‘బద్రి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత జానీ సినిమాలో కనిపించిన రేను దేశాయ్ పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకుంది. ఇటీవలే వీరిద్దరూ విడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. పవన్ నుంచి సెపరేట్ అయిపోయిన రేణు దేశాయ్ దర్శకత్వం వహించిన తొలి మూవీ ‘ఇష్క్ వాలా లవ్’. మరాఠీ లో నిర్మించిన ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రేణు దేశాయ్ మీడియా మిత్రులతో కాసేపు ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం..
ప్రశ్న) చాలా రోజుల తర్వాత టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఎలా ఫీలవుతున్నారు.?
స) నేను చాలా ఉత్కంఠగా ఫీలవుతున్నాను.. అలాగే మళ్ళీ హైదరాబాద్ లో ఉండడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. హైదరాబాద్ నాకు పుట్టిల్లు లాంటిది. ఇక్కడ నేను మర్చిపోలేని ఎన్నో అనుభూతులు ఉన్నాయి.
ప్రశ్న) ‘ఇష్క్ వాలా లవ్’ సినిమాగురించి చెప్పండి.?
స) ఇష్క్ వాలా లవ్ అనే సినిమా చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ టీనేజ్ లవ్ స్టొరీ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఈ సినిమాకి కథ, దర్శకత్వం మరియు నిర్మాణ బాధ్యతలు కూడా నేనే తీసుకున్నాను.
ప్రశ్న) ఈ సినిమాని తెలుగులో డబ్ చెయ్యడానికి గల కారణం ఏమిటి.?
స) నా సినిమా యూనివర్సల్ థీమ్ తో తెరకెక్కిన చాలా సింపుల్ మూవీ. నా వరకూ ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతుంది అనిపించింది. అందుకే డబ్ చేస్తున్నాను.
ప్రశ్న) పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఏమన్నా చూసారా.?
స) లేదు. పవన్ కళ్యాణ్ ట్రైలర్ చూసారు మరియు ట్రైలర్ ఆయనికి బాగా నచ్చింది.
ప్రశ్న) ఈ సినిమా విషయంలో మీకు పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి సపోర్ట్ లభించింది.?
స) నేను ఎప్పుడన్నా నా సినిమాల గురించి చెబితే పవన్ కళ్యాణ్ ఒకటే అంటారు.. ఏమన్నా అవసరం అయితే నన్ను అడుగు.. లక్కీగా సినిమా మొదలైనప్పటి నుంచీ సినిమా షూటింగ్ హ్యాపీ గా జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా రిలీజ్ అవుతోంది.
ప్రశ్న) ఈ సినిమాతో మీ కొడుకు అఖీర పరిచయం అవుతున్నాడు. తన గురించి చెప్పండి.?
స) అవును.. ఈ సినిమాతో అఖీర పరిచయం అవుతున్నాడు. ఇదంతా ముందుగా అనుకోని చేసింది కాదు అనుకోకుండా సడన్ గా జరిగిపోయింది. ఈ సినిమాలో ఒక చిన్న రోల్ ఉంది. ఆ పాత్రలో అఖీర ని పరిచయం చేస్తే తన మొదటి సినిమాకి నేనే డైరెక్టర్ అని చెప్పుకోవడానికి సెంటిమెంట్ గా బాగుంటుందని అలా చేసాను.
ప్రశ్న) మళ్ళీ నటించడానికి ఏమన్నా ప్లాన్స్ చేసుకుంటున్నారా.?
స) అవును.. మళ్ళీ నటించడానికి నాకు ఆసక్తి ఉంది. వచ్చే ఆఫర్ మరియు బ్యానర్ ని బట్టి నేను ఆలోచిస్తాను.
ప్రశ్న) మీకు స్ఫూర్తినిచ్చే వ్యక్తి ఎవరు.?
స) మీకందరికీ తెలిసిందే.. పవన్ కళ్యాణ్ గారే నాకు స్పూర్తినిచ్చిన వ్యక్తి.. ఆ స్ఫూర్తి వల్లే నేను టైంతో పాటు ముందుకు వెళ్లగలుగుతున్నాను.
ప్రశ్న) హుదుద్ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల సినిమా రిలీజ్ ని ఏమన్నా పోస్ట్ పోన్ చేస్తున్నారా.? లేక అదే డేట్ కి రిలీజ్ చేస్తున్నారా.?
స) అవును.. మేము ఈ సినిమాని వాయిదా వేసాము.. అక్టోబర్ 24న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాము.
ప్రశ్న) మీరు తెలుగు సినిమా ఏమన్నా డైరెక్ట్ చేసే అవకాశం ఉందా.?
స) అది తెలియదండి.. ప్రస్తుతానికి నేను హిందీలో ఓ సినిమా చెయ్యాలని నిర్ణయించుకున్నాను. దానికోసం ఒక సంవత్సరం రోజులుగా ప్లాన్ చేసుకుంటున్నాను..
అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి.. రేణు దేశాయ్ డైరెక్టర్ గా మంచి సక్సెస్ అందుకోవాలని అల్ ది బెస్ట్ చెప్పాము..
CLICK HERE FOR ENGLISH VERSION