ఇంటర్వ్యూ : నాని – బాలయ్యతో అతిధి పాత్ర అనుకొని, మళ్ళీ వెనక్కి వెళ్లాం.

ఇంటర్వ్యూ : నాని – బాలయ్యతో అతిధి పాత్ర అనుకొని, మళ్ళీ వెనక్కి వెళ్లాం.

Published on Feb 9, 2016 5:25 PM IST

nani
‘భలే భలే మగాడివోయ్’ తో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న యంగ్ హీరో అలియాస్ నాచురల్ స్టార్ నాని. ఓ బ్లాక్ బస్టర్ తర్వాత నాని నుంచి వస్తున్న మరో రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘కృష్ణ గాడి వీర ప్రేమగాథ’. ఫిబ్రవరి 12న వరల్డ్ వైడ్ ఈ సినిమా రిలీజ్ కానుంది. విడుదలను పురష్కరించుకొని నానితో కాసేపు పిచ్చాపాటి చేసి ఈ ప్రేమగాథ విశేషాలను తెలుసుకున్నాం. ఆ విశేషాలు మీకోసం..

ప్రశ్న) ‘భలే భలే మగాడివోయ్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ ప్రేమగాథ విషయంలో బాగా ప్రెజర్ ఫీలవుతున్నారు?
స) అస్సలు టెన్షన్, ప్రెజర్ లేదండి.. ఎప్పుడైతే నా గత సినిమాలు ఆడక ఫ్లాప్ అవుతాయో అప్పుడు సినిమా సక్సెస్ అవ్వాలని చాలా ప్రెజర్ తీసుకుంటాను. కానీ ఇక్కడ లక్కీగా నా గత రెండు సినిమాలు బాగా ఆడాయి. అందుకే టెన్షన్ లేదు, ఈ సినిమా కూడా వాటిలానే హిట్ అవుతుందని నమ్ముతున్నాను.

ప్రశ్న) ఈ కృష్ణగాడి వీర ప్రేమగాథ ఎలా మొదలైంది?
స) హను నాకు చాలా కథలు చెబుతూ నా వెనుక తిరుగుతూనే ఉన్నాడు. తను చెప్పిన చాలా కథలకి నేను నో చెబుతూ వచ్చాను. ఫైనల్ గా ఈ స్క్రిప్ట్ ని ఓకే చేసాను. ఈ సినిమా కథ అనుకున్నప్పటి నుంచీ నేను ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యాను. నా సైడ్ నుంచి చిన్న చిన్న సలహాలు కూడా ఇచ్చాను.

ప్రశ్న) మొత్తంగా క్రిష్ణగాడి ప్రేమగాథ ఎలా ఉండబోతోంది?
స) నేను ఈ సినిమాలో కృష్ణ అనే ఓ పిరికి కుర్రాడి పాత్ర చేసాను. ఓ పిరికి వాడు తన 15 ఏళ్ళ ప్రేమ కోసం ఎలాంటి అసాధారణ సంఘటనలను ఎదుర్కున్నాడు అనేదే కథ. సినిమా రాయసీమ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. సీమలోని పరిస్థితులకు ఎలా ఎదురెళ్ళి నా ప్రేమను గెలిపించుకున్నాను అన్నదే కృష్ణగాడి వీర ప్రేమగాథ.

ప్రశ్న) కాస్త పాత బడిపోయిన ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి?
స) ఫ్యాక్షనిజంని ఇప్పటి దాకా ఒక యాంగిల్ లో చూసారు.. కానీ ఈ సినిమాలో కంప్లీట్ డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. ఇందులో ఎక్కడా రెగ్యులర్ టిపికల్ ఫ్యాక్షన్ స్టైల్ లో ఒక్క సీన్ కూడా ఉండదు. ప్రతిది చాలా స్మూత్ గా ఉండేలా డీల్ చేసాం.

ప్రశ్న) మీరు ఇందులో బాలకృష్ణ అభిమానిలా కనిపిస్తారు. ఆ పాత్రని ఎలా మేనేజ్ చేసారు?
స) ఈ సినిమా మొత్తాన్ని హిందూపూర్ లో షూట్ చేసాము. హిందూపూర్ చుట్టు ప్రక్కల ప్రాంతాలన్నీ బాలయ్య గారి నియోజకవర్గంలోకే వస్తాయి. అక్కడ అందరూ ఆయన అభిమానులే ఉంటారు, నిజానికి ఆ అభిమానుల్లో నేను ఓ బాలయ్య అభిమానిని. అలాగే సినిమాలో బాలయ్య అభిమానిని మరియు సీన్స్ అన్నిటినీ ఒరిజినల్ బాలయ్య బాబు అభిమానిలానే చేసాను.

ప్రశ్న) బాలయ్య అభిమానిలా మీరు ఈ సినిమాలో ఆయన్ని అతిధి పాత్రలో అన్నా తీసుకోవాలని అనుకోలేదా?
స) సినిమా మొదట్లో మేము ఆయనతో ఇందులో అతిధి పాత్ర చేయించాలని అనుకున్నాం. కానీ ఆయన అతిధి పాత్ర సినిమాలోని మెయిన్ పాయింట్ ని పక్కకి తీసుకెల్తుందేమో అని మళ్ళీ వద్దనుకొని వెనక్కి తగ్గాము.

ప్రశ్న) ప్రొడక్షన్ పరంగా సినిమా ఎలా వచ్చింది?
స) సినిమా మాత్రం చాలా బాగా వచ్చింది. చెప్పాలంటే సినిమాలోని కొన్ని ఫైనల్ రషెస్ చూసిన తర్వాత నిర్మాత గోపి ఆచంట ఓ పెద్ద హగ్ ఇచ్చారు. చెప్పాలంటే ఆయన చాలా సైలెంట్ పర్సన్ అన్ని వింటుంటారు అంతే.. కానీ ఆయన అంత పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడంతో సినిమా మీద ఇంకా పాజిటివ్ ఇంపాక్ట్ కలిగింది.

ప్రశ్న) హను రాఘవపూడికి ఇది రెండవ సినిమా. అతనితో వర్కింగ్ ఎలా ఉంది?
స) హను సింప్లీ సూపర్బ్ అండి.. ఈ సినిమా స్టొరీ లైన్ ఆలోచన నుంచి, సినిమాలో ఫస్ట్ ఫ్రేం నుంచి చివరి ఫ్రేం దాకా అతని క్రియేటివిటీనే అని చెప్పాలి. స్క్రిప్ట్ దశలో ఉండగా చాలా విషయాలు ఎలా చేస్తే బాగుండు అనేదాని మీద చర్చించుకున్నాం. కానీ ఒక్కసారి సెట్స్ మీదకి వెళ్ళాక ఇక అంతా అతని వన్ మాన్ షోనే..

ప్రశ్న) భలే భలే మగాడివోయ్ ప్రాఫిట్స్ చూసి మీరు సర్ప్రైజ్ అయ్యారా?
స) అయ్యయో అదేం అడుగుతారులెండి.. ఆ సినిమా కలెక్షన్స్, హిట్ రేంజ్ చూసి నేను ఈ రోజుటికీ షాక్ లో ఉన్నాను. నేను ఓ మంచి హిట్ ఫిల్మ్ అవుతుందని అనుకున్నా కానీ ఇంత పెద్ద హిట్ అని ఊహించనే లేదు.

ప్రశ్న) దీన్ని బట్టి ఇప్పుడు మీరు సినిమాలు ఇంకాస్త జాగ్రత్తగా సెలక్ట్ చేసుకుంటున్నారనమాట?
స) అవునండి.. ఒకటి అయితే అర్థం చేసుకున్నాను, అదేమిటంటే ప్రేక్షకులు నా దగ్గర నుంచి కొంత ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. అందుకే ఒకటి ఫిక్స్ అయ్యా, ఇక నుంచి నేను చేసే సినిమాలన్నీ డిఫరెంట్ గా ఉండేలానే ఎంచుకుంటాను, అలాగే సినిమాలో ఎంటర్టైన్మెంట్ పాళ్ళు కూడా సమంగా ఉండేలా చూసుకుంటాను.

ప్రశ్న) మీరు తదుపరిగా చేస్తున్న సినిమా, కమిట్ అయిన సినిమాల గురించి చెప్పండి?
స) నాకు ఫిస్ట్ బ్రేక్ ఇచ్చిన మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా షూటింగ్ మొదలు పెట్టాను. ఆ తర్వాత ఉయ్యాలా జంపాలా డైరెక్టర్ తో ఓ సినిమా ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు