సుశాంత్ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్ !

హీరో సుశాంత్ గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఒడిదుడుకుల్ని ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఆయన గత చిత్రాలు ‘ఆటాడుకుందాం రా, అడ్డా’ రెండూ పరాజయాలుగా నిలవడంతో ప్రస్తుతం ఆయనకు తప్పనిసరి హిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆయన ఈసారి చేయబోయే సినిమా అన్ని విధాలా విజయాన్ని ఖాయం చేసేదిగా ఉండాలని నిర్ణయించుకుని రొమాంటిక్ ఎంటర్టైనట్ కు సైన్ చేశారు.

ఈ చిత్రాన్ని హీరో రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈరోజు ఉదయమే పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించారు. అలాగే చిత్రానికి ‘చి౹౹ల౹౹సౌ౹౹’ (చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి) అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్, ప్రీ లుక్ ను చూస్తుంటే సినిమా హీరోయిన్ ప్రధానంగా నడిచేదిగా ఉంది మంచి కుటుంబ విలువలను కలిగి ఉంటుందని అర్థమవుతోంది. మరి మనం కూడా సుశాంత్ ఈసారి తప్పక విజయాన్ని అందుకోవాలని ఆశిద్దాం. సిరుని సినీ కార్పొరేషన్ పై హరి, జస్వంత్, భారత్ కుమార్ లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కొత్త హీరోయిన్ రుహాని నటిస్తుండగా వెన్నెల కిశోర్, విద్యుల్లేఖ పలు కీల పాత్రల్లో నటిస్తున్నారు.

 

Like us on Facebook