ఇంటర్వ్యూ : భీమనేని శ్రీనివాసరావు – రీమేక్ చేయడం అనేది నా బలహీనతగా మారిపోయింది.

ఇంటర్వ్యూ : భీమనేని శ్రీనివాసరావు – రీమేక్ చేయడం అనేది నా బలహీనతగా మారిపోయింది.

Published on Feb 2, 2016 2:49 PM IST

Beemaneni-Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘సుస్వాగతం’, ‘అన్నవరం’ లాంటి సినిమాలు చేసిన డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు. అల్లరి నరేష్ తో ‘సుడిగాడు’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ అందుకున్న తర్వాత దాదాపు మూడున్నరేళ్ళు గ్యాప్ తీసుకొని చేసిన సినిమా ‘స్పీడున్నోడు’. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా యనతో కాసేపు ముచ్చటించి పలు విశేషాలను తెలుసుకున్నాం. ఆ విశేషాలు మీకోసం.

ప్రశ్న) సుడిగాడు తర్వాత దాదాపు మూడున్నరేళ్ళు గ్యాప్ తీసుకోవడానికి గల కారణం ఏమిటి?
స) నిజం చెప్పాలంటే సుడిగాడు సక్సెస్ తర్వాత నా కరీర్ సరిగా ముందుకు వెళ్లలేదని చెప్పాలి. ఏదీ వర్కౌట్ అవ్వలేదు. చెప్పాలంటే సుడిగాడు తర్వాత నా దగ్గర రెండు మూడు ఆఫర్స్ ఉన్నాయి. కానీ కొన్ని కారణాల వల్ల అవి మొదలవ్వలేదు. కొన్ని సార్లు డేట్స్ కుదరలేదని , కొన్నిసార్లు నా కథలు నచ్చలేదని ఇలా తెలియకుండానే ఎక్కువ గ్యాప్ వచ్చేసింది.

ప్రశ్న) సుందర పాండ్యన్ ని స్పీడున్నోడుగా రీమేక్ చేయడానికి గల కారణం ఏంటి?
స) ఒరిజినల్ వెర్షన్ అయిన సుందర పాండ్యన్ నాకు చాలా బాగా నచ్చేసింది. అందుకే వెంటనే రీమేక్ చేయడానికి ఫిక్స్ అయిపోయాను. నేననుకున్న ప్రాజెక్ట్స్ సెట్ అవ్వకపోవడంతో ఈ రీమేక్ సినిమా కథని మార్చడం మొదలు పెట్టాను. ఫైనల్ గా ఇలా ఈ సినిమా రిలీజ్ కి సిద్దమైంది.

ప్రశ్న) మీ స్పీడున్నోడుగా బెల్లంకొండ శ్రీనివాస్ పర్ఫెక్ట్ అని ఎలా సెలక్ట్ చేసుకున్నారు?
స) నేను అల్లుడు శీను సినిమా చూసిన తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ పెర్ఫార్మన్స్ నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. అలాగే నా కథకి ఇమేజ్ అంటూ లేని ఓ హీరో అయితే నా సినిమాకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు. అందుకే నేను వెంటనే బెల్లంకొండ శ్రీనివాస్ ని అనుకున్నాం.

ప్రశ్న) మీ సొంత బ్యానర్ లోనే ఈ సినిమా చేయడానికి గల ప్రధాన కారణం?
స) సుడిగాడు తర్వాత వచ్చిన మూడేళ్ళలో నేను ఫేస్ చేసిన పలు సమస్యల వల్ల, వేరే వాళ్ళని అడగడం కంటే నేనే రిస్క్ తీసుకోవడం బెటర్ అని నిర్ణయించుకున్నాను. అందుకే నేనే నిర్మాతగా మారి సినిమా చేసాను.

ప్రశ్న) బెల్లంకొండ శ్రీనివాస్ కి ఇది రెండవ సినిమా. అతనితో పనిచేయడం ఎలా ఉంది?
స) శ్రీనివాస్ చేసింది ఒక్క సినిమానే.. తనకి హీరోగా ఓ ఇమేజ్ లేదు, కానీ మొదటి సినిమాతోనే తన పొటెన్షియల్ ఏంటనేది నిరూపించుకున్నాడు. కచ్చితంగా ఈ సినిమాతో తను ఒక కంప్లీట్ యాక్టర్ అని ప్రూవ్ చేసుకుంటాడు.

ప్రశ్న)మీరెందుకు ఎక్కువగా రీమేక్ సినిమాలనే చేస్తుంటారు?
స) రీమేక్ సినిమాలు అనేవి నా లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయాయి అండి. నేను ఫీలయ్యేది ఏమిటి అంటే.. రీమేక్ సినిమాల కథలని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆడియన్స్ కి పర్ఫెక్ట్ గా చెప్పి మెప్పించగలను. చెప్పాలంటే ఇప్పుడు రీమేక్స్ అనేవి నా వీక్ నెస్ గా మారిపోయాయి. అలాగే రీమేక్ చేస్తున్నప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాను.

ప్రశ్న) ఈ సినిమాకి మీరే నిర్మాత. కానీ బడ్జెట్ విషయంలో పరిధి దాటి ఒక్క పాత కోసం తమన్నా లాంటి స్టార్ హీరోయిన్ ని ఎంచుకోవడానికి కారణం ఏంటి?
స) ఈ సినిమాలో వచ్చే స్పెషల్ సాంగ్ సినిమాకి చాలా ముఖ్యమైనది. అందుకే ఈ సాంగ్ ని ఓ పెద్ద స్టార్ అయిన తమన్నా అయితే ఇంకా హెల్ప్ అవుతుందని ఫీల్ అయ్యాను. అలాగే సాయి మొదటి సినిమాలో కూడా తమన్నా స్పెషల్ సాంగ్ చేయడం వలన, వారిద్దరి మధ్యా ఉన్న రిలేషన్ వల్ల తను ఒప్పుకుంది. అది ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయ్యింది.

ప్రశ్న) స్పీడున్నోడు సినిమాకి ఫైనాన్సియల్ గా మీకు బెల్లంకొండ సురేష్ సపోర్ట్ ఉందని వచ్చిన వార్తలపై మీ కామెంట్?
స) ఆయన నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. ఈ సినిమాకి ప్రతిదీ నా సొంతంగా నేను రిస్క్ చేసి చేసుకున్నాను.

ప్రశ్న) మీరు తదుపరిగా చేయనున్న సినిమాలేమిటి?
స) ప్రస్తుతానికైతే స్పీడున్నోడుతోనే బిజీగా ఉన్నాను. ఈ సినిమా ప్రీ అండ్ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ అన్నీ అయిపోయాక, నా తదుపరి సినిమా గురించి ఆలోచిస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు