చిట్ చాట్ : నాకు అన్ని రకాల చిత్రాలను తెరకెక్కించాలని వుంది – రాఘవ లారెన్స్

చిట్ చాట్ : నాకు అన్ని రకాల చిత్రాలను తెరకెక్కించాలని వుంది – రాఘవ లారెన్స్

Published on May 8, 2015 8:22 PM IST

Lawrernce
తాను విడుదల చేసిన రెండు భాషలలోనూ ‘గంగ’ సినిమా మంచి విజయం సాధించడంతో మంచి ఆనందంలో రాఘవ లారెన్స్ వున్నాడు. ఈ సందర్భంగా లారెన్స్ ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం..

ప్ర) హర్రర్ సినిమాలలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంటున్నారు. దీనిపై మీ స్పందన?
జ) నేను నా ప్రతీ సినిమాలో ఎదో ఒక కొత్తదనాన్ని చూపించడానికి ప్రయత్నిస్తూవున్నాను. నిజానికి నేను వరుసపెట్టి హర్రర్ చిత్రాలు చెయ్యలేదు. నాకు కొత్త జోనర్ లో సినిమాలు చెయ్యాలని వుంది.

ప్ర) గంగ సినిమాలో ఏ పాత్రకైనా ఎవరినైనా స్పూర్తి పొందారా?

జ) లేడు. ఈ సినిమాలో అమ్మాయి పాత్రతో సహా అందరివీ కల్పితపాత్రాలే. కానీ ఈ సినిమా ముద్ర మాత్రం చాలా మంది జీవితాలలో కనిపిస్తూ వుంటుంది. నేను ముని సినిమా మొదటి భాగం మాత్రమే స్పూర్తి పొంది రూపొందించిన చిత్రం

ప్ర) ఈ సినిమాలో ప్రధాన నాయికామణులతో ఏమన్నా విబేధాలు వచ్చాయా?
జ) లేడు. వారితో నాకు ఎటువంటి ఇబ్బందీ రాలేదు. వారు చెయ్యవలసినదానికంటే ఎక్కువే కృషిచేసారు. తెరపై వారికష్టం కంటికి ఇంపుగా కనిపించింది.

ప్ర) బాలీవుడ్ సినిమాలు తీసే ఆలోచన ఉందా?
జ) వుంది. మంచి స్క్రిప్ట్ కుదిరితే నటించడమే కాక హిందీలో సినిమాను తెరకెక్కిస్తా..

ప్ర) ప్రస్తుతం మీ తదుపరి చిత్రాల విశేషాలు చెప్తారా?
జ) ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో స్క్రిప్ట్ టాక్ లో వున్నాను. ఒకసారి అన్నీ కుదిరాక మరిన్ని వివరాలు వెల్లడిస్తాను.

ప్ర) గంగ సినిమాకి మీకు దక్కిన మంచి ప్రశంస ఏమిటి?
జ) ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ రజినీకాంత్ చూసి చాలా మెచ్చుకున్నారు. త్వరలో మనం ఒక సినిమా చేద్దాం అని కూడా తెలిపారు

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు