ఇంటర్వ్యూ : దాసరి కిరణ్ కుమార్ – ‘రామ్ లీల’లో డైలాగ్స్ హైలైట్ అవుతాయి.

ఇంటర్వ్యూ : దాసరి కిరణ్ కుమార్ – ‘రామ్ లీల’లో డైలాగ్స్ హైలైట్ అవుతాయి.

Published on Feb 25, 2015 4:56 PM IST

Dasari-Kiran-Kumara
‘జీనియస్’ సినిమాతో నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దాసరి కిరణ్ కుమార్ చేసిన రెండవ ప్రయత్నం ‘రామ్ లీల’. సరికొత్త కథా పాయింట్ తో రానున్న ఈ సినిమాలో హవీష్, అభిజీత్, నందిత ప్రధాన పాత్రలు పోషించారు. ‘రామ్ లీల’ సినిమా ఫిబ్రవరి 27న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దాసరి కిరణ్ కుమార్ మీడియాతో కాసేపు ముచ్చటించి రామ్ లీల సినిమా విశేషాలను చెప్పారు. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ముందుగా ‘రామ్ లీల’ గురించి చెప్పండి.?

స) నా మొదటి సినిమా అనుభవం వలన ఈ సినిమాని బడ్జెట్ పరంగా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని తీసాం. మొత్తం 36 రోజుల్లో ఈ సినిమాని షూట్ చేసాం. ఇందులో మేము ఓ సరికొత్త పాయింట్ ని చూపించాం, రీసెంట్ టైంలో ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు.

ప్రశ్న) రామ్ లీల సినిమాలో హవీష్, అభిజీత్, నందిత ఎలా చేసారు.?

స) ముందుగా ఈ సినిమా విషయంలో మాకు ఎంతో సపోర్ట్ గా నిలిచిన హవీష్, అభిజీత్, నందితలకి థాంక్స్ చెప్పాలి. హవీష్ మూడో సినిమాలో ఎంతో పరిపూర్ణమైన నటనని కనబరిచాడు. తన నటనలో ఎంతో మెచ్యూరిటీ వచ్చింది. ముందు సినిమాల కంటే ఎంతో ఉన్నతంగా తన పెర్ఫార్మన్స్ ఉంటుంది. ఇక అభిజీత్ గురించి ఒకటే చెబుతా.. సెకండాఫ్ లో మలేషియాలోని సుబ్రమణ్యస్వామి ముందు ఒక పది నిమిషాల సీన్ ఉంటుంది. తనకి అలాంటి సీన్ మరొకటి రావాలంటే చాలా టైం పడుతుంది. అభిజీత్ పెర్ఫార్మన్స్ అదరగొట్టాడు. నందిత నటన బాగుంది, తనకి ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ అవుతుంది.

ప్రశ్న) ‘రామ్ లీల’ సినిమాకి హైలైట్స్ గా నిలిచే అంశాలేమిటి.?

స) విస్సు ఈ సినిమాకి సూపర్బ్ డైలాగ్స్ రాసాడు. డైలాగ్స్ మెయిన్ హైలైట్ అవుతాయి. చాలా ఎమోషనల్ గా ఉండే ఈ డైలాగ్స్ అందరినీ మెప్పిస్తాయి.

ప్రశ్న) రిలీజ్ కి ముందు ఈ సినిమా ప్రీ రిలీజ్ క్రేజ్ ఎలా ఉంది.? సెన్సార్ వారు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏమిటి.?

స) ఈ సినిమాకి ప్రీ రిలీజ్ టాక్ బాగుంది. చూసినవారంతా బాగుందని మెచ్చుకుంటున్నారు. సెన్సార్ అయ్యాక వాళ్ళని పర్సనల్ గా నిజం చెప్పండి ఎలా ఉందని అడిగితే ‘వెరీ గుడ్ అటెంప్ట్.. ఇలాంటి కాన్సెప్ట్ ని ఈ మధ్య చూడలేదని’ అన్నారు.

ప్రశ్న) వరుసగా హవిష్ సినిమాలనే నిర్మించడానికి కారణం ఏమన్నా ఉందా.?

స) జీనియస్ సినిమా టైంలో నాకు – హవిష్ కి మధ్య రాపో బాగా కుదిరింది. దాంతో బాగా క్లోజ్ అయ్యాము. అంతే కాకుండా ఈ సినిమాతో హవిష్ తనని తానూ రీ ఇన్వెంట్ చేసుకుంటాడు. రామ్ లీల సినిమాలో తన పెర్ఫార్మన్స్ తో ప్రతి ఒక్కరినీ ఎంటర్ టైన్ చేస్తాడు.

ప్రశ్న) కొత్తవాడైన శ్రీ పురం కిరణ్ కి చాన్స్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి.?

స) జీనియస్ తర్వాత ఓ మంచి కథ కోసం ఎదురు చూస్తున్న టైంలో శ్రీ పురం కిరణ్ కథ చెప్పాడు. ముందుగా వేరే వాళ్ళకి డైరెక్షన్ చాన్స్ ఇద్దాం అనుకున్నా కథని స్పాయిల్ చేస్తారని తనకే అవకాశం ఇచ్చాను. తను చెప్పిన కాన్సెప్ట్ ని పర్ఫెక్ట్ గాతీసాడు . అందరూ తను కథలో చెప్పిన పాయింట్ కి కన్విన్స్ అవుతారు.

ప్రశ్న) ఎస్. గోపాల్ రెడ్డి లాంటి సీనియర్ సినిమాటోగ్రాఫర్ తో పనిచేయడం ఎలా ఉంది.?

స) చెప్పాలంటే ఆయన కథ విని ఒప్పుకోగానే మా సినిమా సగం సక్సెస్ అయ్యిందని అనుకున్నాం. ఆయన వల్లే ఈ సినిమాని అంత త్వరగా ఫినిష్ చెయ్యగలిగాము. ఆయన అందించిన విజువల్స్ కూడా ఈ సినిమాకి మరో హైలైట్ అవుతాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు