ఇంటర్వ్యూ : నటుడిగా అంతకంటే ఏం కావాలి ? – హీరో నీరజ్ శ్యామ్

ఇంటర్వ్యూ : నటుడిగా అంతకంటే ఏం కావాలి ? – హీరో నీరజ్ శ్యామ్

Published on Dec 23, 2017 4:59 PM IST

ఈ నెల 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘ఇ ఈ’ ఈ సినిమాతో హీరోగా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హీరో నీరజ్ శ్యామ్ తో స్పెషల్ ఇంటర్వ్యూ…

మీ గురించి చెప్పండి..?

నేను డాక్టర్ అండి డెంటిస్ట్. అందరు హాస్పిటల్ ఓపెన్ చెయొచ్చు కదా అన్నారు. కానీ మా పేరెంట్స్ నన్ను బాగా సపోర్ట్ చేసారు. చిన్నప్పటి నుండి నాటకాలు వేసాను. నేను డైరెక్ట్ చేసిన ట్రిపుల్ ఎక్స్ యాడ్ బాగా పాపులర్ అయ్యింది.

మీ తొలి సినిమా ?

2011 లో కన్నడలో ఒక సినిమా చేసాను. త్వరలో ఆ సినిమా విడుదల కానుంది. ఇప్పటి వరకు నేను నాలుగు సినిమాలు చేశాను. ఇ ఈ సినిమాలో నేను చేసిన పాత్ర చెయ్యడానికి చాలా కష్ట పడ్డాను.

సినిమాకు రెస్పాన్స్ ఎలా ఉంది ?

ఇ ఈ సినిమా చూసిన ప్రతివక్కరు సినిమా బాగుంది అంటున్నారు ముఖ్యంగా సెకండ్ హాఫ్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. సినిమా బాగాలేదు, డైరెక్షన్ బాగాలేదని ఎవ్వరు చెప్పలేదు.

సినిమాకు మీ పబ్లిసిటీ ఎలా హెల్ప్ అయ్యింది ?

చాలా బాగా హెల్ప్ అయ్యింది. ఎంసీఏ & హలో సినిమాలు విడుదల అవుతున్నాయి ఈ సమయంలో మీ సినిమా ఎందుకు అని అన్నారు కాని ఇప్పుడు విడుదలవ్వడంతో జనాలు మా సినిమాను బాగా రిసీవ్ చేసుకున్నారు.

మీరు హీరో వెంకటేష్ ను ఇమిటేట్ చేసున్నారనిపిస్తుంది దాని గురించి ?

అది నాకు చాలా మంచి కాంప్లిమెంట్. నా నటనకు మంచి గుర్తింపు లభిస్తుంది. నటుడిగా నాకు అంతకంటే ఇంకెంకావాలి. సంతోషంగా ఉంది.

డైరెక్టర్ గురించి ?

డైరెక్టర్ రామ్ గణపతి రావ్. యమిమేషన్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన ఆయన ఇంతమంచి సినిమా చేయడం గ్రేట్. మంచి స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ఆయన వర్క్ కు మంచి గుర్తింపు లాభిస్తోంది.

తదుపరి చిత్రాలు ?

ఇ ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్ గా చేసిన జాన్మెన్ ఝ తో ఒక సినిమా చెయ్యబోతున్నాను, అలాగే వెంకి అనే నూతన దర్శకుడితో సినిమా చేస్తున్నాను. ఇతను మారుతి దగ్గర కో డైరెక్టర్ గా పని చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు