ఇంటర్వ్యూ : రాశి ఖన్నా – సినీ ఫీల్డ్ లో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

ఇంటర్వ్యూ : రాశి ఖన్నా – సినీ ఫీల్డ్ లో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

Published on Sep 29, 2015 9:11 PM IST

Rashi-kanna
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టిన బ్యూటీ రాశి ఖన్నా. ఈ ఏడాది జిల్ సినిమాలో క్యూట్ క్యూట్ గా కనిపించిన రాశి ఖన్నా మరో సారి తన అందచందాలతో ఆకట్టుకోవడానికి సిద్దమైంది. రామ్ సరసన హీరోయిన్ గా నటించిన ‘శివమ్’ సినిమా అక్టోబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేము కాసేపు రాశి ఖన్నాతో ప్రత్యేకంగా ముచ్చటించాం. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న)’శివమ్’లో మీ పాత్ర గురించి చెప్పండి.?

స) శివమ్ సినిమాలో నేను తను అనే పాత్రలో కనిపిస్తాను. బాగా ఈగో ఉన్న ఓ అమ్మాయి.. ఈగో ఎంత ఉంటుందో అంతే ఎమోషనల్ కూడాను. ఇలా రెండు విభిన్న కోణాలు ఉన్న పాత్రే తను. స్వతహాగా నేను ఈగో ఉన్న పర్సన్ ని కాదు. అందుకే నాకు ఆ పాత్ర చాలెంజింగ్ గా అనిపించి చేసాను. నా ఈగో వల్ల సినిమా మొత్తం నేను రామ్ కొట్టుకుంటూనే ఉంటాం. చెప్పాలంటే టామ్ అండ్ జెర్రీ ఫీల్ వస్తుంది.

ప్రశ్న) రామ్ అంటే డాన్సులు బాగా చేస్తాడు. మరి అతనితో డాన్సులు చేయడం ఎలా మేనేజ్ చేసారు.?

స) మీరన్నట్టు రామ్ డాన్స్ బాగా చేస్తాడు. అతనితో ఈక్వల్ గా చెయ్యడం కష్టమే కానీ ఈ సినిమా కోసం బాగా ట్రైనింగ్ తీసుకొని చేసాను. డాన్సుల్లో బెటర్ మెంట్ కనిపిస్తుంది.

ప్రశ్న) శివమ్ లో ఆడియన్స్ కి నచ్చే పాయింట్ ఏమిటి.?

స) శివమ్ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. థియేటర్స్ లో అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. అలాగే సినిమా విజువల్స్ పరంగా ఒక పెద్ద ట్రీట్ అని చెప్పాలి. యూరప్ లో షూట్ చేసిన లొకేషన్స్ సూపర్బ్ గా ఉంటాయి.

ప్రశ్న) దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి చెప్పండి.?

స) దేవీశ్రీ ప్రసాద్ వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. మొత్తం ఆల్బమ్ సూపర్బ్ గా వచ్చింది. అందరూ బాగుందని కితాబులు ఇస్తున్నారు.

ప్రశ్న) మీరు కూడా మంచి సింగర్. మరి ఈ సినిమాలో ఎందుకు పాడలేదు.?

స) సినిమా అనుకున్నప్పటి నుంచి ఈ సినిమాలో పాడాలని నేను అనుకున్నాను. కానీ ఎప్పుడైతే రికార్డింగ్ టైం వచ్చిందో ఆ టైంకి నేను షూటింగ్ లో భాగంగా నార్వేలో ఉన్నా.. అలా ఇందులో పాట పాడే చాన్స్ మిస్ అయ్యాను.

ప్రశ్న) సీనియర్ ప్రొడక్షన్ హౌస్ అయిన స్రవంతి మూవీస్ తో మీ అనుబంధం గురించి చెప్పండి.?

స) స్రవంతి మూవీస్ బ్యానర్ తో పనిచేయడం చాలా వండర్ఫుల్ ఫీలింగ్. సినిమా మొత్తం నా విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. రవికిషోర్ సార్ అయితే సినిమా మొత్తం నా వర్క్ ని మెచ్చుకుంటూనే ఉండేవారు.

ప్రశ్న) తెలుగు బాగా మాట్లాడుతున్నారు. ఎక్కడన్నా బాగా ట్రైనింగ్ తీసుకున్నారా.?

స) నా మొదటి సినిమా ఊహలు గుసగుసలాడేలో నాకు చాలా ఎక్కువ డైలాగ్స్ చెప్పారు. దాంతో చాలా వరకూ తెలుగు నేర్చుకున్నాను. ఇప్పుడు ఇంకా బెటర్ అయ్యాను. ఫ్యూచర్ లో నా సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం రైట్ టైం, రైట్ క్యారెక్టర్ కోసం ఎదురు చూస్తున్నాను.

ప్రశ్న) శివమ్ సినిమాలో బాగా గ్లామరస్ గా కనిపిస్తున్నారు. ఈ విషయంలో ఏమన్నా స్పెషల్ కేర్ తీసుకున్నారా.?

స) ఆ విషయంలో క్రెడిట్ మొత్తం నా క్రియేటివ్ టీం మరియు నా కెమెరామెన్ రసూల్ ఎల్లోర్ కే చెందుతుంది. వాళ్ళే నన్ను అంతబాగా చూపించారు.

ప్రశ్న) స్వతహాగా మీరు రియల్ లైఫ్ లో ఎలాంటి వ్యక్తి.?

స) స్వతహాగా నేను చాలా సింపుల్, మరియు అందరితో కలిసిపోయే వ్యక్తిని. లైఫ్ భారీ భారీ లక్ష్యాలు ఏమీ లేవు. దేవుడు నేను కోరుకున్నదానికంటే ఎక్కువే ఇచ్చాడు. అలాగే ఈ ఫీల్డ్ లో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడే ఇంకా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాను.

ప్రశ్న) మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి.?

స) రవితేజ బెంగాల్ టైగర్ లో నటించాను, అలాగే సాయి ధరమ్ తేజ్ సరసన సుప్రీమ్ లో నటించనున్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు