ఇంటర్వ్యూ: నాగచైతన్య- స్క్రిప్ట్ రెడీ అయితే నాన్న నేను ఆ సినిమాలో కలిసి చేస్తాం.

ఇంటర్వ్యూ: నాగచైతన్య- స్క్రిప్ట్ రెడీ అయితే నాన్న నేను ఆ సినిమాలో కలిసి చేస్తాం.

Published on Dec 11, 2019 11:37 AM IST

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా దర్శకుడు బాబీ తెరకెక్కించిన చిత్రం వెంకీ మామ. రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తుండగా సురేష్ ప్రొడక్షన్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. ఈనెల 13న గ్రాండ్ గా వెంకీ మామ విడుదల కానుంది. ఈ సంధర్భంగా హీరో నాగచైతన్య పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.

వెంకీ మామ దగ్గరనుండి ఏమి నేర్చుకున్నారు?

వ్యక్తిగా, నటుడిగా ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. సెట్స్ లో ఆయన ప్రశాంతంగా ఉంటారు. అలాగే నటన పరంగా కామెడీ టైమింగ్, ఎమోషన్స్ విషయంలో ఆయన్ని పరిశీలించి కొత్త విషయాలు తెలుసుకున్నాను.

వెంకటేష్ గారు సెట్స్ లో అప్పుడప్పుడు కోప్పడతారని విన్నాము?

సురేష్ గారు అలాగే వెంకటేష్ గారు ఒక్కొక్కసారి సడన్ గా సీరియస్ అవుతారు. అనుకొన్న సమయానికి పని జరగకపోతే వారికి అలా కోపం వస్తుంది. మళ్ళీ వెంటనే కూల్ అయిపోతారు.

ఈ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

చదువు కోసం సిటీ వెళ్లి అక్కడే పెరిగి , హాలిడేస్ కి పల్లెటూరికి వచ్చిన అబ్బాయిగా నేను కనిపిస్తాను. నేను ఆర్మీలో ఎందుకు జాయిన్ అవ్వాల్సివచ్చింది అనేది మూవీలోని అసలు ట్విస్ట్.

సొంత మామయ్య గారి బ్యానర్ లో మూవీ ఇంత ఆలస్యం కావడానికి కారణం?

సురేష్ బాబు గారు నాకు ఎప్పటి నుండో నాకు లవ్, యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ కి సంబంధించిన ఎన్నో స్క్రిప్ట్స్ పంపించారు. అనుకోని కారణాల వలన అవేవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికి వెంకీ మామ చిత్రంతో కుదిరింది.

హీరోయిన్ రాశి ఖన్నా గురించి చెప్పండి?

మనం సినిమాలో నాతో ఆమె రెండు నిమిషాల నిడివిగల చిన్న సన్నివేశంలో నటించారు. ఇన్నేళ్ళలో నటన పరంగా ఆమెలో చాలా మార్పులు వచ్చాయి. ఆమె నటించిన తొలిప్రేమ చిత్రం అంటే నాకు చాలా ఇష్టం. ఈ మూవీలో మా కెమిస్ట్రీ చాలా బాగుంటుంది .

 

మీ కెరీర్ లో బెస్ట్ మల్టీ స్టారర్ వెంకీ మామ అనొచ్చా?

దీనిని మల్టీ స్టారర్ అనలేను.., వెంకటేష్ గారి పక్కన నేను ఓ పాత్ర చేశాను అనడానికి ఇష్టపడతాను.

 

మూవీలో హైలెట్స్ అంటే ఏమి చెవుతారు?

ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ అభిమానం కలిగిన మామ అల్లుళ్ళ మధ్య నడిచే ఫన్ , ఎమోషన్స్ శాక్రిఫైస్ అనేది ఈమూవీకి హైలెట్. అందరికీ కనెక్ట్ ఐయ్యే కాన్సెప్ట్ తో వెంకీ మామ తెరకెక్కింది.

 

పదేళ్ల కెరీర్ లో లైఫ్ గురించి ఏమి నేర్చుకున్నారు ?

చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా ఫెయిల్యూర్ నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఫెయిల్యూర్ అనేది పార్ట్ అఫ్ ది లైఫ్. అలాగే సోషల్ మీడియాలో చాలా నెగెటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. వాటిని యాక్సప్ట్ చేయాలి. వాటిని నుండి మనల్ని మనం మార్చుకోవాలి.

 

నాగార్జున, వెంకటేష్ లో ఉన్న ఒక సేమ్ క్వాలిటీ ఏమిటీ?

ఏదైనా నిర్ణయాన్ని వెంటనే తీసేసుకుంటారు.తాతయ్య ఏఎన్ ఆర్ , రామానాయుడు గారిలో కూడా ఇవే లక్షణాలు చూశాను . ఇక సినిమాల పరంగా ఇద్దరు పూర్తిగా విరుద్ధం. వీరిద్దరూ చేసిన సినిమాల జోనర్స్ చూస్తే అది తెలుస్తుంది.

 

శేఖర్ కమ్ముల సినిమా ఎంత వరకు వచ్చింది?

శేఖర్ కమ్ముల గారితో చేస్తున్న చిత్రం ఒక బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీ దాదాపు 40 శాతం పూర్తయింది. టైటిల్ ఇంకా నిర్ణయించలేదు.

 

వచ్చే ఏడాది నాన్నగారితో చేశే అవకాశం ఉందా?

బంగార్రాజు మూవీ స్క్రిప్ట్ విషయంలో నాన్నగారు సంతృప్తి చెందలేదు , దీనితో దర్శకుడు స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారు. ఒకవేళ స్క్రిప్ట్ పూర్తయితే ఆ మూవీలో కలిసి చేస్తాం.

 

కాశ్మీర్ ఎపిసోడ్ కొరకు చాలా కష్టపడ్డారట?

నేనేమి కష్టపడలేదు, కానీ యూనిట్ మాత్రం రోజు ఆ ఎక్విప్ మెంట్ మోస్తూ రెండు గంటలు మంచులో నడవాల్సివచ్చేది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు