ఇంటర్వ్యూ : ఆద శర్మ – మణిరత్నం ‘బొంబాయి’ మూవీ రెఫరెన్స్ తో ముస్లీం గర్ల్ రోల్ చేసాను.

ఇంటర్వ్యూ : ఆద శర్మ – మణిరత్నం ‘బొంబాయి’ మూవీ రెఫరెన్స్ తో ముస్లీం గర్ల్ రోల్ చేసాను.

Published on Feb 8, 2016 3:02 PM IST

adha
‘1920’ సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైన ఆద శర్మ ఆ తర్వాత ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఆ తర్వాత ‘S/O సత్యమూర్తి’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ లాంటి సినిమాలో గెస్ట్ రోల్స్ లో కనిపించి మెప్పించింది. ప్రస్తుతం తను హీరోయిన్ గా ఆది సరసన నటించిన ‘గరం’ సినిమా ఫిబ్రవరి 12న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆద శర్మతో మేము కాసేపు ముచ్చటించాం. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) సినిమా టైటిల్ ‘గరం’ అని పెట్టారు, మరి మీరు ఇందులో గరం గరంగా కనిపిస్తారా?
స) నవ్వులు.. గరం అనే పదాన్ని చాలా సందర్భాలకి వాడుకోవచ్చు. చెప్పాలంటే గరం గరం కండిషన్స్ లో సినిమా షూట్ చేసాం.. సినిమాలో నేను కూడా గరం గానే కనిపిస్తాను. కానీ ఏ రేంజ్ గరం అనేది ప్రేక్షకులే చూసి చెప్పాలి..

ప్రశ్న) ‘గరం’లో అవకాశం ఎలా వచ్చింది?
స) నేను చేసిన హార్ట్ ఎటాక్ సినిమా చూసిన మదన్ గారికి అందులో నేను కళ్ళతో పలికించిన భావాలు బాగా నచ్చాయి. అలాగే ఈ సినిమాలో ముస్లీం గర్ల్ సమీరగా కనిపిస్తాను. ఎక్కువగా బుర్కాలో కనిపిస్తాను. అంటే ఎక్కువగా కళ్ళతో ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వాలి. అలా ఈ పాత్రకి నేను పర్ఫెక్ట్ అని భావించిన డైరెక్టర్ మదన్ నన్ను సెలక్ట్ చేసారు.

ప్రశ్న) ముస్లీం యువతిగా మొదటిసారి కనిపిస్తున్నారు. మరి ఈ పాత్ర కోసం ఎలాంటి హోం వర్క్ చేసారు? అలాగే ఎక్కువ భాగం బుర్కాలోనే కనిపిస్తారని విన్నాం?
స) బుర్కాలోనే కనిపిస్తానా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోండి. కానీ ప్రేక్షకులను నిరుత్సాహపరిచేలా బుర్కాలోనే కనిపించను. ఇక హోం వర్క్ అంటే.. నాకు మణిరత్నం గారి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఈ ముస్లీం యువతి రోల్ చేయడం కోసం ఆయన చేసిన బొంబాయి సినిమాని రెఫరెన్స్ గా తీసుకున్నా. అందులో మనీషాలో హావ భావాలు పలికించడానికి ట్రై చేసాను.

ప్రశ్న) ఈ సినిమాలో మొదటిసారి హార్డ్ గా డాన్సులు కూడా వేసినట్టున్నారు?
స) నేను ప్రొఫెషనల్ కథక్ డాన్సర్ ని. కానీ నాకు ఇన్ని రోజులు నా డాన్సింగ్ స్కిల్స్ ని వాడుకునే అవకాశం రాలేదు. ఈ సినిమాలో 4 పాటల్లో డాన్సు వేసే అవకాశం లభించింది. ముఖ్యంగా ‘చిలక పాప’ అనే మాస్ సాంగ్ లో మాస్ స్టెప్స్ వేసాను. ఆ ఫీల్ చాలా బాగుంది. అందరికీ నచ్చుతాయనే ఆశిస్తున్నాను.

ప్రశ్న) హీరో ఆదితో పనిచేయడం ఎలా ఉంది?
స) ఆది చాలా సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్ హీరో.. నేను ఇన్ని రోజులు సినిమా కోసం నేనే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తా, కానీ ఆది నాకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాడు.

ప్రశ్న) గరం సినిమా ఎలా ఉంటుంది? ట్రైలర్ ని బట్టి ఇదొక ప్రేమకథ అనుకోవచ్చా?
స) గరం అనే పదాన్ని సందర్భాన్ని బట్టి ఒక్కోలా అర్థం చేసుకోవచ్చు. మీరన్నట్టు గరం అనేది పక్కాగా ఒక లవ్ స్టొరీ అని చెప్పలేం. ఈ సినిమాలో లవ్, కామెడీ, యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్నీ ఉంటాయి. అందుకే దీనిని పర్ఫెక్ట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అనచ్చు.

ప్రశ్న) సాయి కుమార్ నిర్మాతగా చేసిన మొదటి సినిమా ఇది. నిర్మాణ విలువలు ఎలా ఉన్నాయి?
స) నాచురాలిటీ కోసం ఈ సినిమాలోని ఎక్కువ భాగాన్ని హైదరాబాద్ లోనే షూట్ చేసాం. కానీ కానీ ప్రొడక్షన్ పరంగా, విజువల్స్ పరంగా చాలా గ్రాండ్ గా ఉంటుంది. సాయి కుమార్ గారు తమ ఇంట్లో అమ్మాయిలా నన్ను చూసుకున్నారు.

ప్రశ్న) హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మీరు ‘S/O సత్యమూర్తి’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ లాంటి సినిమాలో చిన్న పాత్రలు చేయడం రిస్క్ అనిపించలేదా?
స) నేను పాత్ర చిన్నదా పెద్దదా అని చూడను నాకు నచ్చితే, అలాగే నాకు సంతోషాన్ని ఇస్తుంది అనిపిస్తే చేసేస్తాను. నాకు బన్ని, త్రివిక్రమ్ తో చేయడం ఇష్టం అందుకే చేసాను. అలానే నాకు నటిగా ఒక తరహా పాత్రలే చేస్తుంది అనే ముద్ర వేసుకోదల్చుకోలేదు. అందుకే అన్ని రకాల పాత్రలు ట్రై చేస్తున్నా..

ప్రశ్న) మీరు చేయాలనుకునే డ్రీమ్ రోల్స్ ఏమన్నా ఉన్నాయా?
స) అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. నేను స్వతహాగా కథక్ డాన్సర్. అందుకే కథక్ బ్యాక్ డ్రాప్ లో ఏదన్నా పీరియాడికల్ ఫిల్మ్ చేయాలని ఉంది.

ప్రశ్న) మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి?
స) ప్రస్తుతం నేను చేసిన క్షణం సినిమా మార్చి 4న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. అది కాకుండా హిందీలో కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. అవి చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే ఆ విశేషాలు చెబుతాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు