వేడుక చూద్దాం’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుని కెరీర్లోనే అత్యుత్తమ వసూళ్లను నమోదుచేసుకున్న అక్కినేని హీరో నాగ చైతన్య నూతన చిత్రం యొక్క ఫస్ట్ లుక్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. తమిళ దర్శకుడు కృష్ణ ఆర్వి మరిముత్తు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి ‘యుద్ధం శరణం’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను నిర్ణయించారు.

పూర్తి స్థాయి థ్రిల్లర్ గా ఉండనున్న ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తుండటం విశేషం. వారాహి చలన చిత్రం నిర్మిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా రావు రమేష్, రేవతిలు పలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అలాగే వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ భాద్యతలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు