ఇంటర్వ్యూ : శ్వేతా బసు ప్రసాద్ – అందులో తప్పు ఏముంది..?

ఇంటర్వ్యూ : శ్వేతా బసు ప్రసాద్ – అందులో తప్పు ఏముంది..?

Published on Jan 22, 2015 3:25 PM IST

Shweta-Basu-Prasad-(19)
శ్వేతా బసు ప్రసాద్, ఓ సంచలనం.. ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ అందాల భామ జీవితంలో గత ఏడాది అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిని దైర్యంగా ఎదుర్కుని.. కొత్త జీవితం ప్రారంభించింది. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘ఇంటెలిజెంట్ ఇడియట్స్’ సినిమాలో ఐటెం సాంగులో నటించింది. ఈ సినిమా విశేషాలను తెలియజేయడానికి మీడియాతో సమావేశం అయ్యారు. ఆమె చెప్పిన సంగతులు మీకోసం..

ప్రశ్న) ‘ఇంటెలిజెంట్ ఇడియట్స్’ సినిమాలో మీకు అవకాశం ఎలా వచ్చింది..?

స) 6 నెలల క్రితం దర్శకనిర్మాతలు నన్ను సంప్రదించారు. ఈ సినిమాలో పాటను వినిపించారు. నాకు బాగా నచ్చింది. కథను మలుపు తిప్పే సమయంలో ఈ పాట వస్తుంది. సినిమా పట్ల ఫ్యాషన్ ఉన్న వ్యక్తులు ఈ సినిమాను నిర్మిస్తుండడంతొ స్పెషల్ సాంగ్ అయినా అంగీకరించాను.

ప్రశ్న) హీరోయిన్ గా నటించిన తర్వాత ఐటెం సాంగ్ చేయడం..?

స) నటిగా నాకు పరిధులు విధించుకోవాలని అనుకోవడం లేదు. యాక్టర్ గా నేను ఎటువంటి పాత్ర వచ్చినా చేయడానికి అంగీకరిస్తాను. గెస్ట్ రోల్, కథను ముందుకు తీసుకువెళ్ళే క్యారెక్టర్, స్పెషల్ సాంగ్, ఇంపార్టెంట్ రోల్స్ ఏవి చేయడానికైనా నేను రెడీ. ఐటెం సాంగ్ చేయడం నేను ఇబ్బందిగా ఫీల్ అవడం లేదు.

ప్రశ్న) ఈ సినిమా పబ్లిసిటీకి నిర్మాతలు మీపై ఎక్కువ ఆధారపడుతున్నట్టు ఉన్నారు..?

స) అందులో తప్పు ఏముంది..? నేను కూడా ఈ సినిమాలో భాగమే కదా. సినిమాను ప్రేక్షకులకు చేరువయ్యేలా పబ్లిసిటీ చేయవలసిన భాద్యత నాపై ఉంది.

ప్రశ్న) మీ జీవితంలో జరిగిన కొన్ని తప్పులు ఎటువంటి మార్పు తీసుకొచ్చాయి..?

స) వాటి గురించి నేను మాట్లాడదలచుకోలేదు. తప్పు అని పిలవడాన్ని కూడా నేను ఇష్టపడను. గత ఏడాదిన్న కాలంగా హిందూస్థానీ క్లాసికాల్ మ్యూజిక్ పై ‘రూట్స్’ అనే డాక్యుమెంటరీ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాను. ఈ డాక్యుమెంటరీలో దిగ్గజ సంగీత కళాకారులు కనిపిస్తారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాది డాక్యుమెంటరీని విడుదల చేస్తాను.

ప్రశ్న) తెలుగులో ఇతర సినిమాలేవైనా అంగీకరించారా..?

స) మంచు విష్ణు ఓ సినిమా కోసం నన్ను సంప్రదిచిన మాట వాస్తవమే. విష్ణు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. అయితే, మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు ఇంకా సినిమా ఖరారు కాలేదు. హిందీలో రెండు మూడు సినిమాలు చర్చలు దశలో ఉన్నాయి. కన్ఫర్మ్ అయిన తర్వాత వాటి వివరాలు మీడియాకు అందిస్తాను. మరో విషయం, నాకు మేనేజర్ ఎవరు లేరు. అందువల్ల, నాతో మాట్లాడాలనుకునేవారు డైరెక్ట్ గా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు