ఇంటర్వ్యూ : కార్తి – ‘చెలియా’ ఫెయిల్యూర్ గురించి నాకు ముందే తెలుసు!

ఇంటర్వ్యూ : కార్తి – ‘చెలియా’ ఫెయిల్యూర్ గురించి నాకు ముందే తెలుసు!

Published on Nov 13, 2017 1:28 PM IST

వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తి పోలిష్ అధికారి పాత్రతో ‘ఖాకి’ సినిమాతో ఈ శుక్రవారం మరోసారి ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. ఈ సందర్భంగా హీరో కార్తి మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు…

ప్ర) ఈ స్క్రిప్ట్ లో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశం ఏంటి ?
జ) దర్శకుడు వినోద్ నా దగ్గరికి వచ్చి ఈ స్క్రిప్ట్ చెప్పగానే నచ్చింది. 90 లలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆదారంగా ఈ సినిమా తెరకెక్కించాం. కొన్ని సన్నివేశాలు ఉన్నవి ఉన్నట్లు ఈ సినిమాలో చూపించడం జరిగింది.

ప్ర) ఈ సినిమా కోసం మీరు ఎలాంటి రీసెర్చ్ చేసారు ?
జ) తమిళనాడులో నేను ఒక పోలిస్ అధికారిని కలిసి దాదాపు నాలుగు గంటలు చర్చించాను. ఆ అధికారే మేము సినిమాలో చెప్పబోయే పాయింట్ ను నిజ జీవితంలో ఇన్వెస్ట్ గేట్ చేశారు. అతని ద్వారా ఈ కేసుకు సంబంధించి నిజాలను తెలుసుకోవడం జరిగింది.

ప్ర) మీరు చేసిన పోలీస్ అధికారి పాత్ర మీ పై ఎలాంటి ప్రభావం చూపింది ?
జ) ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు పోలిస్ వ్యవస్థ పై గౌరవం పెరిగింది. కొన్ని సీరియస్ కేసుల్ని వారు ఎలా డీల్ చేస్తారో అనిపించింది. బయట పోలిస్ కనిపిస్తే మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువ మర్యాద ఇస్తున్నాను.

ప్ర) రకుల్ గురించి చెప్పండి ?

జ) ఈ సినిమాలో నాకు భార్యగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఆమెకు ఇలాంటి పాత్ర చెయ్యడం మొదటిసారి. సినిమా మొత్తం సీరియస్ మూడ్ లో వెళ్తుంటే ఆమె పాత్ర మటుకు చాలా సరదాగా ఉంటుంది.

ప్ర) ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయా ?
జ) వాస్తవ సంఘటనల ఆధారంగా ‘ఖాకి’ సినిమాను తెరకెక్కించాం. కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. నేను డిఎస్పి పాత్రలో కనిపించాబోతున్నాను. నా కారెక్టరైజేషన్ స్టైలిష్ గా ఉండబోతుంది.

ప్ర) ‘చెలియా’ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణాలు ఏంటి ?
జ) డైరెక్టర్ మని రత్నం గారు స్క్రిప్ట్ చెప్పినపుడే ఇది ప్రయోగాత్మకమైన సినిమా అని ఒకటికి రెండుసార్లు చెప్పారు. కానీ ఆయనతో వర్క్ చేసే అవకాశం రావడం గొప్ప విషయం. మణి సార్ తో వర్క్ చేసే సమయంలో చాలా విషయాలు నేర్చుకున్నాను.

ప్ర) ‘సింగం’ సినిమాలో పోలిస్ కి ‘ఖాకి’ లో పోలిస్ కి తేడా ఏంటి ?

జ) ‘సింగం’ సినిమాలో పోలిస్ సినిమా పరంగా కనిపిస్తాడు. నా పాత్ర ఈ సినిమాలో చాలా రియలిస్టిక్ గా ఉండబోతుంది. సీరియస్ ఎమోషన్స్ ఉంటాయి.

ప్ర) ‘ఊపిరి’ సినిమా తరువాత తెలుగులో ఎలాంటి సినిమా అఫర్స్ వచ్చాయి?

జ) ఆ సినిమా తరువాత ఒక సినిమా చెయ్యమని అడిగారు కాని వర్క్ అవుట్ కాలేదు. ఆ సినిమా చేసినంతగా నన్ను ఏ సినిమా స్క్రిప్ట్ కదిలించలేదు.

ప్ర) మీరు విశాల్ ప్రభుదేవాతో ఓకే చేసిన సినిమా ఏమయ్యింది ?

జ) కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడింది.

ప్ర) కమల్ హాసన్ రాజకీయాల్లోకి రావడం పట్ల మీ అభిప్రాయం ?

జ) కమల్ హాసన్ గారు అన్నీ తెలిసిన మనిషి. ఆయన అనవసరంగా అన్ని విషయాల్లోను తల దూర్చరు. కాని పరిస్థితులు ఆయన్ని అలా చేసాయి అనుకుంటున్నాను.

ప్ర) మీ తదుపరి సినిమాలు ?

జ) పల్లెటూరు వాతావరణం నైపథ్యంలో ఒక సినిమా చెయ్యబోతున్నాను. ఆ సినిమా తరువాత ప్రేమ కథలో నటిస్తున్నాను. అందులో కూడా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు