ఇంటర్వ్యూ : ఫైట్ మాస్టర్ విజయన్ – ఇది వరకూ చూడని మోస్ట్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ‘డైనమైట్’.

ఇంటర్వ్యూ : ఫైట్ మాస్టర్ విజయన్ – ఇది వరకూ చూడని మోస్ట్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ‘డైనమైట్’.

Published on Sep 2, 2015 7:09 PM IST

Fight-master-vijayan
తెలుగులో స్టార్ హీరోస్ అయిన చిరు, బాలయ్య, వెంకీ, నాగార్జున, మోహన్ బాబు, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ మొదలైన హీరోలందరి సినిమాలకు ఫైట్ మాస్టర్ గా చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్ విజయన్. ఒక్క తెలుగులోనే కాకుండా హిందీలో సల్మాన్ ఖాన్ సినిమాలకు కూడా పనిచేసాడు. ఇప్పుడు యాక్షన్ అంశాలే ప్రధాన హైలైట్ గా మంచు విష్ణు హీరోగా చేసిన సినిమా ‘డైనమైట్’. ఈ నెల 4న ఈ సినిమా రిలీజ్ కానుండడంతో కాసేపు విజయన్ తో ముచ్చటించాం. ఆ విశేషాలు మీకోసం..

ప్రశ్న) డైనమైట్ ఒక యాక్షన్ థ్రిల్లర్.. ఇప్పటికే మంచు చేసిన స్టంట్స్ కి మంచి పెరోస్తోంది. ఆ విషయంలో మీ పాత్ర ఎంత ఉంది.?
స) టాలీవుడ్ లో వస్తున్న డిఫరెంట్ జానర్ ఫిల్మ్ డైనమైట్. అందుకే ఈ సినిమా యాక్షన్ ని చాలా స్పెషల్ గా డిజైన్ చేసాం. ఉదాహరణకి ఓ యాక్షన్ ఎపిసోడ్ ఉంటే అందులో హీరో – విలన్స్ ధనాధన్ కొట్టుకుంటూ ఉంటారు, ఒక స్టేజ్ లో పీక్స్ కి తీసుకెళ్ళి ఆడియన్స్ చేత క్లాప్స్ కొట్టిస్తాం. కానీ ఈ సినిమాలో ప్రతి యాక్షన్ బిట్ ఆడియన్స్ చేత క్లాప్స్ కొట్టించేలా ఉండాలని చేసాం. ఆన్ స్క్రీన్ కూడా చాలా బాగా వచ్చాయి.

ప్రశ్న) మీరు డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కి మంచు విష్ణు ఎంత వరకూ న్యాయం చేసారు.?
స) మొదట నేను యాక్షన్ సీన్స్ డిజైన్ చేసుకొని వెళ్లి విష్ణుకి చెప్పాను. చాలా బాగున్నాయి అన్నాడు. ఇవి ఇంతకన్నా బాగా రావాలి అంటే నువ్వే కష్టపడాలి అన్నాను. ఆ మాటకి వాల్యూ ఇచ్చి స్పెషల్ ట్రైనింగ్ తో పాటు బాడీని కూడా బిల్డప్ చేసాడు. నేను అనుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ కి విష్ణు 100% న్యాయం చేసాడు.

ప్రశ్న) డైనమైట్ లో మంచు విష్ణులో జాకీ చాన్ స్టైల్ లో ఉంటుందని అన్నారు. మరి యాక్షన్ లో చైనీస్ స్టైల్ ఉంటుందా.?
స) జాకీ చాన్ ఒరిజినల్ స్టైల్ ని ఇందులో చూడలేం ఎందుకంటే జాకీ చాన్స్ యాక్షన్ లో ఇన్నర్ గా ఓ హ్యూమర్ కూడా ఉంటుంది. కానీ ఇదొక సీరియస్ ఫిల్మ్. అందుకే సీరియస్ జాకీ చాన్ అయితే ఎలా చేస్తారు అనే స్టైల్ ని చూడచ్చు. సినిమా సీరియస్ కావున నేను ప్రతి యాక్షన్ ఎపిసోడ్ లో ప్రతి పంచ్ ఆడియన్స్ చేత క్లాప్స్ కొట్టేలా జాగ్రత్తలు తీసుకున్నాం.

ప్రశ్న) తనకంటూ ఓ సెపరేట్ స్టైల్ ఉన్న దేవకట్టా యాక్షన్ ఎపిసోడ్స్ లో ఎంత వరకూ ఇన్వాల్స్ అయ్యారు.?
స) తమిళ కథలో కొన్ని డ్రాగ్స్ ఉన్నాయి, వాటిని దేవకట్టా క్లియర్ చేసారు. మొదట్లోనే రీమేక్ కదా అని నేను ఆ యాక్షన్ ఇక్కడ కాపీ కొట్టలేను అని చెప్పి, ప్రతి యాక్షన్ సీన్ కి నేను చాలా డిజైన్స్ ఇస్తే ఆయన కథకి ఏది పర్ఫెక్ట్ సింక్ అవుతుందో అవే తీసుకున్నారు. మంచి టేస్టున్న డైరెక్టర్.

ప్రశ్న) మీ కెరీర్లో ఫస్ట్ మీకు బ్రేక్ ఇచ్చిన హీరో లేదా సినిమా ఏమిటి.?
స) నాన్నగారి దగ్గర పనిచేయడం చూసిన దాసరి గారు మొదట పిలిచారు, కానీ అది కుదరలేదు. ఆ తర్వాత చిరంజీవి గారు పిలిచి ‘మంత్రిగారి వియ్యంకుడు’ సినిమా చేయమన్నారు. ఆ తర్వాత పలు సినిమాలు చేశా, రాఘవేంద్ర రావుతో చేసిన ‘బొబ్బిలి బ్రహ్మన్న’ సినిమా బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత వెనకకి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు.

ప్రశ్న) ఓ సినిమాకి యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పనిచేసేటప్పుడు ఏం దృష్టిలో పెట్టుకొని యాక్షన్ ఎపిసోడ్స్ కంపోజ్ చేస్తారు.?
స) సినిమా అనగానే క్లాస్ ఆడియన్స్, బి సెంటర్ వారు, పక్కా మాస్ ఆడియన్స్ తో పాటు చిన్న పిల్లలు కూడా వస్తారు. వీరందరినీ సంతృప్తి పరిచేలా యాక్షన్ ఎపిసోడ్స్ కంపోజ్ చెయ్యాలి అంటే కథ, బ్యాక్ డ్రాప్ తెలియాలి. అందుకే నేను ఓ సినిమాకి సైన్ చేసినప్పుడు ఆ సినిమా కథ ఏంటి, ఏ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది అనేది తెలుసుకుంటాను, దానికి తగ్గట్టు ఫైట్స్ డిజైన్ చేస్తా. నా టార్గెట్ ఎప్పుడు ఒకటే థియేటర్ కి వచ్చే అన్ని వర్గాల ప్రేక్షకులు యాక్షన్ ఎపిసోడ్స్ ఎంజాయ్ చెయ్యగలగాలి.

ప్రశ్న) ‘కృష్ణం వందేజగద్గురుమ్’ సినిమా తర్వాత తెలుగులో బాగా గ్యాప్ తీసుకున్నారు. ఎందుకని.?
స) ఆ సినిమాకి ముందు కూడా కాస్త గ్యాప్ తీసుకున్నాను. దానికి మొదటి కారణం బాలీవుడ్ లో వరుసగా సల్మాన్ ఖాన్ సినిమాలు(వాంటెడ్, దబాంగ్, బాడీ గార్డ్) చేయడం. ఇక రెండవ కారణం ఈ గ్యాప్ లో నా కొడుకు తమిళంలో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆ బాధ్యత కూడా నేనే తీసుకొని వాడి సినిమాలకు పనిచేయాల్సి వచ్చింది. ఇప్పుడు వాటి నుంచి కాస్త ఫ్రీ అయ్యాను ఇకపై కంటిన్యూగా సినిమాలు చేస్తాను.

ప్రశ్న) సినిమాలో ‘యాక్షన్ ఎపిసోడ్స్’ అంటే మీరెలా వివరిస్తారు.?
స) మామూలుగా యాక్షన్ ఎపిసోడ్స్ అంటే డమ్మాల్ డుమ్మీల్ అంటూ అందరూ కొట్టుకోవడం అంటారు. నా పరంగా మాత్రం యాక్షన్ అంటే కొట్టుకోవడం కాదు అదొక ఎమోషన్. అందుకే యాక్షన్ లో కూడా ఎక్స్ ప్రెషన్స్ ఉండాలి, సెపరేట్ మానరిజమ్స్ చూపించాలి. అందుకే నేను ప్రతి సినిమాలోనూ నటుల హావ భావాలను, మానరిజమ్స్ ని చూపిస్తాను.

ప్రశ్న) డైనమైట్ గురించి తెలుగు ప్రేక్షకులకు ఏం చెప్తారు.?
స) దేవకట్టా స్టైలిష్ డైరెక్టర్. థ్రిల్లర్ కథాంశానికి యాక్షన్ ని బాగా మిక్స్ చేసి ఇది వరకూ చూడని మోస్ట్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా ‘డైనమైట్’ ని మీ ముందుకు తీసుకు వస్తున్నారు. విష్ణు తన స్టంట్స్ తో మిమ్మల్ని థ్రిల్ చేస్తాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు