ఇంటర్వ్యూ : రవి కుమార్ చౌదరి – సాయి ధరమ్ తేజ్ ను కొత్త హీరోలా చూడలేదు.

ఇంటర్వ్యూ : రవి కుమార్ చౌదరి – సాయి ధరమ్ తేజ్ ను కొత్త హీరోలా చూడలేదు.

Published on Nov 26, 2014 6:45 PM IST

Ravi-Kumar-Chowdary‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా విజయంతో అందరి దృష్టిని ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకున్నారు దర్శకుడు రవి కుమార్ చౌదరి. రివర్స్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా కథనానికి మంచి పేరొచ్చింది. ‘పిల్లా నువ్వులేని జీవితం’ విజయంతో సంతోషంలో మునిగి తేలుతున్న రవి కుమార్ చౌదరితో కొద్దిసేపు ముచ్చటించాం. ఆ ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం..

ప్రశ్న) ఈ సినిమా సక్సెస్ ను మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు..?

స) చాలా సంతోషంగా ఉంది. ‘పిల్లా నువ్వులేని జీవితం’ సక్సెస్ నాకు కొత్త ఉత్సాహాన్ని అందించింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నన్ను అభినందిస్తుంటే చెప్పలేని ఆనందంగా ఉంది.

ప్రశ్న) మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి..?

స) నాకు ఫోన్ చేసి అభినందించిన మొదటి వ్యక్తి అల్లు అర్జున్. చాలా సేపు నా వర్క్ గురించి గొప్పగా మాట్లాడారు. ఈ సినిమా ప్రారంభం నుండి అతను నాకు దన్నుగా నిలిచాడు. అతని అందించిన సపోర్ట్ మరువలేనిది.

ప్రశ్న) కొత్త హీరో సాయి ధరమ్ తేజ్ తో వర్క్ చేయడం భారంగా అనిపించలేదా..?

స) సాయి ధరమ్ తేజ్ ఒక కొత్త హీరో అని నేను ఎప్పుడూ భావించలేదు. బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. నా కథకు అతని శక్తి సామర్ధ్యాలకు తగ్గట్టు పూర్తి న్యాయం చేశాడు. ప్రేక్షకులు అతన్ని ఒక స్టార్ హీరోలా రిసీవ్ చేసుకోవడం చూసి నేను ఆశ్చర్యపోలేదు.

ప్రశ్న) రేజీనా పెర్ఫార్మన్స్ గురించి చెప్పండి..?

స) ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాలో ఆమె చాలా క్లిష్టమైన పాత్రను పోషించింది. ఎమోషనల్ సన్నివేశాలలో భావోద్వేగాలు పలికించిన తీరు అమోఘం. అద్బుతమైన నటనను కనబరిచింది.

ప్రశ్న) మీ నిర్మాతల గురించి చెప్పండి..?

స) నిజం చెప్పాలంటే, ఈ సినిమా విజయంలో సగ భాగం నిర్మాత బన్ని వాసుకు చెందుతుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుండి నాపై నమ్మకం ఉంచి, నాకు సపోర్ట్ గా నిలిచాడు. నా విజయంలో సగం అందుకోవడానికి వాసు అర్హుడు.

ప్రశ్న) భవిష్యత్ లో ఎటువంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు..?

స) ఎక్కువగా యూత్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ చేయాలని భావిస్తున్నాను.

ప్రశ్న) మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి..?

స) ప్రస్తుతం ఒక ప్రాజెక్ట్ చర్చల దశలో ఉంది. మరో మూడు రోజుల్లో ఆ సినిమా గురించి పూర్తి వివరాలు వెల్లడిస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు