ఇంటర్వ్యూ : లావణ్య త్రిపాటి – ఫస్ట్ టు లాస్ట్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే సినిమా ‘భలే భలే మగాడివోయ్’.

ఇంటర్వ్యూ : లావణ్య త్రిపాటి – ఫస్ట్ టు లాస్ట్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే సినిమా ‘భలే భలే మగాడివోయ్’.

Published on Aug 29, 2015 6:10 PM IST

lavanya
‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో అందాల రాక్షసిగా గుర్తుండిపోయిన హీరోయిన్ లావణ్య త్రిపాటి. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత లావణ్య నాని సరసన చేసిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సొట్ట బుగ్గల సుందరి లావంయతో కాసేపు ముచ్చటించి సినిమాకి సంబందించిన విశేషాలను తెలుసుకున్నాం ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) సినిమా రిలీజ్ కి దగ్గర పడుతున్న కొద్దీ బాగా ఉత్కంఠకి లోనవుతున్నారా.?
స) అవునండీ.. ఈ సినిమా కోసం మా టీం అంతా చాలా కష్టపడ్డాం. ఓవరాల్ గా సినిమా కూడా చాలా బాగా రావడంతో మా టీం అంతా హ్యాపీ గా ఉన్నాం. సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని చాలా నమ్మకంగా ఉన్నాను.

ప్రశ్న) భలే భలే మగాడివోయ్’లో మీ పాత్ర గురించి చెప్పండి.?
స) ఈ సినిమాలో నేను కూచిపూడి డాన్సర్ గా కనిపిస్తాను. నా పాత్రలో ఓ క్యూట్ నెస్ ఉంటుంది. సినిమాలో నానితో నా కెమిస్ట్రీ చాలా బాగుంటుంది.

ప్రశ్న) యంగ్ హీరో నానితో వర్క్ చెయ్యడం ఎలా ఉంది.?
స) నేను హీరోయిన్ గా పరిచయం కాకముందే నాని నటించిన ‘ఈగ’ సినిమా చూసాను. ఆ సినిమాలో నాని పెర్ఫార్మన్స్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. ఆ తర్వాత తను నటించిన మిగిలిన సినిమాలు చూసి తన టాలెంట్ కి చాలా పెద్ద ఫ్యాన్ గా మారిపోయాను. ప్రస్తుతం అతన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందు కెళ్తున్నాను. అలాంటి టైంలో అతనితో నటించే ఛాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది.

ప్రశ్న) టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో చేసిన అనుభవం గురించి చెప్పండి.?
స) ఓహ్.. మారుతి గారు చాలా స్వీట్ హార్ట్ పర్సన్, ఆయన నన్ను తమ్ముడు అని పిలుస్తారు. ఈ సినిమా షూటింగ్ టైంలో చాలా బాగా ఎంజాయ్ చేసాము. సినిమా పరంగా సూపర్బ్ గా తీసాడు. సినిమా మొదటి నుంచి చివరి వరకూ నవ్విస్తూనే ఉంటాడు.

ప్రశ్న) ఎక్కువగా హోమ్లీ రోల్స్ కే మీరు పరిమితం అవుతున్నారని ఎప్పుడు ఫీల్ అవ్వలేదా.?
స) అవునని అనాలి, అలాగే కాదు అని అనాలి. ఎందుకంటే ఇప్పటి వరకూ నాకు వచ్చిన పాత్రల వలన చాలా మంది నేను హోమ్లీ పాత్రలకే పరిమితం అని అలాంటివే ఆఫర్స్ చేస్తున్నారు. కానీ నేను ఎలాంటి ప్రయోగాత్మక సినిమా చెయ్యడానికైనా, అలాగే అవుట్ అండ్ అవుట్ గ్లామరస్ రోల్స్ చెయ్యడానికైనా సిద్దంగానే ఉన్నాను. కచ్చితంగా భవిష్యత్ లో గ్లామరస్ గా కూడా కనిపించి ప్రేక్షకులను మెప్పిస్తాను.

ప్రశ్న) ఒక సినిమాకి సైన్ చేసేటప్పుడు మీ పాత్రలో ఏం చూసి సెలక్ట్ చేసుకుంటారు.?
స) ముందుగా నేను సినిమా మొత్తం కథ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటాను. ఆ కథలో నా పాత్ర ఏం చేస్తుంది అనేది తెలుసుకుంటాను. అప్పుడు నా పాత్ర నన్ను ఎగ్జైట్ అయ్యేలా చేస్తే ఆ ప్రాజెక్ట్ కి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తా.

ప్రశ్న) దూసుకెళ్తా సినిమా తర్వాత ఇంత గ్యాప్ తీసుకోవడానికి గల రీజన్ ఏమిటి.?
స) దూసుకెళ్తా తర్వాత మా అమ్మగారికి ఆరోగ్యం బాగా లేకపోవడం వలన చిన్న బ్రేక్ తీసుకున్నాను. ఇప్పుడు నేను బ్యాక్. ప్రస్తుతం కొన్ని మంచి సినిమాలు చేతిలో ఉన్నాయి. మరి కొన్ని కథలు వింటున్నాను.

ప్రశ్న) మీరు తదుపరిగా చేస్తున్న సినిమాల గురించి చెప్పండి.?
స) భలే భలే మగాడివోయ్ సెప్టెంబర్ 4న రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఇది కాకుండా నాగార్జున గారి ‘సోగ్గాడే చిన్ని నాయనా’ షూటింగ్ ఫినిష్ చేసాను. అల్లు శిరీష్ తో చేస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. కొన్ని ఆసక్తికరమైన సినిమాలు చెయ్యాలనుకుంటున్నాను. అలాగే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోస్ తో కూడా పనిచెయ్యాలనుకుంటున్నాను. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను.

ప్రశ్న) ఫైనల్ గా ‘భలే భలే మగాడివోయ్’ గురించి ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు.?
స) ‘భలే భలే మగాడివోయ్’ ఫస్ట్ ఫ్రేం నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకూ మిమ్మల్ని పొట్టచెక్కలయ్యేలా నవ్వించే కంప్లీట్ ఎంటర్టైనర్. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమా బాగుంది చూడమని పదిమందికి చెప్తారు. సెప్టెంబర్ 4న తప్పకుండా థియేటర్స్ లో ‘భలే భలే మగాడివోయ్’ సినిమా చూసి ఎంజాయ్ చెయ్యండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు