ఇంటర్వ్యూ : శ్రియ శర్మ- నాగార్జునగారితో పని చేయడం చాలా అందంగా ఉంది

ఇంటర్వ్యూ : శ్రియ శర్మ- నాగార్జునగారితో పని చేయడం చాలా అందంగా ఉంది

Published on Sep 13, 2016 6:35 PM IST

shreya-sharma
అన్నపూర్ణ స్థూడిమోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున, మ్యాట్రిక్ టీమ్ వర్క్స్ సంయుక్త సమర్పణలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘నిర్మలా కాన్వెంట్’. ఈ చిత్రంలో రోషన్ సరసన శ్రియ శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 16న విడుదలవుతున్న సందర్బంగా శ్రియ శర్మ తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం..

ప్ర) అసలు మీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి ?
జ) మాది హిమాచల్ ప్రదేశ్. నాన్న ఇంజనీర్, అమ్మ డైటీషియన్ గా చేస్తోంది. చిన్నప్పుడు చాలా కమర్షియల్ యాడ్స్ లో నటించాను. తరువాత నటన పట్ల ఆసక్తి పెరిగి సినిమాలు వైపు వచ్చాను.

ప్ర) సినిమాలో మీ పాత్ర గురించి చెప్తారా ?
జ) ఇది ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ. కొత్తగా ఉంటుంది. ఇందులో నా పేరు శాంతి. కానీ పేరుకు నా స్వభావానికి చాలా తేడా ఉంటుంది. ఎప్పుడూ కోపంగా, గొడవలు పడుతూ ఉంటాను. నా పాత్ర చాలా మంది అమ్మాయిలకి కనెక్టవుతుంది.

ప్ర) పెద్ద పెద్ద స్టార్ నటులతో పనిచేయడం ఎలా ఉంది ?
జ) హీరోయిన్ గా నా మొదటి సినిమా ‘గాయకుడు’. నేను చిన్నప్పుడు రజినీకాంత్, చిరంజీవి, షారుక్ వంటి స్టార్లతో నటించాను. ఇపుడు నాగార్జునగారితో నటించాను. అలాంటి పెద్ద వాళ్లతో నటించడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ నుండి చాలా నేర్చుకున్నాను.

ప్ర) రోషన్ తో పనిచేయడం ఎలా ఉంది ?
జ) రోషన్ కి కూడా హీరోగా ఇది మొదటి సినిమానే. కానీ ఆటను కెమెరా ముందు చాలా ధైర్యంగా నటించాడు. సన్నివేశాల షూటింగ్ కి ముందు ఇద్దరం వాటి గురించి డిస్కస్ చేసుకుని కెమెరా ముందుకు వెళ్ళే వాళ్ళం.

ప్ర) డైరెక్టర్ గురించి మీ అభిప్రాయం ?
జ) డైరెక్టర్ జి. నాగేశ్వర్ రెడ్డిగారు సినిమాని చాలా బాగా తీశారు. ప్రతి సీఎంలు ఫ్రెష్ నెస్ ఉండేలా జాగ్రత్తపడ్డారు. సినిమా అవుట్ ఫుట్ ఇంతా బాగా వచ్చిందంటేఅంతా ఆయన కష్టమే. చైనా చిన్న వివరణను కూడా చాలా బాగా తీశారు.

ప్ర) సంగీత దర్శకుడు రోషన్ సాలూరి గురించి ?
జ) రోషన్ సాలూరిగారి పాటలు ఇప్పటికే మార్కెట్ లో పెద్ద హిట్టయ్యాయి. సినిమాలో నాగార్జునగారు పాట పాడటానికి ఆయనే ముఖ్య కారణం. ఆ పాట చాలా బాగా వచ్చింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా చేశారు. సినిమాలు నాకు ‘ముద్దు.. ‘ అనేపాట చాలా ఇష్టం. మ్యూజిక్, లిరిక్స్, పిక్చరైజేషన్ అన్నీ బాగుంటాయి.

ప్ర) మీ తరువాతి సినిమా ఏంటి ?
జ) ఇప్పటికైతే ఏమీ అనుకోలేదు. ‘నిర్మలా కాన్వెంట్’ రిలీజ్ తరువాతే ఏదైనా. రెండు మూడు ఆఫర్లు వచ్చాయి. కానీ ఇంకా ఏదీ ఫైనల్ చేయలేదు. హిందీలో త్వరలో ఓ సినిమా చేస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు