ఇంటర్వ్యూ: రమణ తేజ- నాగ శౌర్య రెండేళ్లు కష్టపడి ఈ కథను రాశారు.

ఇంటర్వ్యూ: రమణ తేజ- నాగ శౌర్య రెండేళ్లు కష్టపడి ఈ కథను రాశారు.

Published on Jan 29, 2020 2:26 PM IST

నాగ శౌర్య, మెహ్రిన్ హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అశ్వథామ. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. దీనితో దర్శకుడు రమణ తేజ మీడియా సమావేశంలో పాల్గొని చిత్ర విశేషాలు పంచుకున్నారు.

అసలు మీ నేపథ్యం ఏమిటీ?

మాది చిత్తూరు జిల్లా మదనపల్లి. అక్కడే స్కూలింగ్ పూర్తయ్యింది. తరువాత తమిళనాడులో బి టెక్ పూర్తి చేశాను. యూఎస్ కి హయ్యర్ స్టడీస్ కోసం వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా స్క్రీన్ రైటింగ్ లో మాస్టర్స్ చేశాను.

 

సినిమా పరిశ్రమకులోకి రావడానికి స్ఫూర్తి?

మా ఇంట్లో వాళ్ళందరూ సినిమాలు ఎక్కువగా చూస్తారు. ఓ మూవీకి వెళ్లొచ్చిన తరువాత ఇంట్లో దాని గురించి డిస్కస్ చేసేవాళ్ళం. అలాగే చిన్నప్పటి నుండి చిరంజీవి గారి అభిమానిని కావడంతో ఆయన సినిమాలు ఎక్కువగా చూసేవాడిని, అలా సినీ పరిశ్రమలోకి రావాలనే ఆశ కలిగింది.

 

అశ్వథామ కథను నాగ శౌర్య రాశారట, మీరు కథలు రాయరా?

నాకు కథలు రాయడం పై అంత పట్టు లేదు. రాయగలను కానీ చాల సమయం పడుతుంది. ఓ కథకు మంచి స్క్రీన్ ప్లే రాయగలను. ఒక కథ పూర్తి అయిన తరువాత నా పని మొదలవుతుంది. నాగ శౌర్య గారు రెండేళ్లు కష్టపడి మనసు పెట్టి ఈ కథను రాశారు.

 

శ్రీచరణ్ ను పాటలకు, బీజీఎమ్ కొరకు జిబ్రాన్ తీసుకోవడానికి కారణం?

 

జిబ్రాన్ బీజీఎమ్ ఇవ్వడంలో ఎక్స్పర్ట్, ఆయనకు ఒకసారి కథచెప్పిన తరువాత పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతారు. ఆయన గత చిత్రాలు చూసినా, బీజీఎమ్ ఎంత గొప్పగా ఇస్తారో మనకు అర్థం అవుతుంది. ఇక శ్రీ చరణ్ సాంగ్స్ బాగా ఇస్తారు.

 

ఆడవాళ్ళ మీద జరిగే అన్యాయాల గురించి అంటున్నారు, ఇటీవల సంఘటనల ఆధారంగా తీశారా?

 

అలా ఏమి కాదు, దిశా లాంటి సంఘటన జరగక ముందే ఈ కథను సిద్ధం చేశారు. ఒక కోణం కాదు ఆడవారి పట్ల సమాజం ద్రుష్టి, అన్యాయాలు వంటి విషయాలు ప్రధానంగా అశ్వథామ చిత్రం ఉంటుంది.

 

మీకు నచ్చిన జోనర్ ఏమిటీ?

డ్రామా నేను బాగా ఇష్టపడతాను. టాలీవుడ్ దర్శకులలో క్రిష్ గారంటే చాలా ఇష్టం. ఆయన తీసిన కృష్ణమ్ వందే జగద్గురుమ్ లాంటి సినిమా తీయాలి అనేది నా కోరిక.

 

నాగ శౌర్య తో ట్రావెల్ చేయడం ఎలా ఉంది?

నాగ శౌర్య సొంత అన్నయ్యలా నన్ను ప్రతి విషయంలో గైడ్ చేసి సపోర్ట్ ఇచ్చారు. నాకు ఇప్పుడు కేవలం 26 సంవత్సరాలు ఆయన సపోర్ట్ లేకపోతే ఇంత పెద్ద సినిమా తీయగలిగేవాడిని కాదు.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు