ఇంటర్వ్యూ : రకుల్ ప్రీత్ సింగ్ – డే అండ్ నైట్ షూటింగ్ ఎంజాయ్ చేస్తున్నాను.

ఇంటర్వ్యూ : రకుల్ ప్రీత్ సింగ్ – డే అండ్ నైట్ షూటింగ్ ఎంజాయ్ చేస్తున్నాను.

Published on Sep 20, 2014 10:10 AM IST

Rakul-Preet-Singh
‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో తెలుగు తెరపై తారాజువ్వలా దూసుకొచ్చిన తార రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమా విజయంతో ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది రకుల్ ప్రీత్. తన అందం, అభినయంతో అటు ప్రేక్షకులను, చిత్ర పరిశ్రమ ప్రముఖులను ఆకర్షించిన ఈ ఢిల్లీ బొమ్మకు వరుసగా అగ్ర హీరోల సరసన అవకాశాలు వస్తున్నాయి. తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ నటించిన తాజా సినిమా ‘లౌక్యం’. గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 26వ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను తెలియజేయడానికి మీడియాతో సమావేశం అయ్యారు రకుల్ ప్రీత్ సింగ్. ఆమె చెప్పిన విశేషాలు మీకోసం…

ప్రశ్న) ‘లౌక్యం’ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది..?

స) ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ విజయం తర్వాత కొన్ని నెలలు ఖాళీగా ఉన్నాను. మంచి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో దర్శకుడు శ్రీవాస్ గారి నుండి పిలుపు వచ్చింది. నా గత సినిమాలో పెర్ఫార్మన్స్ నచ్చడంతో ‘లౌక్యం’లో హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. ఓ మంచి పాత్ర చేసే అవకాశాన్ని నాకు కల్పించారు. ఈ సందర్భంగా నిర్మాత ఆనంద్ ప్రసాద్ గారు, శ్రీవాస్ గారికి థ్యాంక్స్.

ప్రశ్న) ‘లౌక్యం’లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?

స) ‘లౌక్యం’లో నేను డాన్ చెల్లెలి పాత్రలో కనిపిస్తాను. సినిమాలో నా పేరు చంద్రకళ. చాలా బబ్లి అండ్ ఎనర్జిటిక్ కాలేజీ గర్ల్ అనమాట. ఇతరులను ఎక్కువగా రాగింగ్ చేస్తూ ఉంటాను. సీరియస్ గా ఉంటూ నేను చేసే పనులు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాయి. ఈ సినిమాలో కామెడీ, రొమాన్స్, యాక్షన్ అన్నీ ఉన్నాయి. కుటుంబం అంతా కలసి చూసే సినిమా.

ప్రశ్న) దర్శకుడు శ్రీవాస్ సినిమాను ఎలా తెరకెక్కించారు..?

స) శ్రీవాస్, చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. అతనికేం కావాలో బాగా తెలుసు. ప్రతి సన్నివేశం వివరించే చెప్పేవారు. ఆర్టిస్టుల నుండి చక్కటి నటనను రాబట్టుకున్నారు. నన్ను తెరపై చాలా అందంగా చూపించారు. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ అన్నిటిని సినిమాలో బాలన్స్ చేశారు. ఆయన దర్శకత్వం సినిమాకి మేజర్ హైలైట్ అవుతుంది.

ప్రశ్న) గోపీచంద్ తో మీ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్..? ఇతర ఆర్టిస్టుల గురించి చెప్పండి..?

స) గోపీచంద్ సరసన నటించడం చాలా హ్యాపీగా ఉంది. సెట్ లో అందరిని నవ్విస్తూ ఉంటారు. హి ఇస్ వండర్ ఫుల్ కో స్టార్. మా జంట తెరపై చూడముచ్చటగా ఉంటుంది. అలాగే ఈ సినిమాలో బ్రహ్మానందం గారు చాలా ముఖ్యమైన పాత్రలో నటించారు. మా కాంబినేషన్ లో సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. సీనియర్ నటుడితో కలసి యాక్ట్ చేయడం నా అదృష్టం.

ప్రశ్న) అనూప్ రూబెన్స్ మ్యూజిక్ గురించి చెప్పండి..?

స) సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. ఒక పాటతో మరొక పాటకు సంబంధం ఉండదు. ప్రతి పాట చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అనూప్ రూబెన్స్ అద్బుతమైన ఆడియో అందించారు. ‘సూడు సూడు…’, ‘పింక్ లిప్స్’ పాటలు నాకు బాగా నచ్చాయి. మెలోడీ, రొమాంటిక్ నెంబర్… ఇలా సినిమాలో అన్ని రకాల పాటలు ఉన్నాయి. ఐటెం సాంగ్ కూడా బాగుంటుంది.

ప్రశ్న) ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’లో మీ డాన్సింగ్ స్కిల్స్ చూపే అవకాశం లభించలేదు. ఆ లోటు ఇందులో భర్తీ చేశారా..?

స) మీరు చెప్పింది నిజమే. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’లో పెద్దగా డాన్స్ చేసే అవకాశం లభించేలేదు. ‘లౌక్యం’లో మంచి సాంగ్స్ కుదిరాయి. బాగా డాన్స్ చేశాను. ఈ సినిమా విడుదల కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ప్రేక్షకులు నా డాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని. నా తర్వాత సినిమాలు ‘కరెంటు తీగ’, ‘రఫ్’ సినిమాలలో కూడా మంచి పాటలున్నాయి. వాటిలోనూ డాన్స్ బాగా చేశాను.

ప్రశ్న) ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మీకు బ్రేక్ ఇస్తుందని ముందే ఊహించారా?

స) ప్రతి హీరోయిన్ కెరీర్ లో ఒక సినిమా టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుంది. నా కెరీర్ లో ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మెమరబుల్ సినిమాగా నిలిచింది. ఆ సినిమాలో నటిస్తున్నప్పుడు ‘ప్రార్థన’ పాత్రకు మంచి పేరు వస్తుందని ఊహించాను. మంచి కథ, తప్పకుండా విజయం సాదిస్తుంది అనుకున్నాను. నా నమ్మకం నిజం అయ్యింది. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ విజయం తర్వాత వరుసగా అవకాశాలు వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉన్నాను.

ప్రశ్న) ప్రస్తుతం మీరు చాలా బిజీ హీరోయిన్. పగలు ఒక సినిమా, రాత్రి మరొక సినిమాలో షూటింగ్ లో పాల్గొంటున్నారు. కష్టంగా అనిపించడం లేదా..?

స) గత 10 రోజుల నుంచి డే టైం ‘పండుగ చేస్కో’, నైట్ టైం ‘కరెంట్ తీగ’ సినిమాల షూటింగ్ లతో బిజీ బిజీగా ఉన్నాను. అలాగే మరో హిందీ సినిమా షూటింగ్ చేస్తున్నాను. డే అండ్ నైట్ మూడు సినిమాల కోసం వర్క్ చేస్తున్నాను. నాకు వర్క్ చేయడం అంటే చాలా ఇష్టం. కష్టంగా అనిపించడం లేదు. ఎంజాయ్ చేస్తున్నాను. ఇన్ ఫాక్ట్… ఒక్క రోజు షూటింగ్ లేకపోయినా నేను చాలా డల్ అయిపోతాను. రోజులో కేవలం మూడు, లేదా నాలుగు గంటలు మాత్రమె నిద్రపోతున్నాను. అయినా హ్యాపీ. చేతి నిండా సినిమాలు ఉన్నాయి. నేను పని రాక్షసిని.

ప్రశ్న) లెజండరీ డైరెక్టర్ రమేష్ సిప్పి సినిమాలో అవకాశం ఎలా వచ్చింది..?

స) నేను చేసిన ఎయిర్ టెల్ టీవీ కమర్షియల్ యాడ్ రమేష్ సిప్పి గారు చూశారు. అందులో నా అభినయం నచ్చడంతో ఆయన దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు. రేపటి నుండి ఈ సినిమా షూటింగ్ సిమ్లాలో ప్రారంభం అవుతుంది. ఈ సినిమాలో నేను డ్రీమ్ గర్ల్ హేమమాలిని కుమార్తెగా నటిస్తున్నాను. రాజ్ కుమార్ రావు హీరో. ఈ షూటింగ్ కోసం ఎగ్జయిటింగ్ గా ఎదురుచూస్తున్నాను. కెరీర్ ప్రారంభంలో గొప్ప వ్యక్తులతో కలసి పనిచేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టంగా బావిస్తున్నాను.

ప్రశ్న) ఒకేసారి తెలుగు, హిందీ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. మీరు ఏ భాషకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు..?

స) మీరు ఈ ప్రశ్న ఎందుకు అడిగారో అర్ధమయ్యింది. చాలా మంది హీరోయిన్లు సౌత్ లో మంచి గుర్తింపు లభించాకా హిందీ సినిమాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. నేను ఆ తరహా హీరోయిన్ ను కాదు. నటిగా మంచి సినిమాలలో నటించాలి అనేది నా ధ్యేయం. నా దృష్టిలో టాలీవుడ్, బాలీవుడ్… ఒక్కటే. ఎక్కడ సినిమా చేసినా 100% బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. తెలుగు చిత్ర పరిశ్రమ నన్ను ఆదరించి ప్రోత్సహిస్తుంది. ఇక్కడ సినిమాల పట్ల చిన్న చూపు లేదు. హిందీ నా మాతృభాష కాబట్టి అక్కడ సినిమాలు చేయాలనుకోవడంలో తప్పు లేదు కదా..

ప్రశ్న) ఇతర సినిమాల గురించి ఎక్కువ వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారట. నిజమేనా..?

స) చిత్ర పరిశ్రమలో ఒక వ్యక్తిగా ఇతర సినిమాల గురించి తెలుసుకోవడం నా భాద్యత. ఒక వ్యక్తి షేర్ మార్కెట్ లో వ్యాపారం చేస్తున్నప్పుడు.. అందులో మార్కెట్ పొజిషన్, ఇతర షేర్ ల వివరాలు ఎలా తెలుసుకుంటారో ఇది అంతే. ఇండ్రస్టీలో జరుగుతున్న విషయాలను, వార్తలను అడిగి తెలుసుకుంటాను. ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు విడుదల అవుతాయి. వాటి రిజల్ట్ ఎలా ఉందో ఆరా తీస్తాను. ఇట్స్ పార్ట్ అఫ్ మై ప్రొఫెషన్ & జాబ్.

అంతటితో మా ఇంటర్వ్యూను ముగించి రకుల్ ప్రీత్ సింగ్ కు అల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు