ఇంటర్వ్యూ : నాగార్జున – ఇంతకు ముందు సినిమాల్లో కన్నా చైతన్య ఈ సినిమాలో బాగా చేశాడు !

ఇంటర్వ్యూ : నాగార్జున – ఇంతకు ముందు సినిమాల్లో కన్నా చైతన్య ఈ సినిమాలో బాగా చేశాడు !

Published on May 23, 2017 2:52 PM IST


నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ‘రరాండోయ్ వేడుక చూద్దాం’ చిత్రం ఈ 26నెల న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా నిర్మాత అక్కినేని నాగార్జున మీడియాతో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఆ విషయాలు మీకోసం…

ప్ర) సినిమా ఎలా వచ్చింది ?
జ) సినిమా చాలా బాగా వచ్చింది. ఎడిటింగ్ సమయంలో ఇప్పటికి 100 సార్లు చూసుంటాను. సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్సుకి మంచి ట్రీట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేశారు. విడుదలైన ప్రతిచోటా చిత్రం మంచి విజయం అందుకుంటుందని చాలా నమ్మకంగా ఉన్నాను.

ప్ర) ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణనే ఎందుకు ఎంచుకున్నారు ?
జ) కళ్యాణ్ కృష్ణ మంచి టెక్నీషియన్. ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన వ్యక్తి. ‘సోగ్గాడే చిన్ని నాయన’ తర్వాత ఈ కథకు అతనైతేనే బాగుంటుందని అనుకున్నాను. అలాగే అతనితో మూడు సినిమాల కాంట్రాక్ట్ కూడా ఉంది. కాబట్టి అతనే నా చాయిస్ అయ్యాడు.

ప్ర) రారండోయ్ లాంటి కుటుంబ కథా చిత్రాన్ని చైతన్య ముందుకు తీసుకెళ్లగలడా ?
జ) చైతన్యకు తన సినిమాల పట్ల ఒక భిన్నమైన అప్రోచ్ ఉంది. అందుకేఅతన్ని కూర్చోబెట్టి ఇలాంటి సినిమా చేస్తేనే అందరూ ఇష్టపడతారని చెప్పాను. అతను కూడా నన్ను నమ్మి చాలా బాగా చేశాడు. కెమెరా ముందు బాగా నటించాడు. రిలీజ్ తర్వాత అతనో పెద్ద స్టార్ అవ్వడం ఖాయం.

ప్ర) దేవి సంగీతం గురించి చెప్పండి ?
జ) దేవి నాకు చాలా కాలంగా తెలుసు. నా సినిమాలకు కూడా మంచి సంగీతం ఇచ్చాడు. ఇప్పుడు రారండోయ్ చిత్రానికి కూడా అలాగే చేశాడు. అతనికి మంచి అనుభవం ఉంది. అందుకే ఎడిటింగ్ టేబుల్ వద్ద కూర్చోబెట్టి సన్నివేశాల్లో, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో చేంజెస్ ఏమైనా చేయాలా అని అడిగాను. అతను కష్టపడి పనిచేసే వ్యక్తి. అందుకే తన కొన్నేళ్లుగా పొజిషన్లో ఉన్నాడు.

ప్ర) చలపతిరావ్ కామెంట్స్ పై మీ అభిప్రాయం ?
జ) వాటిని పూర్తిగా ఖండిస్తున్నాను. ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేసినా ఇలానే అంటాను. వినడానికి అసభ్యంగా ఉండే ఆ ప్రోత్సహించకూడదు.

ప్ర) రకుల్ ప్రీత్ సింగ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ?
జ) ఇందులో కొత్త రకుల్ ని చూస్తారు. సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ అందరినీ మెప్పిస్తుంది.

ప్ర) సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టున్నారు ?
జ) సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాను. అందుకే నైజాం, వైజాగ్, కృష్ణ ఏరియాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఒకసారి సినిమా బాగా వచ్చిందని తెలిస్తే డిస్ట్రిబ్యూట్ చేసే ఛాన్స్ ఎందుకు వదులుకుంటాను.

ప్ర) మలయాళ మహాభారతం చేయబోతున్నారని విన్నాం ?
జ) నిర్మాతలు కర్ణుడి పాత్రని చేయమని అడిగారు. దీని గురించి ఇప్పుడు మాట్లాడటం కన్నా ఒకసారి సినిమా అంతా మెటీరియలైజ్ అయ్యాక మాట్లాడటం మంచిది.

ప్ర) మీ ఇద్దరి అబ్బాయిల్లో నిర్మాత అవ్వాలనే ఉద్దేశ్యం ఎవరిలో బలంగా ఉంది ?
జ) ప్రస్తుతానికైతే ఇద్దరినీ తన కెరియర్లపై దృష్టిలో పెట్టమని అలాగే వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కూడా గమనిస్తుండమని చెప్పాను.

ప్ర) మీ తర్వాతి సినిమాల గురించి చెప్పండి ?
జ) రాజుగారి గది – 2 అవుట్ ఫుట్ చూసి మళ్ళీ 10 రోజుల రీ షూట్ చేయమని చెప్పాను. ఇంకా కొన్ని స్క్రిప్ట్స్ వింటున్నాను. కొన్ని సైన్ చేసే ఉద్దేశ్యంలో ఉన్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు