ఇంటర్వ్యూ : పూరి జగన్నాధ్ – వరుణ్ తేజ్, నాగబాబుని గర్వంగా ఫీలయ్యేలా చేస్తాడు.

ఇంటర్వ్యూ : పూరి జగన్నాధ్ – వరుణ్ తేజ్, నాగబాబుని గర్వంగా ఫీలయ్యేలా చేస్తాడు.

Published on Sep 27, 2015 7:55 PM IST

puri-jaganadh
టాలీవుడ్ మోస్ట్ కమర్షియల్ అండ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్. ఎలాంటి హీరోనైనా పర్ఫెక్ట్ మాస్ పాత్రలో చూపి సూపర్ మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టగల డాషింగ్ డైరెక్టర్ యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి చేసిన సినిమా ‘లోఫర్’. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడం అలాగే రేపు పూరి పుట్టిన రోజు సందర్భంగా పూరి జగన్నాధ్ మీడియా మిత్రులతో కాసేపు ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం..

ప్రశ్న) మొదటగా ‘లోఫర్’ సినిమా అనేది ఎలా మొదలైంది.?

స) అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమా తర్వాత మదర్ సెంటిమెంట్ ఉన్న సినిమా చెయ్యలేదు. చాలా మంది అడిగారు. అక్కడి నుంచి పుట్టిందే ఈ కథ. చాలా రోజుల తర్వాత మళ్ళీ సెంటిమెంట్ ఉన్న సినిమా సినిమా చేయడం నాకే కొత్తగా ఉంది. అలా అని ఆ కథకి ఈ కథకి ఎలాంటి సంబంధం ఉండదు. మదర్ సెంటిమెంట్ ఒక్కటే కామన్ పాయింట్.

ప్రశ్న) ‘లోఫర్’ సినిమా షూటింగ్ అప్డేట్ చెప్పండి.?

స) ఇటీవలే ఫినిష్ అయిన గోవా షెడ్యూల్ తో మేజర్ పార్ట్ షూటింగ్ అయిపొయింది. ఇంకో 3-5 రోజుల షూటింగ్ బాలన్స్ ఉంటుంది. అది అయిపోగానే నిర్మాత సి. కళ్యాణ్ గారు రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తారు.

ప్రశ్న) రెండు సినిమాల అనుభవం ఉన్న వరుణ్ తేజ్ మరియు న్యూ హీరోయిన్ దిశా పాట్ని గురించి చెప్పండి.?

స) వరుణ్ అండ్ నా కాంబినేషన్ లో మొదటి సినిమా. వరుణ్ చాలా బాగా చేసాడు, సినిమాలో తన పెర్ఫార్మన్స్ జెన్యూన్ గా ఉంటుంది. అంట పొడగున్నా ఫేస్ లో ఒక ఇన్నొసెన్స్ ఉంటుంది. అది అందరికీ బాగా నచ్చుతుంది. నాకు తెలిసి వరుణ్ తేజ్ చాలా పెద్ద స్టార్ హీరో అవుతాడు. నాగబాబు గర్వంగా ఫీలయ్యేలా చేస్తాడు. ఇక హీరోయిన్ దిశా పాట్ని చూడగానే అందరికీ నచ్చేస్తుంది. తను కూడా ఇక్కడ పెద్ద స్టార్ అవుతుంది.

ప్రశ్న) మదర్ సెంటిమెంట్ అంటున్నారు.. మరి లోఫర్ అనే టైటిల్ పెట్టారు.. ఎవరూ ఈ టైటిల్ వద్దు మారుద్దాం అని అబ్జెక్ట్ చెయ్యలేదా.?

స) సినిమా కథ అందరికీ చెప్పి అందరూ ఓకే అనుకున్న తర్వాతే ఈ కథకి లోఫర్ అనే టైటిల్ పెట్టాం. మా కథ చూసాకే మీరే అంటారు ఇది పర్ఫెక్ట్ టైటిల్ అని. కానీ సినిమా అవుట్ పుట్ వచ్చాక కొన్ని సీన్స్ చూసిన తర్వాత సి కళ్యాణ్ గారు, రామ్ గోపాల్ వర్మ గారు ఈ టైటిల్ మారుద్దాం అని అడుగుతున్నారు. అందుకే టైటిల్ ని మార్చాలనుకుంటున్నాం. టైటిల్ లో లోఫర్ అనే ఫీలింగ్ ని కలిగిస్తా కానీ ఆ పదంతో టైటిల్ ఉండకపోవచ్చు. త్వరలోనే టైటిల్ ని ఫైనల్ టైటిల్ ని అనౌన్స్ చేస్తాం.

ప్రశ్న) వర్మ గారికి సెంటిమెంట్స్ అంటే పెద్దగా ఎక్కవు కదా.. మరి ఆయన మదర్ సెంటిమెంట్ చూసి టైటిల్ చేంజ్ చెయ్యాలని చెప్పడం ఏంటి.?

స) అవును ఈ విషయం నాకు షాకింగే.. మీరన్నట్టు ఆయనకి అమ్మ, చెల్లి, పెదనాన్న మొదలైన సెంటిమెంట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఈ సినిమాలోని చాలా సీన్స్ చూసిన ఆయనకి మదర్ సెంటిమెంట్ సీన్స్ చాలా హార్ట్ టచింగ్ అన్నాయని అన్నారు. అంతే కాకుండా నన్ను ఎడిటింగ్ రూం నుంచి బయటకి పంపి అమ్మ మీద ఓ స్పెషల్ వీడియోని కట్ చేసి నాకు ప్రెజంట్ చేసారు. అది నాకు చాలా స్పెషల్ గా అనిపించింది.

ప్రశ్న) చిరంజీవితో చేయాలనుకున్న 150వ సినిమా ఏమైంది. దాని గురించి స్టేటస్ చెప్పండి.?

స) ఆయనతో సినిమా అనుకున్నా కానీ అది పెండింగ్ లో పడింది. ఎందుకు అంటే.. ఫస్ట్ హాఫ్ ఆయనకి బాగా నచ్చింది, సెకండాఫ్ చెప్పాక తర్వాత చెప్తా అన్నారు. కానీ ఆ తర్వాత నాకు చెప్పకుండా మీడియా ముందే పూరి కథ అనుకున్న స్థాయిలో లేదని చెప్పారు. ఆయన నాకు చెప్పి ఉంటే మార్పు చేయడానికి నేను సిద్దమే.. ఇప్పుడు పిలిచినా ఆయనతో సినిమా చేయడానికి సిద్దంగా ఉన్నాను.

ప్రశ్న) పోకిరితో టాలీవుడ్ లో 50 కోట్ల మార్క్ ని టచ్ చేసింది.. ఇప్పుడు 100 అండ్ 200 కోట్లకి మార్కెట్ పెరిగింది. దానిపై మీ కామెంట్.?

స) అది చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం..ప్రతిసారి ఇండస్ట్రీ హిట్ వచ్చినప్పుడు మార్కెట్ గ్రోత్ పెరుగుతుంది. ఇటీవలే వచ్చిన బాహుబలి మరియు శ్రీమంతుడులూ ఇండస్ట్రీ మార్కెట్ కి బలాన్ని చేకూర్చాయి. అవి బాగుండడం వల్ల మిగతా సినిమాల మార్కెట్ పెరుగుతుంది, ఇండస్ట్రీ బాగుంటుంది, రెమ్యునరేషన్ లు పెరుగుతాయి. ఇంకా చాలా లాభాలు ఉన్నాయి.

ప్రశ్న) లఘు చిత్రాలు చేసిన వారితో లో బడ్జెట్ లో సినిమాలు చేస్తా అన్నారు ఏమైంది.?

స) ప్రస్తుతం ఇండస్ట్రీలో చిన్న సినిమాల పరిస్తితి అంత బాగాలేదు. శాటిలైట్ కూడా అవ్వడంలేదు. దాంతో కొంత బ్రేక్ ఇచ్చాను. బిజినెస్ కాస్త మెరుగుపడ్డాక కచ్చితంగా చేస్తాను.

ప్రశ్న) మీ తరుపరి సినిమాతో ఓ కొత్త హీరోని లాంచ్ చేస్తున్నారని విన్నాం. దానిపై మీ కామెంట్స్.?

స) మహాత్మ సినిమాతో తెలుగుకి పరిచయం అయిన నిర్మాత సి.ఆర్ మనోహర్ వాళ్ళ అన్నగారి అబ్బాయి ఇషాంత్ ని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాను. అతను బెంగుళూరుకి చెందినావాడు. అందుకే ఒకేసారి తెలుగు అండ్ కన్నడ భాషల్లో చేస్తున్నాం. పర్ఫెక్ట్ లవ్ స్టొరీగా తెరకెక్కనున్న ఈ సినిమా నవంబర్ లో స్టార్ అవుతుంది.

ప్రశ్న) మహేష్ బాబుతో సినిమా అన్నారు, దాని అప్డేట్ ఏమిటి. అలాగే వేరే ఎవరితో అయినా ప్లాన్ చేస్తున్నారా.?

స) మహేష్ బాబు సినిమా కోసం కథ ఎప్పుడో సిద్దం చేసాను. ఆయన చెప్పడం జరిగింది. ఓకే అన్నారు, ఆయన డేట్స్ కోసం వెయిటింగ్. ఆ సినిమాలో మహేష్ బాబుని క్లాస్ అండ్ మాస్ టచ్ ఉన్న పాత్రలో చూపిస్తాను. ఇది కాకుండా అల్లు ర్జున్ కోసం కూడా ఓ కథని సిద్దం చేస్తున్నాను.

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి పూరి జగన్నాధ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాం..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు