పూరి ‘రీమిక్స్’ ఎవరి కోసం?

పూరి ‘రీమిక్స్’ ఎవరి కోసం?

Published on Feb 10, 2016 2:13 AM IST

puri-jaganadh
ఒక హీరోలోని మాస్ యాంగిల్ ని, అలాగే హీరోయిజంని పీక్స్ లో చూపించగల దర్శకుడైన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం కన్నడకి చెందిన ఇషాన్ ని హీరోగా లాంచ్ చేస్తూ ‘రోగ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మలేషియాలో జరుగుతోంది. ఇది పక్కన పెడితే పూరి జగన్నాధ్ అప్పుడే తన తదుపరి రెండు సినిమాలను ఫిక్స్ చేసాడు. అందులో మొదటిది నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తుంటే, రెండవ దాన్లో ఎన్.టి.అర్ హీరోగా నటిస్తాడు.

ఇద్దరికీ పూరి మెయిన్ స్టొరీ లైన్ చెప్పడం అది వారికి నచ్చడం కూడా జరిగింది . అందులో కళ్యాణ్ రామ్ తో చేయనున్న సినిమా ఏప్రిల్ నుంచి మొదలు కానుంది. రీసెంట్ గా పూరి జగన్నాధ్ తన వైష్ణో మీడియా బ్యానర్ పై ‘రీమిక్స్’ అనే టైటిల్ ని రిజిష్టర్ చేసాడు. పాటల పరంగా మనం ఎక్కువగా వినే రీమిక్స్ అనే పదాన్ని సినిమా టైటిల్ గా రిజిష్టర్ చేయడం అందరిలోనూ ఆసక్తిని పెంచింది. ఈ టైటిల్ కచ్చితంగా నందమూరి హీరోలతో చేయనున్న ఏదో ఒక సినిమాకి అయ్యి ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ విషయంపై క్లారిటీ లేకపోయినప్పటికీ పూరి ఈ రీమిక్స్ అనే టైటిల్ ని ఎవరికీ ఇస్తాడా అనే ఆసక్తి మాత్రం పెరుగిపోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు