ఇంటర్వ్యూ : మెహరీన్ – అన్ని కమర్షియల్ అంశాలు ఉన్న ప్రేమకథే కృష్ణగాడిది

ఇంటర్వ్యూ : మెహరీన్ – అన్ని కమర్షియల్ అంశాలు ఉన్న ప్రేమకథే కృష్ణగాడిది

Published on Feb 6, 2016 5:01 PM IST

Mehreen
యంగ్ హీరో నాని హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్ లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రానున్న సినిమా ‘కృష్ణ గాడి వీర ప్రేమగాథ’. ఈ సినిమా ద్వారా నార్త్ ఇండియన్ బ్యూటీ మెహరీన్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఈ సినిమా ఫిబ్రవరి 12న రిలీజ్ కానుండడంతో మెహరీన్ తో కాసేపు ముచ్చిటించి మొదటి సినిమా విశేషాలను, అనుభవాలను తెలుసుకున్నాం. ఆ విశేషాలు మీకోసం..

ప్రశ్న) ఈ సినిమాలో ఆఫర్ ఎలా వచ్చింది?
స) నేను ఇప్పటి వరకూ సుమారు 35 కమర్షియల్ యాడ్స్ లో నటించాను. అలా నా ఫొటోస్ చూసిన డైరెక్టర్ హను నన్ను ఆడిషన్ కి పిలిపించారు. అలా రెండు రోజులు ఆడిషన్స్ కి వెళ్ళా అప్పుడు సినిమాలోని కొన్ని సీన్స్ చెప్పగా అవి చేసాను. అవి హనుకి బాగా నచ్చడంతో ఈ సినిమాకి నన్ను సెలక్ట్ చేసుకున్నారు.

ప్రశ్న) ఈ ప్రేమకథలో మీ పాత్ర అలియాస్ మహాలక్ష్మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
స) ఫ్యాక్షనిజంకి కేరాఫ్ అయిన రాయలసీమకి చెందిన మహాలక్ష్మి పాత్రలో కనిపిస్తాను. ఈ సినిమా కథ ఒక 15 ఏళ్ళ క్రితం జరుగుతుంది. ఆ బ్యాక్ డ్రాప్ ని చాలా ఆసక్తికరంగా చూపించారు.

ప్రశ్న) నానితో వర్క్ చేయడం ఎలా ఉంది?
స) అతను నాచురల్ స్టార్ అని అందరికీ తెలిసిందే.. అతనితో కలిసి చేయడం మొదలు పెట్టిన కొద్ది రోజుల్లోనే ఆ విషయాన్ని నేను గ్రహించాను. అతనికి తన పాత్ర మీద పూర్తి క్లారిటీ ఉంటుంది, అందుకే తను సినిమాకి ది బెస్ట్ ఇస్తాడు.

ప్రశ్న) తెలుగు కొత్త.. ఇదేమో రాయలసీమ బ్యాక్ డ్రాప్ కథ.. మరి మీ రోల్ కోసం ఎలాంటి కేర్ తీసుకున్నావ్?
స) నేను డైరెక్టర్ తో ట్రావెల్ అవుతూ నా డైలాగ్స్ నుంచి పెర్ఫార్మన్స్ వరకూ అన్ని విషయాల్లో బాగా ప్రిపేర్ అయ్యాను. మహాలక్ష్మి పాత్రలా కాస్ట్యూమ్స్ వేసుకోవడం, బిహేవ్ చెయ్యడం లాంటి వాటిపై బాగా వర్కౌట్ చేసాం. ఈ సినిమాలో నా పాత్రని నేనే సొంతంగా కాస్ట్యూమ్స్ సెలక్ట్ చేసుకున్నాను.

ప్రశ్న) అసలు ఈ కృష్ణ గాడి ప్రేమకథేంటి? ఎలా ఉంటుంది?
స) అన్ని కమర్షియల్ అంశాలు కలగలిపిన ప్రేమకథే ఈ ‘కృష్ణ గాడి వీర ప్రేమగాథ’. భయస్థుడైన యువకుడు నాని.. అలాంటి వాడు తన ప్రేమ కోసం ఎంత దూరం వెళ్ళాడు, ఏమేం చేసాడు అన్నదే అసలు కథ.

ప్రశ్న) మొదటి సినిమాలో హోమ్లీ లుక్ లో కనిపించారు. మరి గ్లామరస్ రోల్స్ చేయడానికి మీరు సిద్దమేనా?
స) ఎందుకు చెయ్యను, నేను గ్లామర్ రోల్స్ చేయడానికి సిద్దమే.. నాకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. అలాగే ప్రతి సినిమాలోనూ నాలోని టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని ఉంది.

ప్రశ్న) ఈ సినిమా తరవా కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా?
స) ప్రస్తుతానికి కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి, అవి అన్నీ డిష్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. ఇంకా దేనికీ సైన్ చేయలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు