ఇంటర్వ్యూ : సురేందర్ రెడ్డి – పర్ఫెక్ట్ స్క్రిప్ట్ దొరికితే ‘రేసుగుర్రం’కి కూడా సీక్వెల్ చేస్తాను.

ఇంటర్వ్యూ : సురేందర్ రెడ్డి – పర్ఫెక్ట్ స్క్రిప్ట్ దొరికితే ‘రేసుగుర్రం’కి కూడా సీక్వెల్ చేస్తాను.

Published on Aug 23, 2015 7:35 PM IST

surender-reddy

‘అతనొక్కడే’, ‘కిక్’, ‘రేసుగుర్రం’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అమితంగా మెప్పించిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఆయన డైరెక్షన్ లో వచ్చిన మరో లేటెస్ట్ మూవీ ‘కిక్ 2’. ఆగష్టు 21న రిలీజ్ అయిన ఈ సినిమాకి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డితో కాసేపు ముచ్చటించాం. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) అసలు ‘కిక్ 2’ అనే సినిమా ఎలా మొదలైందో చెప్పండి.?
స) ‘రేసుగుర్రం’ సినిమా తర్వాత నేను అసలు ఈ సినిమా చెయ్యాలనే ఆలోచనలో లేను. ఒకరోజు కళ్యాణ్ రామ్ వంశీ దగ్గర ఈ కథని విని ఈ సినిమా చేద్దాం అని వచ్చాడు. ఆ తర్వాత కథని ప్రాపర్ గా రెడీ చేసుకొని సెట్స్ పైకి వెళ్ళిపోయాం. కథ అనుకున్నప్పుడే కిక్ వారసుడి కథ కాబట్టి ‘కిక్ 2’ టైటిల్ అనుకున్నాం.

ప్రశ్న) కిక్ 2 అనే టైటిల్ అనుకున్నప్పుడు అంచనాలు పెరుగుతాయి ఆ అంచనాలను అందుకోలేము ఏమో అనే భయం కలిగిందా.?
స) అలాంటి భయం ఏమీ లేదండి. ఎందుకంటే కంటెంట్ ఉంటే చాలు, అది సీక్వెల్ అయినా, డైరెక్ట్ సినిమా అయినా హిట్ అవుద్ది. ఈ సినిమాకి మంచి కంటెంట్ దొరికింది, అందుకే సినిమా తీశాం.

ప్రశ్న) శాంతికి చిహ్నమైన పావురం చేత విలన్ ని చంపించడం అనే పాయింట్ ఎవరి ఐడియా.?
స) ఆ పాయింట్ ని మేము కథ రాసుకున్నప్పుడే క్లైమాక్స్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చెయ్యాలని అనుకున్నాం. అందుకే అలా కొత్తగా రాసుకున్నాం. కథకి కూడా అది పర్ఫెక్ట్ ఎందుకంటే రవితేజ పాత్ర వేరే వాళ్ళ కోసం ఒకరిని చంపే పాత్ర కాదు, అలాగే ఆ ఊరి ప్రజలకి ప్రేమించడం తప్ప చంపడం తెలియదు. అందుకేకథలోనే ఆ పాయింట్ ని రాసుకున్నాం. అనుకున్నట్టుగానే అది బాగా వర్కౌట్ అయ్యింది.

ప్రశ్న) మీ సినిమాలో హై ఎమోషన్స్, యాక్షన్ ఉండేది మొదట్లో, కానీ ఆ తర్వాత కామెడీ వైపు ఎక్కువ మొగ్గు చూపారు. దానికి కారణం.?
స) అలా ఏమీ లేదండి.. కిక్ సినిమాలో చూసుకుంటే హై కామెడీ ఉంటుంది, సెకండాఫ్ లో ఎమోషన్స్ కూడా బాగుంటాయి. ఈ మధ్య ఎమోషన్స్ ని వదలలేదు. ఎమోషన్స్ మరియు కామెడీని సమంగా ఉండేలా చూసుకుంటున్నాను. అదే కిక్ 2 సినిమాలో కూడా ట్రై చేశాను.

ప్రశ్న) మీరు చేసిన సినిమాలలో ఇంకే సినిమాకైనా సీక్వెల్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారా.?
స) చేస్తే ఎక్కువ భాగం కిక్ సినిమాకే మరో సీక్వెల్ చెయ్యాలని ఉంది. అది కాకుండా మంచి స్క్రిప్ట్ దొరికితే రేసుగుర్రం సినిమాకి కూడా చేయచ్చు.

ప్రశ్న) మీకు ఇలాంటి సినిమా చెయ్యాలనే డ్రీమ్ ఏమన్నా ఉందా.?
స) కొన్ని డ్రీమ్ సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా నాకు జేమ్స్ బాండ్ లాంటి సినిమా చేయాలని ఉంది. అలాంటి సినిమా చెయ్యడానికి ఇంకా టైం పడుతుంది.

ప్రశ్న) బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా స్కోప్ పెరిగింది. ఇక నుంచి మల్టీ లాంగ్వేజస్ లో సినిమా చేస్తారా.?
స) మల్టీ లాంగ్వేజస్ లో సినిమా రావడం చాలా మంచిదే. కానీ దానికి హీరోలు ముందుకు రావాలి. అలా హీరోలు వస్తేనే అది సాధ్యం. నాకు తెలిసి ఇప్పుడు స్టార్ హీరోలంతా ఆ విషయంలో స్టెప్ తీసుకుంటున్నారు. కావున త్వరలోనే అది నెరవేరుతుంది.

ప్రశ్న) కిక్ 2 సినిమా చేయాలనే ఆలోచన లేదు వేరే సినిమా చేయాలన్నారు. అది ఎవరితో.?
స) కిక్ 2 కంటే ముందు రామ్ చరణ్ తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాను. కానీ అనుకోకుండా కిక్ 2 అనుకోవడం అలాగే రామ్ చరణ్ కూడా శ్రీను వైట్ల ప్రాజెక్ట్ చేస్తుండడం వలన నేను కూడా కిక్ 2 కి షిఫ్ట్ అయ్యాను.

ప్రశ్న) ఈ మధ్య వరుసగా వక్కంతం వంశీ కథలనే తీసుకుంటున్నారు. మరి రామ్ చరణ్ సినిమాకి మీరే కథ రాస్తున్నారా.? లేక బయట నుంచి తీసుకుంటున్నారా.?
స) రామ్ చరణ్ సినిమాని నేనే స్వయంగా కథ రెడీ చేసుకుంటున్నాను. ప్రస్తుతం కథ కూడా చివరి దశలో ఉంది. త్వరలోనే రామ్ చరణ్ ని కలిసి కథ చెప్పాలి. ఈ ఏడాదిలోనే ఆ సినిమా మొదలవుతుంది. నిర్మాత ఎవరు అనే విషయాన్ని రామ్ చరణ్ నిర్ణయిస్తాడు.

ప్రశ్న) లో బడ్జెట్ లో ఓ సినిమా చెయ్యాలన్నారు. అది ఏమైంది.? అలాగే చాలా మంది దర్శకుల లాగే మీరు నిర్మాణం వైపు వస్తారా.?
స) కచ్చితంగా చేస్తాను. కానీ ఇప్పుడున్న కమిట్ మెంట్స్ వలన కుదరడం లేదు. నిర్మాతగా మారడానికి సిద్దమవుతున్నాను. ప్రస్తుతం అదే దిశగా స్టెప్పులేస్తున్నాను. త్వరలోనే ఆ విషయంపై క్లారిటీ ఇస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు