ఇంటర్వ్యూ : నిఖిల్ – ఆ విషయంలో మాత్రం అస్సలు జోక్యం చేసుకోను!

ఇంటర్వ్యూ : నిఖిల్ – ఆ విషయంలో మాత్రం అస్సలు జోక్యం చేసుకోను!

Published on Nov 16, 2016 2:09 PM IST

nikhil-i
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎంతమంది యువహీరోలు ఉన్నారో చెప్పక్కర్లేదు. వీరంతా ఎవరికి వారే తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటే తప్ప నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లోనే ‘స్వామిరారా’ సినిమా నుంచి తన ప్రతి సినిమాకూ ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటూ వస్తోన్న యువహీరో నిఖిల్, తాజాగా తన కొత్త సినిమా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ను విడుదలకు సిద్ధం చేశారు. ఈ శుక్రవారమే విడుదల కానున్న ఈ సినిమా గురించి నిఖిల్ చెప్పిన విశేషాలు..

ప్రశ్న) మరో రెండు రోజుల్లో సినిమా విడుదలంటే ఎలా ఉంది?

స) నా ప్రతి సినిమా విడుదలప్పుడూ నేను బాగా టెన్షన్ పడుతూంటా. ఈసారి కరన్సీ బ్యాన్ వల్ల సినిమాల కలెక్షన్స్ తగ్గడం ఇంకొంచెం భయపెడుతోంది. అయితే ప్రేక్షకులు ఎంటర్‌టైన్‍మెంట్‌ను ఎలాంటి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టరన్న నమ్మకంతో విడుదల చేస్తున్నాం.

ప్రశ్న) సినిమా గురించి చెప్పండి?

స) వీఐ ఆనంద్ నాకు ఈ కథ చెప్పగానే బాగా ఎగ్జైట్ అయ్యా. మంచి లవ్‌స్టోరీతో పాటు సినిమా మొత్తం కొత్తగా అలరించే ఫాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయి.

ప్రశ్న) సినిమాలో చాలామంది హీరోయిన్లు ఉన్నట్టున్నారు?

స) యస్. సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఉంటారు. ఇంకా అందరి పేర్లూ రివీల్ చేయలేదు. కథ ప్రకారంగా ఆ పాత్రలన్నీ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్సే!

ప్రశ్న) మీ రోల్ ఏంటి?

స) బాహుబలి సినిమాకు పనిచేసే ఓ గ్రాఫిక్ డిజైనర్‌గా ఈ సినిమాలో కనిపిస్తా. నా రోల్‌లో చాలా సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి.

ప్రశ్న) సినిమా ఎందుకు ఆలస్యమవుతూ వస్తోంది?

స) ఒకసారి సినిమాటోగ్రాఫర్ అందుబాటులో లేకపోవడం, ఒకసారి హీరోయిన్ కోసం ఎదురుచూడడం ఇలా అనుకోని కారణాలు కూడా కలిసి మా సినిమా కొంత ఆలస్యమైంది.

ప్రశ్న) సినిమా ప్రమోషన్స్ విషయంలో మీ ఇన్‌వాల్వ్‌మెంట్ బాగా ఉంటుంది. ఎందుకని?

స) ఒక్కసారి స్క్రిప్ట్ ఫైనలైజ్ చేశాక ఇంక క్రియేటివ్ సైడ్ నేనస్సలు జోక్యం చేసుకోను. అదంతా దర్శకుడికే వదిలేస్తా. సినిమా ప్రమోషన్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం నాదైన ప్లాన్ ఒకటి తీసి, అన్నివిధాలా సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్ళాలని అనుకుంటూంటా. ఈ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గను.

ప్రశ్న) ఎప్పటికప్పుడు కొత్తదనమున్న సినిమాలను ఎలా ఎంచుకుంటున్నారు?

స) నా అదృష్టం కొద్దీ గత కొన్ని సంవత్సరాలుగా నా సినిమాలంటే కొత్తగా ఉంటాయన్న మార్క్ వచ్చేసింది. దాన్ని నిలబెట్టుకునే దిశగానే స్క్రిప్ట్స్ కోసం చూస్తూంటా. ఇందుకోసమే కాస్త ఆలస్యమైనా మంచి సినిమాలే తీయాలని నిర్ణయించుకున్నా.

ప్రశ్న) ప్రస్తుతం ఏయే సినిమాలు చేస్తున్నారు?

స) ప్రస్తుతానికి సుధీర్ వర్మతో చేస్తోన్న సినిమా సెట్స్‌పై ఉంది. అది పూర్తవ్వగానే చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చే ఏడాది ఒక సినిమా ప్లాన్ చేస్తున్నా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు