ఇంటర్వ్యూ : మంచు మనోజ్ – భవిష్యత్తులో కచ్చితంగా ఓ సినిమా డైరెక్ట్ చేస్తాను.!

ఇంటర్వ్యూ : మంచు మనోజ్ – భవిష్యత్తులో కచ్చితంగా ఓ సినిమా డైరెక్ట్ చేస్తాను.!

Published on Oct 12, 2014 5:58 PM IST

Manchu-Manoj
మంచు వారి ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన మంచు మనోజ్ మొదటి సినిమా నుంచి ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనాన్ని చూపిస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ‘పోటుగాడు’ లాంటి కమర్షియల్ హిట్ తర్వాత మంచు మనోజ్ చేసిన మరో కమర్షియల్ ఎంటర్టైనర్ ‘కరెంట్ తీగ’. ఈ సినిమా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబందించిన మరియు తన తదుపరి సినిమాల గురించిన పూర్తి విశేషాలు తెలుసుకున్నాం.. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) తమిళ్ మూవీ ‘వర్తపడు వాలిబార్ సంఘం’ సినిమాకి రీమేక్ చెయ్యాలన్న ఐడియా ఎవరిది.?

స) నాగేశ్వర్ రెడ్డితో ఓ సినిమా చెయ్యాల్సి ఉంది.. ముందుగా ఒక కథ అనుకొని దాని స్క్రిప్ట్ ఫినిష్ చేసి సెట్స్ పైకి వెళ్ళే ముందు తెలిసిన వారు ‘వర్తపడు వాలిబార్ సంఘం’ సినిమా చూడు, నీకు బాగా సెట్ అవుతుందని చెప్పడంతో ఆ సినిమా చూసాం. నాకు, నాగేశ్వర్ రెడ్డికి బాగా నచ్చేసింది. ఇక అన్నయ్య విష్ణు నాతో చాలా రోజుల నుంచి మూవీ చెయ్యాలని అనుకుంటున్నాడు. ఇది చెప్పగానే నచ్చి రైట్స్ తీసుకొని సెట్స్ పైకి వెళ్ళాము.

ప్రశ్న) తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఈ సినిమాలో చాలా మార్పులు చేసినట్టు ఉన్నారు.? ఆ విశేషాలు చెప్పండి.?

స) అవునండి చాలా మార్పులు చేసాం.. మామూలుగా రీమేక్ అనగానే ఆ డివిడి పెట్టుకొని చేసేస్తారు.. కానీ ఆ ఫీలింగ్ ఇందులో రాకూడదని, చాలా చాలా మార్పులు చేసాం. విలన్ పాత్రలని జత చేసాం. అలాగే మన తెలుగులో ఉన్న రేంజ్ లో అక్కడ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండవు. అలాగే డైలాగ్స్ పరంగా కూడా అక్కడి కంటే ఇక్కడ ఎక్కువ ఫన్ ఉంటుంది. అలాగే తమిళ్ లో రన్ టైం ఎక్కువ ఉంటుంది, కానీ తెలుగులో చాలా తగ్గించి స్పీడ్ గా ఉండేలా ప్లాన్ చేసుకున్నాం.

ప్రశ్న) కరెంట్ తీగ లోని స్పెషల్ రోల్ కోసం సన్నీ లియోన్ ని తీసుకోవాలనే ఆలోచన ఎవరిది.? ఈ విషయంలో మోహన్ బాబు గారు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదా.?

స) కరెంట్ తీగ సినిమాలో స్పెషల్ రోల్ కోసం ఓ పెద్ద హీరోయిన్ ని అనుకున్నాం. ఆమె కూడా ఒప్పుకున్నారు కానీ చివరి నిమిషంలో నా ఫ్రెండ్ రంజిత్ ఈ రోల్లో సన్నీ లియోన్ ని ఊహించుకో అనగానే అదేమాట నేను డైరెక్టర్ చెవిలో వేస్తే అదిరిపోద్ది బాబు అన్నాడు. అంతే అలా సన్నీ లియోన్ ఫిక్స్ అయ్యింది, వచ్చింది.. చేసింది వెళ్ళిపోయే రోజు నాన్న గారు వచ్చి బాగా చేసిందని చిన్న సత్కారం కూడా చేసాడు. ఇక్కడ మాకు కలిసొచ్చిన విషయం ఏమిటంటే సన్నీ లియోన్ గురించి నాన్న గారికి తెలియదు. సన్నీ షూటింగ్ పూర్తైపోయిన మరుసరోజు వర్మ గారు చెప్పడంతో నాన్న నన్ను కేకలు వేసాడు. అప్పుడు ఆయనకి చెప్పాం ఒకప్పుడు పోర్న్ స్టార్ కానీ ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ గా చేస్తోందని చెప్పడంతో ఆయన కాస్ట్ కూల్ అయ్యారు.. చెప్పాలంటే సన్నీ లియోన్ వల్ల ఈ సినిమాకి బాగానే క్రేజ్ వచ్చింది.

ఇదంతా పక్కన పెడితే సన్నీ లియోన్ ని చూసి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే తనని అందరూ పోర్న్ స్టార్ అని క్రిటిసైజ్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు తను పోర్న్ స్టార్ ఆ తర్వాత తను ఇండియా వచ్చి తనకంటూ నటిగా గుర్తింపు తెచ్చుకొని స్టార్ ఎదిగింది, అలా యాక్టర్ గా స్టార్ అయ్యింది కాబట్టే మనం మన సౌత్ సినిమాలో కూడా పెట్టుకున్నాం. అందుకే మనం ఆమె రెస్పెక్ట్ ఇవ్వాలి. మన ఇండియాలో బ్రోతల్ కేసులో బుక్ అయిన హీరోయిన్ ని జైల్లో వేస్తారు అదే తను పోర్న్ స్టార్ అయినా ఇండియాలో మాత్రం ఆమెని మాత్రం సూపర్ స్టార్ ని చేస్తారు. ఏంటో ఈ విడ్డూరం..

ప్రశ్న) సన్నీ లియోన్ వల్ల కరెంట్ తీగకి ‘ఏ’ సర్టిఫికేట్ వచ్చిందని అంటున్నారు. దీనిపై మీ కామెంట్.?

స) ఈ విషయంపై నేనే క్లారిటీ ఇద్దాం అనుకున్నాను.. సన్నీ లియోన్ వల్ల ఏ సర్టిఫికేట్ రాలేదు.. ఈ పాటలో ఉండే డాన్సర్స్ వల్ల ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఎందుకంటే ఈ పాటని హాలీవుడ్ స్టైల్లో, ఎం టీవీలో ప్రసారం అయ్యే సాంగ్స్ స్టైల్లో ఉంటుంది. కానీ ఈ పాటలో ఎలాంటి వల్గారిటీ ఉండదు. కానీ సెన్సార్ వారు మాత్రం ఆ యాంగిల్ లో ఆలోచించకుండా ఏ సర్టిఫికేట్ ఇచ్చారు.

ప్రశ్న) ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి.?

స) ఇప్పటి వరకూ అన్ని సినిమాల్లో నేను చేసిన పాత్రలు అల్లరి అల్లరిగా ఉంటాయి.. ఈ సినిమాలో మాత్రం ఫుల్ మాన్లీగా ఉంటూ పూర్తి వెటకారం ఉండే పాత్ర చేసాను. ఇందులో నా పాత్ర పేరు రాజు.. ఒక విలేజ్ లో విఐపి(విలేజ్ ఇంపార్టెంట్ పర్సన్) అనే సంఘానికి లీడర్. ఆ ఊరి పెద్దలకి వ్యతిరేకంగా వెళుతూ ఊరిని డెవలప్ చేసే పనులు చేస్తూ ఉండే పాత్ర.

ప్రశ్న) జగపతి బాబుని ఈ సినిమాలో తీసుకోవాలన్న ఆలోచన ఎవరిది.? మీ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ ఏమిటి.?

స) సినిమా స్టొరీ ఫైనలైజ్ చేసినప్పుడే ఈ పాత్రకి జగపతి బాబు గారే అని ఫిక్స్ అయిపోయాం. ఆయన్ని అడగ్గానే చేద్దాం అన్నాడు ఒక సిట్టింగ్ లోనే స్టొరీ ఓకే చేసారు. ఈ సినిమాకి బ్యాక్ బోన్ లాంటి పాత్ర ఆయన చేసాడు. మా ఇద్దరి కాంబినేషన్ లో కామెడీ, యాక్షన్ మరియు ఎమోషనల్ సీన్స్ వస్తాయి. అవి అన్నీ సూపర్బ్ గా వచ్చాయి.

ప్రశ్న) ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చి 10 సంవత్సరాలైంది.. ఈ జర్నీ చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది.?

స) నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. అందుకే నాకు ఇప్పుడు ఇండస్ట్రీ బాగా నచ్చుతోంది. ముఖ్యంగా కాంపిటీషన్ పెరిగింది. అలాగే గతంలో కంటే ఇప్పుడు బయట ఉన్న చాలా మందికి అవకాశాలు వస్తున్నాయి. ముందుముందు ఆ అవకాశాలు డబుల్ అవ్వాలని, అలాగే ఆ అవకాశాలు కొంతమందికే పరిమితం కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను.

ప్రశ్న) మీ సినిమాల్లో మీరు యాక్షన్ స్టంట్స్ కోసం ఎక్కువ రిస్క్ చేస్తుంటారు. ఈ విషయంపై మీకు ఇంట్లో వాళ్ళ నుంచి కూడా ఎక్కువ వ్యతిరేఖత వస్తోంది. దీనిపై మీ కామెంట్.?

స) (నవ్వుతూ) జాకీ చాన్ ని కూడా తన ఇంట్లో వారు రిస్క్స్ చెయ్యద్దు అని అంటారు. కానీ ఆయన చేయడం ఆపాడా.. లేదుగా.. ఇదీ అంతే.. చిన్నప్పటి నుంచి జాకీచాన్ – రాజేంద్రప్రసాద్ అంటే ఇష్టం. చిన్న నాటి నుంచే వాళ్ళని ఫాలో అయిపోయాను. ఇకపోతే ఇండస్ట్రీలో యాక్షన్ సీక్వెన్స్ అంటే 10 రోజులు తీసాం,లేదా 20 , 25 రోజులు తీసాం అంటుంటారు, ఒకవేళ మనం ఏమన్నా కత్తి యుద్దాలు లాంటివి ఏమన్నా చేస్తుంటే అన్ని రోజులు తీసుకోవాలి, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు అన్ని రోజులు ఎందుకు అనిపించేది, అందుకే నాకు వాళ్ళు చెప్పే మాటలు నాకు భూతులా అనిపించాయి. అందుకే నేను నా యాక్షన్ ఎపిసోడ్స్ ని 3లేదా4 రోజుల్లో ఫినిష్ చేసేస్తాను. రోప్ లు కూడా వాడను ఎందుకంటే రోప్ లు వాడితే బడ్జెట్, టైం పెరిగిపోతుంది. అందుకే రియల్ స్టంట్స్ మీద లాగించేస్తున్నాను. చెప్పాలంటే మొదటగా బిందాస్ సినిమా టైంలో బడ్జెట్ సమస్య వచ్చి రోప్ లు ఏమీ లేకుండా ఇలా రిస్కీ స్టంట్స్ చేయడం మొదలు పెట్టాను. ఇప్పుడు అదే అలావాటై పోయింది.

ప్రశ్న) సెన్సార్ బోర్డ్ మెంబర్ తో మీరు, మీ ఫ్యామిలీ చాలా సార్లు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఆమె ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఇండస్ట్రీలో చాలా మంది హ్యాపీగా ఫీలయ్యారు. ఈ విషయంపై మీ స్పందన ఏమిటి.?

స) నా కర్మ కాలి నా ‘కరెంట్ తీగ’ కి ఆమె సెన్సార్ చేసింది (నవ్వులు).. మనం ఏ విషయాన్ని అయినా భూతుగా చూస్తే అన్నీ భూతులాగే కనపడుతాయి. ఆమె అలానే చూడడం వలన దొబ్బెయ్, ఇన్స్ట్రు మెంట్స్ పగిలిపోతాయ్ అన్నా కానీ కట్స్ వేసేసేది. ఈ సినిమా కంటే నోకియా టైంలో ఎక్కువ ఇబ్బంది పెట్టింది. దీన్ని అధికార దుర్వినియోగం అంటారు. అధికారం చేతులో ఉందికదా అని ఎలా పడితే అలా వాడుకోకూడదు. అదే ఆమె చేసింది. ఆమె వెళ్లిపోవడంతో కొంతన్నా మార్పు వస్తుందని అనుకుంటున్నాను.

ప్రశ్న) అచ్చుతో ఉన్న రిలేషన్ ఏంటి.? మీ అన్ని సినిమాలకి తనే మ్యూజిక్ చేస్తున్నాడు.?

స) కృష్ణార్జున టైంలో నాకు అచ్చుతో పరిచయం అయ్యింది. పరిచయం అయిన గంటలోనే బాగా క్లోజ్ అయిపోయాం. ఆ టైం లోనే నేను నేను మీకు తెలుసా సినిమా చేస్తున్నాను. ఆ సినిమాకి నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అని ఫిక్స్ అయ్యాను. అలాగే నాకు ఎవరో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కి ఒక సందర్భం గురించి ఒక గంట చెప్పే బదులు అచ్చు లేదా యువన్ శంకర్ రాజాలతో అయితే ఒక్క నిమిషంలో అయిపోద్ది.. వీరిద్దరితో నాకు రాపో ఉండడం వలన ఎక్కువగా చేస్తుంటాను తప్ప ఇంకేమీ లేదు. అలాగే చాలా మంది అచ్చుది ఏమీ ఉండదు, మనోజ్ ఏ అంతా చేసేస్తాడని అంటుంటారు కానీ నాదేమీ ఉండదు నేను నాకు ఏమి కావాలి, ఎలా కావాలి అనేది మాత్రమే చెబుతాను మిగత అంతా తనే చూస్కుంటాడు.

ప్రశ్న) మీ ప్రకారం కరెంట్ తీగ హైలైట్స్ ఏమిటి.?

స) ఈ సినిమాకి సాంగ్స్ ప్రాణం అని చెప్పాలి. అలాగే తిరుమల శెట్టి రాసిన డైలాగ్స్ హైలైట్ అవుతాయి. ఇకపోతే కామెడీ, లవ్ అండ్ ఎమోషన్ సీన్స్ కూడా మెయిన్ హైలైట్ అవుతుంది.

ప్రశ్న) మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి.? ‘సన్ ఆఫ్ పెదరాయుడు’ సినిమా ఏమైంది.? భవిష్యత్తులో డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంది.?

స) త్వరలోనే రమేష్ పుప్పాల ప్రొడక్షన్ లో, ఓ కొత్త డైరెక్టర్ తో సినిమా ఉంటుంది. అలాగే మరో సినిమా కూడా ఉంది. అందులో నా పాత్రలో ఫుల్ నెగటివ్ షేడ్స్ ఉంటుంది. పూర్తి వివరాలు త్వరలోనే అనౌన్స్ చేస్తాను. ‘సన్ ఆఫ్ పెదరాయుడు’ పూర్తిగా ఆగిపోయింది. ఆ సినిమా కథ అనుకునే టైం లో ఈ స్టొరీ లైన్ సన్ ఆఫ్ పెదరాయుడు లాగా ఉండే అంటే అదే టైటిల్ ని ఫైనలైజ్ చేసి అనౌన్స్ చేసేసారు. కానీ ఆ స్క్రిప్ట్ వర్కౌట్ అవ్వకపోవడం వలన అది పూర్తిగా ఆగిపోయింది. ఇది కాకుండా డైరెక్షన్ అంటే భవిష్యత్తులో కచ్చితంగా చేస్తాను. అది ఎప్పుడు అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు.

ప్రశ్న) మీ చేయాలనుకున్న డ్రీం రోల్స్ లేదా మీ నాన్నగారు మిమ్మల్ని ఇలాంటి పాత్రల్లో చూడాలని కోరుకునే రోల్స్ ఏమన్నా ఉన్నాయా.?

స) నాకు డ్రీం రోల్స్ అంటూ ఏమీ లేవండి.. ప్రతిదాన్ని డ్రీం రోల్ లా ఫీలై చేసుకుంటూ వెళ్తాను. నాన్నగారికి మాత్రం నేనొక సోషియో ఫాంటసీ సినిమా చేయాలని ఉందని అన్నారు. ఫ్యూచర్ లో కథ వస్తే చేస్తాను.

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి మంచు మనోజ్ ‘కరెంట్ తీగ’ సూపర్ హిట్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పాము..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు