ఇంటర్వ్యూ : నాగార్జున – భవిష్యత్ లో పూజ హెడ్గే టాప్ హీరోయిన్ అవుతుంది.

ఇంటర్వ్యూ : నాగార్జున – భవిష్యత్ లో పూజ హెడ్గే టాప్ హీరోయిన్ అవుతుంది.

Published on Oct 16, 2014 3:39 PM IST

Nagarjuna
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఎన్నో అద్బుత సినిమాలను నిర్మించారు అక్కినేని కుటుంబ సభ్యులు. నాగ చైతన్య, పూజ హెడ్గే జంటగా నటించిన ‘ఒక లైలా కోసం’ ఈ బ్యానర్ లో రూపొందిన 25వ సినిమా. రేపు, అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున సినిమా విశేషాలను మీడియాకు తెలియజేశారు. ఆ విశేషాలు మీకోసం…

ప్రశ్న) మీరు సినిమా చూశారా..? మీ స్పందన ఏమిటి..?

స) నేను సినిమా చూసిన తర్వాత కొన్ని మార్పులు చేయమని సూచించాను. చిన్న చిన్న మార్పులు చేసిన తర్వాత సినిమా బాగుంది. ‘ఒక లైలా కోసం’ ఘనవిజయం సాదిస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను.

ప్రశ్న) దర్శకుడు విజయ్ కుమార్ కొండ ‘ఒక లైలా కోసం’ టైటిల్ చెప్పగానే మీ రియాక్షన్ ఏంటి..?

స) నాన్నగారు నటించిన ‘రాముడు కాదు భీముడు’ సినిమా పెద్ద విజయం సాధించలేదు. అందులో పాట పల్లవిని ‘ఒక లైలా కోసం’ టైటిల్ గా తీసుకోవడం ఎందుకు..? అని అనిపించింది. కాని, విజయ్ కుమార్ కొండా ఈ సినిమా కథ, ‘ఒక లైలా కోసం’ టైటిల్ పెట్టడం వెనుక కారణం చెప్పిన తర్వాత నేను కన్వీన్స్ అయ్యాను.

ప్రశ్న) సినిమాలో మేజర్ హైలైట్స్ ఏంటి..?

స) సినిమాలో వినోదానికి ఏమాత్రం లోటు ఉండదు, అదే సమయంలో చక్కటి ఎమోషన్, సెంటిమెంట్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. క్లైమాక్స్ సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే అలీ క్యారెక్టర్ ప్రతి ఒక్కరిని నవ్విస్తుంది.

ప్రశ్న) నాగ చైతన్య పెర్ఫార్మన్స్ గురించి చెప్పండి..?

స) ఒక నటుడిగా చైతన్య ప్రతి సినిమాకి పరిణితి చూపుతున్నాడు. ఈ సినిమాలో అతని నటన మెరుగయ్యింది. దర్శకులు చైతు స్టైల్ ఏంటి..? అనే విషయం గమనించాలి. చైతన్య నుండి అత్యుత్తమ ప్రతిభ రాబట్టుకోవడం అనేది వారి చేతిలో ఉంటుందని నేను భావిస్తున్నాను.

ప్రశ్న) మీ నాన్నగారి హిట్ సాంగ్ ‘ఒక లైలా కోసం’ను రీమిక్స్ చేయాలనే ఆలోచన ఎవరిదీ..?

స) దర్శకుడు విజయ్ కుమార్ కొండా ఐడియా అది. ఒక సూపర్ హిట్ క్లాసిక్ సాంగ్ ను రీమిక్స్ చేయడానికి మొదట అనూప్ రూబెన్స్ ఒప్పుకోలేదు. కథ ప్రకారం సినిమాలో అటువంటి పాటకు మంచి సందర్భం కుదిరింది. స్క్రిప్ట్ డిమాండ్ చేయడంతో రీమిక్స్ చేయడానికి అంగీకరించాడు.

ప్రశ్న) హీరోయిన్ పూజ హెడ్గే నటన మీకు నచ్చిందా..?

స) సినిమా షూటింగ్ జరిగే సమయంలో పూజ హెడ్గే నటన గురించి చాలా విషయాలు విన్నాను. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఆమె నటన నాకు బాగా నచ్చింది. భవిష్యత్ లో ఆ అమ్మాయి టాప్ హీరోయిన్ అవుతుందనే కాన్ఫిడెన్స్ నాలో ఉంది.

ప్రశ్న) మీ ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా నెమ్మదిగా చైతన్య వైపు షిఫ్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మీరేమంటారు..?

స) గట్టిగా నవ్వుతూ.. నన్ను అమితంగా అభిమానించే ఫిమేల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పటికీ ఆ ఫాన్స్ ఫాలోయింగ్ చెక్కు చెదరదు. కాసేపు జోక్స్ పక్కనుంచితే… చైతును అమాయిలు అభిమానించడం, ఆదరాభిమానాలు చూపడం చాలా సంతోషంగా ఉంది.

ప్రశ్న) లవర్ బాయ్ గా సక్సెస్ అయిన చైతన్య యాక్షన్ హీరోగా ఎందుకు సక్సెస్ కాలేకపోయాడు..?

స) ‘శివ’ సినిమా విడుదలయ్యే వరకు నేను కూడా అటువంటి సమస్యను ఎదుర్కొన్నాను. నాగ చైతన్యకు కూడా అలాంటి సినిమా ఒకటి వస్తుందని ఆశిస్తున్నాను. ఆ తర్వాత యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంటాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు