ఇంటర్వ్యూ : మదన్ – ఆది డెడికేషన్ చూసి నేను స్ఫూర్తి పొందేవాన్ని.!

ఇంటర్వ్యూ : మదన్ – ఆది డెడికేషన్ చూసి నేను స్ఫూర్తి పొందేవాన్ని.!

Published on Feb 6, 2016 7:39 PM IST

Madan
ఆ నలుగురు, పెళ్ళైన కొత్తలో, ప్రవరాఖ్యుడు లాంటి క్లాస్ సినిమాలను అందించిన మదన్ దర్శకత్వంలో యంగ్ హీరో ఆది నటించిన కమర్షియల్ ఎంటర్టైనర్ ‘గరం’. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ని మిక్స్ చేసి చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 12న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మదన్ తో కాసేపు ముచ్చటించాం.. ఆ విశేషాలు మీకోసం..

ప్రశ్న) మీరు మొదటి నుంచి సాఫ్ట్ కాన్సెప్ట్ అండ్ టైటిల్స్ తో సినిమాలు చేసారు. మరి మొదటి సారి మాస్ ఎలిమెంట్స్ అండ్ మాస్ టైటిల్ ఎంచుకోవడం ఎలా ఉంది?
స) అవునండి మాస్ టచ్ అనేది నాకు నాకే చాలా కొత్తగా ఉంది. హీరో పాత్రలో మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. అలాగే ఏదైనా విషయంలో ఒకరి మీద ఒకరికి కోపం రావడాన్నే గరం అంటారు. అలాంటి గరం ఈ సినిమాలో ఉంది. ఇందులో లవ్ స్టొరీ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. అలాగే ఈ రెండు స్టోరీస్ లో గరం అనే ఫీలింగ్ వచ్చే కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణంతో పాటు ‘గరం’ టైటిల్ కమర్షియల్ గా ప్రేక్షకులకు రీచ్ అవుతుందని ఈ టైటిల్ పెట్టాం.

ప్రశ్న) మీరు రైటర్ అయ్యుండి కూడా శ్రీనివాస్(సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు డైరెక్టర్) దగ్గర ఈ సినిమా కథ తీసుకోవడానికి గల కారణం ఏంటి?
స) శ్రీనివాస్ ప్రవరాఖ్యుడు సినిమాకి నా దగ్గర పనిచేసాడు. అప్పుడు తను ఈ లైన్ చెప్పాడు. ఈ సినిమాలో లవ్ గురించి కొత్తగా చెప్పాం. ఆ పాయింట్ ని డెవలప్ చేయడం కోసం నేను సలహాలు ఇస్తూ వచ్చాను. అలా ఆ స్టొరీ డెవలప్ చేసాం. నాకు లైన్ అండ్ హీరో పాత్ర బాగా కనెక్ట్ అవ్వడంతో నేనే డైరెక్ట్ చేసాను. ఫైనల్ గా ఇప్పుడు గరం గా మీ ముందుకు వస్తుంది.

ప్రశ్న) మరి గరం సినిమా ఎలా ఉంటుంది.?
స) యువత కోరుకునే అంశాలు, లవ్ స్టొరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ని కలిపి కంప్లీట్ ఎంటర్టైనర్ గా రూపొందించిన సినిమానే ‘గరం’. కచ్చితంగా 2 గంటల పాటు బాగా ఎంటర్టైన్ అవుతారు. గరం అనేది పక్కా స్క్రీన్ ప్లే బేస్ మూవీ అని చెప్పచ్చు.

ప్రశ్న) ఈ సినిమాని మొదలు పెట్టిన తర్వాత మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చారు. ఎందుకలా?
స) 2014 ఆగష్టులో ఈ సినిమాని మొదలు పెట్టాం.. మొదలు పెట్టగానే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసాం.. ఆ తర్వాత ఆది పర్సనల్ లైఫ్, పెళ్లి.. అలాగే నాకు ఓ యాక్సిడెంట్ అవ్వడం వలన కాస్త గ్యాప్ తీసుకున్నాం. కనీ 2015 షూట్ స్టార్ట్ చేసాక ఆగకుండా షూట్ చేసి ఫినిష్ చేసేసాం.

ప్రశ్న) ‘గరం’ సినిమాలో ఆది పాత్ర ఎలా ఉంటుంది?
స) ‘సచ్చేదాకా సవాలక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయే, అలా అని తిండం మానేత్తామా, తొంగోడం మానేత్తామా.. అలాగే ప్రేమించడం కూడా మానెయ్యలేం కదా డార్లింగ్’. ఈ డైలాగ్ లోనే ఆది పాత్ర ఉంది. అతని లైఫ్ లో ఓ టార్గెట్ ఉంటుంది, ఆ లక్ష్యం వల్ల ప్రేమని దూరం పెట్టాలనుకునే వ్యక్తి కాదు. చదువు లేకుండా విలేజ్ నుంచి వచ్చిన వాడు కావడం వలన అంత మాస్ గా ఉంటాడు.

ప్రశ్న) మీ కథకి ఆది ఎంతవరకూ న్యాయం చేసారు?
స) చాలా డెడికేట్ పర్సన్ ఆది. సినిమా కథ చెప్పినప్పుడే తను సినిమాకి బాగా కనెక్ట్ అయ్యాడు. అందుకే ఎప్పుడు సినిమా సినిమా సినిమా అని పాత్ర కోసం ఏం చేయాలని వర్కౌట్ చేసాడు. చెప్పాలంటే మేము సినిమాని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి ఆదినే కారణం. ఎందుకంటే ఆది నమ్మకం, డెడికేషన్ చూసే మేము మా బద్దకాన్ని వదిలేసి ఈ సినిమా చేసాం.

ప్రశ్న) సాయి కుమార్ కి నిర్మాతగా ఇది మొదటి సినిమా. మరి ఆయన సపోర్ట్ ఎంతవరకూ ఉంది?
స) ది బెస్ట్ ప్రొడ్యూసర్. నా కెరీర్లో దొరికిన బెస్ట్ నిర్మాత.. మొదటగా ఈ సినిమా స్టార్టింగ్ లో బడ్జెట్ లిమిట్ పెట్టారు. కానీ కొద్ది రోజుల తర్వాత అవుట్ పుట్ చూసి బడ్జెట్ లో ఎలాంటి కండిషన్స్ లేకుండా, ఏది అడిగితే అది ఇచ్చి చేసారు.

ప్రశ్న) బాగా గ్యాప్ తీసుకొని ఈ సినిమా చేసారు. ఇకనైనా కంటిన్యూగా చేస్తారా?
స) ఆ గ్యాప్ అన్నది అనుకొనిని తీసుకున్నది కాదు. అనుకోకుండా నా లైఫ్ లో జరిగిన కొన్ని కారణాల వల్ల వచ్చింది. ఇక నుంచి కంటిన్యూగా చేయాలనే ఆలోచనలోనే ఉన్నాను. కానీ ఏ రేంజ్ సినిమా చేస్తాను అనేది గరం సినిమా విజయం మీద ఆదారపడి ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు