ఇంటర్వ్యూ : వరుణ్ సందేశ్ – మా పేరెంట్స్ మరో రెండేళ్లలో పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తారు.

ఇంటర్వ్యూ : వరుణ్ సందేశ్ – మా పేరెంట్స్ మరో రెండేళ్లలో పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తారు.

Published on Jul 20, 2014 8:13 PM IST

Varun-Sandesh
శేఖర్ కమ్ముల ‘హ్యాపీ డేస్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ హీరో వరుణ్ సందేశ్. ఆ తర్వాత వరుసగా హీరోగా సినిమాలు చేస్తున్న వరుణ్ సందేశ్ రేపు తన 25వ పుట్టిన రోజుని జరుపుకోనున్నాడు. తన పుట్టిన రోజు సందర్భంగా తనతో కాసేపు ముచ్చటించి తన బర్త్ డే విశేషాలను, తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి కనుక్కున్నాం.. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) మీ కెరీర్లో మైలురాయిగా నిలిచిన సినిమా ఏది.?

స) నా కెరీర్ కి బిగ్గెస్ట్ మైలురాయి అంటే నా మొదటి సినిమా ‘హ్యాపీ డేస్’ అనే చెబుతాను. మొదటి సినిమానే శేఖర్ కమ్ములతో చేయడం అదృష్టం అని చెప్పాలి. నా 7 ఏళ్ళ కెరీర్లో 17 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇది కూడా ఓ మైలురాయిలా భావిస్తున్నాను.

ప్రశ్న) ‘సూపర్ స్టార్ కిడ్నాప్’ సినిమాలో మీరు ఉన్నారా.?

స) నేను సూపర్ స్టార్ కిడ్నాప్ సినిమాలో నటించడం లేదు. డైరెక్టర్ ముందుగా నన్ను అప్రోచ్ అయ్యాడు కానీ నా డేట్స్ అడ్జస్ట్ కాలేక ఈ సినిమా వదులుకున్నాను.

ప్రశ్న) త్వరలో రానున్న ‘నువ్విలా నేనిలా’ సినిమా గురించి చెప్పండి.?

స) ‘నువ్వలా నేనిలా’ ఒక లవ్ స్టొరీ. ఇందులో నా రియల్ లైఫ్ కి దగ్గరగా ఉండే ఎన్నారై పాత్రలో కనిపిస్తాను. పెర్ఫార్మన్స్ కి ఎక్కువ ఆస్కారం ఉన్న పాత్ర.

ప్రశ్న) మీరు చేయబోయే సినిమాని ఎలా ఎంచుకుంటారు.?

స) నా వరకూ అయితే ఒక సినిమా సెలెక్ట్ చేసుకోవడానికి కథే కీలకం, ఆ తర్వాత డైరెక్టర్. కథ చెప్పేటప్పుడే డైరెక్టర్ కథపై కాన్ఫిడెంట్ గా ఉన్నాడా లేదా అనేది పరిశీలిస్తాను. అలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అంటే తనకి స్టొరీ మీద చాలా నమ్మకంగా ఉన్నట్టు. అప్పుడు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాను.

ప్రశ్న) పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు? లవ్ మ్యారేజ్ చేసుకుంటారా లేదా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా?

స) ప్రస్తుతానికి పెళ్లి అనేది నా లిస్టులో లేదు. మరో రెండేళ్ళ తర్వాత నా తల్లి తండ్రులు నా పెళ్లి గురించి ఫోర్స్ చేస్తారు. ప్రస్తుతానికి లవ్ అనేది లేదు. రానున్న రెండేళ్ళలో ఏమి జరుగుతుందో నేను ఇప్పుడు చెప్పలేను.

ప్రశ్న) మీ బర్త్ డే రోజున కొత్తగా ఏమేమి ప్రారంభించనున్నారు.?

స) బర్త్ డే అన్నది కొత్త పనులకి శ్రీకారం అని నేను అనుకోను. మనం కొత్త పనులను ఎప్పుడైనా, ఏ రోజైనా ప్రారంభించవచ్చు.

ప్రశ్న) నీ తరం యంగ్ హీరోస్ తో మీ రిలేషన్ షిప్ ఎలా ఉంటుంది.?

స) ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోస్ తో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. మనోజ్, నాని, నిఖిల్, తనీష్ లు బాగా క్లోజ్ గా ఉంటాం. అంతే కాకుండా అప్రతి ఒక్కరి ఫంక్షన్ కి అందరం అటెండ్ అవుతాం. ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేసుకుంటాం. నేను ప్రతి సినిమా బాగా ఆడాలని కోరుకుంటాను. ఎందుకంటే అప్పుడే ఆ నిర్మాతలు. డైరెక్టర్స్ మరిన్ని సినిమాలు చేయడానికి ముందుకు వస్తారు.

ప్రశ్న) మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి.?

స) ‘నువ్వలా నేనిలా’ సినిమా విడుదలకి సిద్దమైంది. ఇది కాకుండా ‘పడ్డానండీ ప్రేమలో మరి’, ‘లవ కుశ’ సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. మొదటి సారి ‘లవ కుశ’ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నాను.

అంతటితో వరుణ్ సందేశ్ కి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి మా ఇంటర్వ్యూని ముగించాం..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు