ఇంటర్వ్యూ : ఏ.ఎస్.రవికుమార్ చౌదరి – సక్సెస్‌ను నిలబెట్టుకోవడమే ప్రస్తుత టార్గెట్!

ఇంటర్వ్యూ : ఏ.ఎస్.రవికుమార్ చౌదరి – సక్సెస్‌ను నిలబెట్టుకోవడమే ప్రస్తుత టార్గెట్!

Published on Aug 24, 2015 8:43 PM IST

ks-ravikumar
గోపీచంద్ హీరోగా ‘యజ్ఞం’ లాంటి బంపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ఏ.ఏస్. రవికుమార్ చౌదరి, ఆ తర్వాత కొన్నేళ్ళ పాటు సరైన హిట్ లేక దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. కాగా మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన ‘పిల్లా నువ్వులేని జీవితం’తో రవికుమార్ మళ్ళీ సక్సెస్ బాట పట్టారు. గత ఏడాది విడుదలైన ఈ సినిమా సాయిధరమ్ తేజ్ కెరీర్‌కి మంచి లాంచింగ్ సినిమాగా నిలవగా, రవికుమార్ చౌదరి కెరీర్‌కి సూపర్ సక్సెస్ తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలను అందిపుచ్చుకున్న రవికుమార్, ప్రస్తుతం గోపీచంద్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఇక రేపు (ఆగష్టు 25న) పుట్టినరోజు జరుపుకుంటున్న రవికుమార్‌తో ఈ సందర్భంగా జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ముందుగా మా తరపున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. గోపీచంద్‌తో సినిమా ఎంతవరకు వచ్చింది?

స) థ్యాంక్స్. గోపీచంద్‌ హీరోగా నా దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ప్రస్తుతం ఫస్టాఫ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈ పార్ట్ ఎడిటింగ్ కూడా పూర్తి చేశాం. ఫస్టాఫ్ ఔట్‌పుట్‌తో అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఇక ఈమధ్యే సెకండ్ పార్ట్ కూడా స్టార్ట్ చేశాం. సో ఈసారి బర్త్‌డే, సినిమా సెట్స్‌లోనే జరుపుకుంటున్నా.

ప్రశ్న) గోపీచంద్‌తో ‘యజ్ఞం’ తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకు మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతోంది?

స) గోపీచంద్ గారితో కలిసి మళ్ళీ పదేళ్ళకు పనిచేస్తున్నా. ఆయన అప్పుడెలా ఉన్నారో, ఇప్పుడూ అలానే ఉన్నారు. స్టార్‌డమ్ వచ్చినా దర్శకుడిని గౌరవించే విధానంలో ఆయనలో ఏ మార్పూ లేదు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ఇది నా గత చిత్రం ‘పిల్లా నువ్వులేని జీవితం’ తరహాలోనే ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ‘యజ్ఞం’ సినిమాకు, ఈ సినిమాకు అస్సలు పోలిక ఉండదు.

ప్రశ్న) ‘పిల్లా నువ్వులేని జీవితం’ తర్వాత మీ కెరీర్‌కి మంచి సక్సెస్ వచ్చింది. సక్సెస్ ఏం నేర్పింది?

స) సక్సెస్ ఉంటేనే ఎక్కడైనా గుర్తింపు ఉంటుందనేది వాస్తవం. ‘పిల్లా నువ్వులేని జీవితం’ కంటే ముందు వరుసగా నా సినిమాలు ఫెయిలవ్వడం బాధించింది. అప్పుడే మన ప్రయత్నాల్లో ఎక్కడ తప్పు ఉందనేది విశ్లేషించుకున్నా. దాని ఫలితమే పిల్లా నువ్వులేని జీవితం. మనం ఎంత మంచి కథ చెప్పాలన్నా, సినిమాకుండే స్ట్రాంగ్ ఎమోషన్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌ను కూడా మిక్స్ చేయడం అవసరమని అర్థమైంది. ఇకపై నా సినిమాల్లో ఈ అంశం ఉండేలా చూసుకుంటున్నా. మనకి ఫెయిల్యూర్‌తో పాటు సక్సెస్ కూడా చాలా నేర్పిస్తుంది.

ప్రశ్న) ఒక్క సక్సెస్ పరిస్థితులన్నీ ఒకేసారి మార్చేస్తుంది. సక్సెస్ తర్వాత కెరీర్ ఎలా ఉంది?

స) చాలా బాగుంది. ప్రస్తుతం నాలుగు సినిమాలను లైన్లో పెట్టా. ముందే అన్ని కథలూ ఫిక్స్ చేసుకొని ఉండడంతో ఇకపై సినిమా సినిమాకు ఎక్కువ గ్యాప్ లేకుండా చూసుకుంటున్నా. సక్సెస్ తర్వాత అవకాశాలు ఎలా పెరుగుతాయో, బాధ్యతలు కూడా అలాగే పెరుగుతాయి. అందుకే సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నా.

ప్రశ్న) పుట్టినరోజు సందర్భంగా ఏయే నిర్ణయాలు తీసుకుంటున్నారు?

స) సినిమా సినిమాకూ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. ఒక కథను ఎంటర్‌టైనింగ్‌గా, సరికొత్తగా ఎలా చెప్పాలన్నది ఇప్పటికీ నేర్చుకుంటూ, నా సినిమాల్లో ఆ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటున్నా. ఇంకా చాలానే ఉన్నాయి.

ప్రశ్న) కెరీర్ పరంగా ఈ ఏడాది ఎలా ఉంటుందనుకుంటున్నారు?

స) కెరీర్ పరంగా ఈ ఏడాది నాకు చాలా ప్రత్యేకం. ఒక సక్సెస్ అంతా మార్చేసింది. వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇప్పటికి ఆ అవకాశాలను సరిగ్గా వాడుతున్నానా లేదా అనేదే ప్రధానాంశం. ఇక ఈ ఏడాదికి సక్సెస్‌ను నిలబెట్టుకోవడమే నా టార్గెట్.

ప్రశ్న) గోపీచంద్ సినిమా తర్వాత ఏయే సినిమాలు ప్లాన్ చేశారు?

స) గోపీచంద్ గారి సినిమాను డిసెంబర్ 25న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం. ఆ తర్వాత జనవరిలో ఓ పెద్ద బ్యానర్‌లో ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నా. ఇదేకాక, మరో రెండు కథలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇకపై వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు