ఇంటర్వ్యూ : రకుల్ ప్రీత్ సింగ్ – లవ్ & రొమాంటిక్ ‘కరెంట్ తీగ’.

ఇంటర్వ్యూ : రకుల్ ప్రీత్ సింగ్ – లవ్ & రొమాంటిక్ ‘కరెంట్ తీగ’.

Published on Oct 13, 2014 6:41 PM IST

Rakul-Preet-Singh
‘లౌక్యం’ సినిమాలో చంద్రకళగా తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఢిల్లీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ‘కరెంట్ తీగ’ సినిమాతో కవితగా మన ముందుకు రావడానికి రెడీ అయ్యింది. మంచు మనోజ్ సరసన జోడి కట్టిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మంచు విష్ణు నిర్మించారు. అచ్చు సంగీత దర్శకుడు. ఈ సినిమా విశేషాలను తెలియజేయడానికి మీడియాతో సమావేశం అయ్యింది. ఆ విశేషాలు మీకోసం…..

ప్రశ్న) ‘కరెంట్ తీగ’ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి..?

స) ఈ సినిమాలో నేను కవిత అనే స్కూల్ గర్ల్ క్యారెక్టర్ లో నటించాను. ప్రస్తుతం నా వయసు 23 ఏళ్ళు. స్కూల్ గర్ల్ అంటే ఇంకా తక్కువ వయసున్న అమ్మాయిగా కనిపించాలి. అలా కనిపించడం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. ఈ సినిమాలో యునిఫాం డ్రెస్సులు, హాఫ్ సారీ వేసుకోవడం చాలా గొప్ప అనుభూతిని కలిగించింది. రెగ్యులర్ గా నేను ఆ తరహా బట్టలు వేసుకొను. నాకు తండ్రిగా జగపతిబాబు గారు నటించారు. సినిమాలో ఆయనది కీలక పాత్ర.

ప్రశ్న) మంచు మనోజ్ తో మీ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పండి..?

స) జోవియల్ & ఎనర్జిటిక్ పర్సన్. సినిమా టైటిల్ లో ఉన్న పవర్ అంతా అతనిలో ఉంటుంది. లొకేషన్ లో తను నటించబోయే సన్నివేశం గురించి మాత్రమే ఆలోచిస్తాడు. సెట్స్ లో సీరియస్ గా ఉంటాడు. ఒకసారి షూటింగ్ పూర్తయిన తర్వాత చాలా ఎంజాయ్ చేస్తాడు. జోక్స్ వేస్తూ మనల్ని నవ్విస్తాడు.

ప్రశ్న) సన్నీ లియోన్ తో కలసి నటించడానికి ఇబ్బంది పడ్డారా..? డామినేట్ చేస్తుందనే భయం ఏమైనా ఉందా..?

స) సన్నీ లియోన్ నన్ను డామినేట్ చేస్తుందని భావించడం లేదు. సినిమాలో ఎవరి క్యారెక్టర్ వారిది. నాకు టీచర్ పాత్రలో సన్నీ లియోన్ నటించింది. ఆమెతో కలసి నటించడం ఎంజాయ్ చేశాను. ఇన్ ఫాక్ట్.. కొన్ని సన్నివేశాలలో ఆమె తెలుగు డైలాగులు చెప్పడానికి ఇబ్బంది పడుతుంటే నేను హెల్ప్ చేశాను.

ప్రశ్న) సినిమా ఎ జోనర్ కి చెందినది..?

స) లవ్ & రొమాంటిక్ ఫిల్మ్ ఇది. హీరో హీరోయిన్ల మధ్య మంచి సన్నివేశాలు ఉన్నాయి. లవ్ & రొమాన్స్ తో పాటు కావలసినంత యాక్షన్ కూడా ఉంటుంది. పాటలు ఆల్రెడీ హిట్టయ్యాయి. సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను.

ప్రశ్న) ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘లౌక్యం’ తర్వాత ‘కరెంట్ తీగ’తో హట్రిక్ పై కన్నేశారా..?

స) మనం నటించిన సినిమాలన్నీ వరుసగా విజయాలు సాదిస్తుంటే బాగుంటుంది కదా..! హట్రిక్ సక్సెస్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సినిమా విడుదలైన తర్వాత విజయం సాదించడంతో పాటు నాకు, మనోజ్ & ఇతర టెక్నీషియన్లకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.

ప్రశ్న) సినిమాల ఎంపికలో మీరు దేనికి ప్రాధాన్యం ఇస్తారు..?

స) వైవిధ్యమైన పాత్రలలో నేను నటించాలని కోరుకుంటాను. ‘లౌక్యం’లో కొంచం పొగరుబోతు(యారగెంట్) గా నటించాను, చాలా గ్లామరస్ గా కనిపించాను. ‘కరెంట్ తీగ’లో ఇన్నోసెంట్ విలేజ్ గర్ల్ గా, ట్రెడిషనల్ గా కనిపిస్తాను. ఇలా ప్రతి సినిమాకి డిఫరెంట్ గా కనిపించాలనుకుంటాను. తర్వాత కథ, హీరో, దర్శకుడు, బ్యానర్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటాను. ఎందుకంటే కాంబినేషన్ కూడా ముఖ్యమే.

ప్రశ్న) తెలుగు బాగా మాట్లాడుతున్నారు. డబ్బింగ్ చెప్పడం ఎప్పటి నుండి ప్రారంభిస్తారు..?

స) ఇంకొక రెండు సినిమాలలో నటించిన తర్వాత దర్శకులు ఎవరైనా అవకాశం ఇస్తే, డబ్బింగ్ చెప్పడం ప్రారంభిస్తాను. తెలుగు చిత్ర పరిశ్రమ నన్ను బాగా ఆదరించింది. ఒక భాషలో మనం నటిస్తున్నప్పుడు ఆ భాషను గౌరవించాలి. హిందీ సినిమాతో పాటు తెలుగు సినిమాలకు కూడా సమ ప్రాధాన్యం ఇస్తాను. అంటూ ఇంటర్వ్యూను ముగించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు