ఇంటర్వ్యూ : స్టార్ హోదా అంత సులభంగా రాలేదు : రకుల్ ప్రీత్ సింగ్

ఇంటర్వ్యూ : స్టార్ హోదా అంత సులభంగా రాలేదు : రకుల్ ప్రీత్ సింగ్

Published on Dec 14, 2016 5:02 PM IST

rakul
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్లలో లీడ్ లో కొనసాగుతోంది. తెలుగులో ఆమె మంచి విజయాలను సొంతం చేసుకుంది. రకుల్ నటించిన తాజా చిత్రం ధృవ విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో రకుల్ తో జరిగిన ఇంటర్ వ్యూ లో ఆమె చెప్పిన విశేషాల్ని చూద్దాం.

ప్ర ) ధృవ కి స్పందన ఎలా ఉంది ?

జ) అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ చిత్రానికి ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ మొదలైంది. ప్రేక్షకుల స్పందన చూసిన తరువాత చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో కూడా మా చిత్రానికి అద్భుత మైన స్పందన వస్తోంది.

ప్ర ) ఈ చిత్ర పాటలలో మీరు చాలా అందంగా కనిపించారు. షూటింగ్ సమయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు ?

జ ) నా లుక్ విషయంలో చాలా హార్డ్ వర్క్ చేశాను. ‘పరేషానురా’ సాంగ్ కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాను.ఆ పాట చిత్రీకరించే సమయం కొన్ని గంటల పాటు నీరు కూడా తీసుకోలేదు.చరణ్, నేను ఈ చిత్రం లో ఫిట్ గా కనిపించడానికి ప్రయత్నించాం. మేమిద్దరం ఇంత అందంగా కనిపించామంటే ఆ క్రెడిట్ దర్శకుడు సురేందర్ రెడ్డి కి దక్కుతుంది. ఆయన పాటలని చాలా సైలిష్ గా తెరకెక్కించారు.

ప్ర ) సురేందర్ రెడ్డి తో రెండవ సారి పని చేయడం ఎలా అనిపిస్తోంది ?

జ ) ఆయన తో పని చేసిన ప్రతి సారి గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఆయనతో పని చేయడం లో ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ప్ర ) బ్రూస్లీ పరాజయం తరువాత కూడా మీకు ఈ అవకాశం రావడం ఆశ్చర్యంగా అనిపించలేదా ?

జ ) మొదట నాకు కూడా అలాగే అనిపించింది. ఈ క్రెడిట్ మొత్తం సురేందర్ రెడ్డి దే. ఆయన నన్ను నమ్మి ఈ పాత్రని నాకు ఇచ్చారు. అదే సమయంలో హిట్, ప్లాప్ లు నటులు చేతుల్లో ఉండవని నమ్ముతాను.

ప్ర ) ఈసారి మీరు డబ్బింగ్ ఎందుకు చెప్పలేదు ?

జ ) డబ్బింగ్ చెప్పాలనే ప్లానింగ్ చేసుకున్నాము. కానీ నేను బిజీ గా ఉండడంతో అది కుదరలేదు.

ప్ర ) స్టార్ స్టేటస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ?

జ ) నిజానికి ఈ స్థాయికి చేరుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. స్టార్ స్టేటస్ అనేది అభిమానుల వరకే. జీవితం లో ఏదీ ఊరకనే రాదు.

ప్ర ) మీకు ఎవరి దర్శకత్వంలో నటించాలని డ్రీమ్ ఉంది ?

జ ) రాజమౌళి గారి దర్సకత్వం లో నటించాలని ఉంది. ఆయన అద్భుతమైన దర్శకుడు.

ప్ర ) మీ భవిష్యత్తు చిత్రాలు ఏమిటి ?

జ ) మహేష్, సాయి ధరమ్ తేజ్, కార్తీ మరియు నాగ చైతన్య లతో వరుసగా చిత్రాలు చేస్తున్నాను.

ప్ర ) చివరగా, న్యూ ఇయర్ ని ఎలా సెలెబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు ?

జ ) నాలుగు సంవత్సరాల తరువాత నాకు తీరిక దొరికింది. నేను నా స్నేహితులు కలసి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కి గోవా వెళుతున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు