రవితేజ నెక్స్ట్ సినిమాకి క్రేజీ టైటిల్.?

రవితేజ నెక్స్ట్ సినిమాకి క్రేజీ టైటిల్.?

Published on Oct 5, 2015 4:51 PM IST

Ravi-teja
సూపర్ హిట్ మూవీ కిక్ కి సీక్వెల్ గా వచ్చిన ‘కిక్ 2’ మూవీతో ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయిన మాస్ మహారాజ్ రవితేజ త్వరలోనే తన తదుపరి సినిమా బెంగాల్ టైగర్ తో మన ముందుకు రానున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 18న ఆడియో రిలీజ్ చేసి నవంబర్ 5న సినిమాని రిలీజ్ చెయ్యడానికి నిర్ణయించారు. ఇది రిలీజ్ కి సిద్దమవుతుండగానే ‘ఓ మై ఫ్రెండ్’ ఫేం వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వరక్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మించనున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉన్న ఈ సినిమా కోసం పలు టైటిల్స్ అనుకుంటున్నారు. ఇటీవల ‘ఎవడో ఒకడు’ అనే టైటిల్ వార్తల్లో నిలిచింది. తాజాగా మరో టైటిల్ వెండితెరపైకి వచ్చింది. ఆ సినిమా పేరే ‘బోగి’, దీనికి ట్యాగ్ లైన్ ‘ఆనందంగా ఉండేవాడు’. ఈ టైటిల్ ని దిల్ రాజు ఫిలిం చాంబర్ లో రిజిష్టర్ కూడా చేసాడు. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. రవితేజకి వేణు చెప్పిన కథ, అలాగే అతని పాత్రని తీర్చి దిద్దిన విధానం బాగా నచ్చడంతో దసరా కానుకగా ఈ సినిమాని ప్రారభించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి కావాల్సిన నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు