ఇంటర్వ్యూ : ‘ఫిదా’ లాంటి సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు – శేఖర్ కమ్ముల

ఇంటర్వ్యూ : ‘ఫిదా’ లాంటి సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు – శేఖర్ కమ్ముల

Published on Jul 18, 2017 3:43 PM IST


లాంగ్ గ్యాప్ తర్వాత దర్శకుడు శేఖర్ కమ్ముల చేసిన చిత్రం ‘ఫిదా’. వరుణ్ తేజ్, సాటి పల్లవులు జంటగా నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలకానున్న సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు మీకోసం..

ప్ర) మొత్తానికి ఒక లవ్ స్టోరీతో వస్తున్నారన్నమాట ?
జ) (నవ్వుతూ) అవును.. చాలా సంవత్సరాల నుండి ఒక లవ్ స్టోరీ చేద్దామని అనుకుంటున్నాను. అందువలనే ఈ ‘ఫిదా’ వచ్చింది. బ్యాక్ డ్రాప్ అనుకోగానే ముందుగా నా దృష్టికి తెలంగాణా వచ్చింది. ఒక తెలంగాణా అమ్మాయి, అమెరికా మెడికో అబ్బాయి ఎలా ప్రేమలో పడ్డారు, వారి జీవితం ఎలా సాగింది అనేదే ఈ కథ.

ప్ర) ముందుగా ఈ సినిమాను స్టార్ హీరోతో చేయాలని అనుకున్నారు కదా ఏమైంది ?
జ) అవును. కొంతమంది హీరోలు కథ కూడా చెప్పాను. తర్వాత వరుణ్ తేజ్ కు ఫిక్సయ్యాను. వరుణ్ లుక్స్, ఫీచర్స్ కి ఈ సినిమాకి బాగా సరిపోయింది. అతనికన్నా బాగా ఈ పాత్రను ఎవరూ చేయలేరు.

ప్ర) సాయి పల్లవిని ఎంచుకోవడానికి కారణం ?
జ) ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా బలంగా ఉంటుంది. ముఖ్యమైంది కూడా. దీనికోసం నేచ్యురల్ బ్యూటీ అయి బలమైన వాయిస్ కలిగిన హీరోయిన్ కావాలి. దానికి సాయి పల్లవి బెస్ట్ ఛాయిస్ అనిపించింది. ఆమె పాత్రలో లీనమై తెలంగాణ భాషను చక్కగా మాట్లాడింది. సినిమాలో ఆమెను చూశాక అమ్మాయిలంతా గర్వంగా ఫీలవుతారు.

ప్ర) దిల్ రాజుగారితో వర్క్ చేయడం ఎలా ఉంది ?
జ) ఆయన, నేను విభిన్నమైన వాతావరణాల్లో పనిచేస్తాం. ఆయన ప్లాన్డ్ సెటప్లో పనిచేస్తారు. నేను సెట్లో అప్పటికప్పుడు నా టీమ్ తో కలిసి వర్క్ చేస్తాను. ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయిపోయాక ఆయన ఎక్కడా కలుగజేసుకోలేదు. స్వేచ్ఛగా పనిచేసుకునే వీలు కల్పించారు.

ప్ర) రెగ్యులర్ లవ్ స్టోరీలకి, ఈ సినిమాకి తేడా ఏంటి ?
జ) స్టీరియో టైప్ స్టోరీలను ఈ సినిమా బ్రేక్ చేస్తుంది. ప్రతి సినిమాలో ఉండే అన్న, అక్క, ఇతర రోటీన్ పాత్రల్ని అధిగమించి చాలా రిఫ్రెషింగా ఉంటుంది. ఇలాంటి సినిమా ఈ మధ్య కాలంలో రాలేదని నేను గట్టిగా చెప్పగలను.

ప్ర) మీరు కమర్షియల్ సినిమాలెప్పుడు చేస్తారు ?
జ) స్టార్ హీరోలు కూడా నాలాంటి మిస్ సెట్ తో ఆలోచించి సినిమాలు చేస్తే కొత్తదనం వస్తుంది. నా దృష్టిలో స్టార్ హీరోలు మాస్ ఇమేజ్ ను పక్కనబెట్టి కొత్త తరహా సినిమాలు చేస్తే ప్రేక్షకుల్లో కూడా మార్పు మెల్లగా వస్తుంది.

ప్ర) సినిమాలు మధ్యలో అంత లాంగ్ గ్యాప్ ఎందుకు తీసుకుంటారు ?
జ) నావరకు ప్రతి సినిమా ఒక కల. నా టైమ్ నేను తీసుకుని చేస్తేనే బెస్ట్ ఔట్ ఫుట్ ఇవ్వగలను. నా ప్రతి సినిమాకి నేను 4, 5 కిలోల బరువు తగ్గుతుంటాను. నా టీమ్ తో కలిసి సమానంగా కష్టపడుతుంటాను.

ప్ర) ‘ఫిదా’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తుందని అనుకుంటున్నారు ?
జ) సినిమాను నాలుగుసార్లు చూశాను. చాలా బాగా వచ్చింది. కమర్షియల్ సినిమాల పొల్యూషన్లో ఒక మంచి ఫ్రెష్ ఎయిర్ వచ్చినట్టు అనిపించింది. సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు