ఇంటర్వ్యూ : సురేందర్ రెడ్డి – ‘రేసు గుర్రం’కి ‘తడాఖా’కి పోలిక లేదు.!

ఇంటర్వ్యూ : సురేందర్ రెడ్డి – ‘రేసు గుర్రం’కి ‘తడాఖా’కి పోలిక లేదు.!

Published on Apr 10, 2014 3:45 AM IST

surendar

‘అతనొక్కడే’, ‘అశోక్’, ‘కిక్’ లాంటి సినిమాలు తీసి టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న విలక్షణ దర్శకుడు సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డి మొదటి సారి అల్లు అర్జున్ హీరోగా చేసిన సినిమా ‘రేసు గుర్రం’. అల్లు అర్జున్ తోపాటు కిక్ శ్యామ్, శృతి హసన్ నటించిన ఈ సినిమా ఏప్రిల్ 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలను తెలుసుకోవడానికి సురేందర్ రెడ్డితో కాసేపు ముచ్చటించాం….

ప్రశ్న) ‘రేసు గుర్రం’ని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అని ఏమైనా భయం ఉందా?

స) నిజం చెప్పాలంటే, ఈ సినిమా మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రేక్షకుల స్పందన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.

ప్రశ్న) ఈ సినిమాకి ‘రేసు గుర్రం’ అనే టైటిల్ ఎందుకు పెట్టారు?

స ) రేసులో పాల్గొనే అన్ని గుర్రాలకి, తమ గమ్యం చేరుకోవాలనే లక్ష్యం ఒక్కటే ఉంటుంది. కానీ మా సినిమాలో హీరోకి చాలా లక్ష్యాలు ఉంటాయి, అన్ని లక్ష్యాలు ఉన్నా అన్నిటినీ ఒక్కడే సాధిస్తాడు. అందుకే ఈ సినిమాకి ‘రేసు గుర్రం’ అనే టైటిల్ పెట్టాం.

ప్రశ్న) ఈ సినిమా స్టొరీ లైన్ గురించి చెబుతారా?

స ) భిన్నమైన పనులు చేసే ఇద్దరు అన్నదమ్ముల కథే ఈ సినిమా. నియమ నిబంధనలు పాటించేవాడు ఒక్కడైతే, తనదైన శైలిలో ఏ పని నైన పూర్తి చేసే వాడు మరొక్కడు. అలాంటి భిన్నాభిప్రాయాలు ఉన్న అన్నదమ్ముల ఒకేచోట ఉంటే ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్నది ఇందులో చూపించాం.

ప్రశ్న) అల్లు అర్జున్ తో పని చేయడం ఎలా అనిపించింది?

స ) ‘రేసు గుర్రం’ సినిమా బన్ని కోసమే రాసిన్నట్టుగా ఉంటుంది, బన్ని సినిమాకి పూర్తి న్యాయం చేశాడు. బన్నితో పనిచేయడం ఒక అద్భుతమైన అనుభూతి, తను నాకు ఒక స్నేహితుడి కంటే ఎక్కువ అని ఫీలవుతాను.

ప్రశ్న) సినిమాలో శృతి హసన్ పాత్ర ఎలా ఉంటుంది?

స ) ఈ సినిమాలో శ్రుతి హసన్ ది ఒక వినోదాత్మకమైన పాత్ర. తన పాత్ర ప్రేక్షకులని నవ్వులతో అలరిస్తుంది.

ప్రశ్న) ‘రేసు గుర్రం’ సినిమా ‘తడాఖా’ని పోలి ఉంటుందని వార్తలు వస్తున్నాయి, దీని గురించి మీరు ఏమంటారు?

స) ‘తడాఖా’కు ‘రేసు గుర్రం’కి అస్సలు పోలికే ఉండదు. ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చేలా, పూర్తి వినోదం మరియు ఎమోషన్స్ తో రుపొందించబడిన ఒక కొత్త కథ.

ప్రశ్న) బన్ని ఒక స్టైలిష్ నటుడు, మీరు ఒక స్టైలిష్ డైరెక్టర్… మరి ఈ సినిమా ఎంత స్టైలిష్ గా ఉండబోతుంది?

స) పూర్తి సినిమా చాలా స్టైలిష్ గా ఉంటుంది. రేసు గుర్రం ఇంత స్టైలిష్ అండ్ కలర్ఫుల్ గా రాడానికి ముఖ్య కారకుడు, ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస. తన ప్రతిభతో, అతను ఈ సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాడు.

ప్రశ్న) ‘రేసు గుర్రం’ నిర్మాణ విలువల గురించి ఏమైనా చెబుతారా ?

స) ఈ సినిమా ఇలా వచ్చిందంట్టే, దానికి సంభందించి పూర్తి క్రెడిట్ బుజ్జి గారికే దక్కుతుంది. మేము అడిగిన దానికి తను ఏనాడు కుదరదు అని చెప్ప లేదు. సినిమా షూటింగ్ నుంచి సినిమా విడుదల వరకు అన్ని అనుకున్నవి అనుకున్నట్టు చేశారు.

ప్రశ్న) మీరు తీయబోయే తదుపరి సినిమాలు ఏంటి ?

స ) ఆగస్ట్ లో ‘కిక్ 2’ మొదలుపెడుతున్నాను. అనంతరం కొత్త నటీనటులతో ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తియబోతున్నాను.

ప్రశ్న) బాలీవుడ్ కి వెళ్ళాలనే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా?

స ) అవును ఉన్నాయి, తెలుగులో ఒక పెద్ద హిట్ ఇచ్చాక.. బాలీవుడ్ లో అడుగు పెట్టాలనుకుంటున్నాను.

‘రేసు గుర్రం’ సినిమా విజయం సాధించాలని కోరుకుంటూ సురేందర్ రెడ్డికి ఆల్ ది బెస్ట్ చెప్పి మా ఇంటర్వ్యూని ముగించాం…

సంబంధిత సమాచారం

తాజా వార్తలు