ఇంటర్వ్యూ : కృష్ణంరాజు- ఈ ఏడాదిలోనే ప్రభాస్ పెళ్లి !

ఇంటర్వ్యూ : కృష్ణంరాజు- ఈ ఏడాదిలోనే ప్రభాస్ పెళ్లి !

Published on Jan 19, 2018 6:01 PM IST


ఎనో విభిన్నమైన పాత్రల్లో, సినిమాల్లో నటించి రెబల్ స్టార్ గా ప్రేక్షకులను అలరించిన నటుడు కృష్ణంరాజుగారు. రేపు తన పుట్టినరోజు రేపు ఈ సంధర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ఇండస్ట్రీ లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఎలా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు ?

జ) గత 30,40 ఏళ్లుగా నన్ను అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారితోనే నా పుట్టినరోజు వేడుకలు జరుపుకోబోతున్నాను. దీనితో పాటు ఇండస్ట్రీలో 50 ఏళ్ళ ప్రయాణం పూర్తైంది. ఈ ఫంక్షన్ కూడా ప్రత్యేకంగా ప్లాన్ చేసాను.

ప్ర) మీ ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు ?

జ) నేను సినిమాల్లో నటించడానికి ఆసక్తిగా లేనని బయట రూమర్స్ వస్తున్నాయి. కానీ మంచి పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తాను. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో మంచి పాత్ర పోషించిన సంగతి మీ అందరికి తెలిసిందే.

ప్ర)మీ రాజకీయ భవిష్యత్తు ఏంటి ?

జ) గత కొన్ని ఏళ్లుగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నాను. మోడీ నాయకత్వంలో బిజేపి పార్టీలో సేవలు అందిస్తాను. ఆ పార్టీలోనే కొనసాగుతాను.

ప్ర) మీ సొంత బ్యానర్ లో ప్రభాస్ సినిమా గురించి ?

జ) డైరెక్టర్ రాధాకృష్ణ మా సంస్థలో నిర్మించబోయే సినిమాకు దర్శకత్వం వహిస్తాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ‘సాహో’ సినిమా తరువాత ఈ సినిమా మొదలవుతుంది. .

ప్ర) ప్రభాస్ పెళ్లి గురించి ?

జ) ప్రతిసారి ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ఇబ్బందిగా ఉంది. ప్రభాస్ పెళ్లి ఈ ఏడాదిలోనే జరుగుతతుంది. ప్రభాస్ కూడా పెళ్ళికి సుముఖంగానే ఉన్నాడు.

ప్ర) పవన్ కళ్యాణ్, రజినీ కాంత్, కమల్ హాసన్ రాజకీయ అరంగ్రేటం గురించి ?

జ) అందులో నేను చెప్పడానికి ఏమీ లేదు. వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు, లక్ష్యాలు వారివి.

ప్ర) ప్రస్తుతం టాలీవుడ్ పరిస్థితిపై మీ కామెంట్ ?

జ) ‘బాహుబలి’ సినిమాతో తెలుగు పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ఇది తెలుగు ప్రేక్షకులకు గర్వకారణం. హాలీవుడ్ సినీ పరిశ్రమ తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటోంది. తెలుగు సినీ పరిశ్రమ స్టాండెడ్స్ చాలావరకు మారుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు